బాలయ్య నయా రికార్డ్.. ఏకంగా ఐదు సినిమాలతో సెన్సేషన్ !!

నందమూరి నటసింహం బాలకృష్ణకి దేశవ్యాప్తంగా ఉన్న క్రేజ్ గురించి చెప్పాల్సిన పని లేదు. మాస్ డైలాగ్స్, పవర్‌ఫుల్ స్క్రీన్ ప్రెజెన్స్‌కి బాలయ్య పెట్టింది పేరు. ఎన్టీఆర్ నటవారసత్వాన్ని కొనసాగిస్తూ స్టార్ హీరోగా కొనసాగుతున్నారు. సినిమాల్లో కూడా వరుసగా నాలుగు సినిమాలు హిట్ కొట్టి ఫుల్ ఫామ్ లో ఉన్న ఆయన.. రీసెంట్ గానే "అఖండ 2" మూవీతో ప్రేక్షకుల ముందుకు వచ్చారు. బోయపాటి శ్రీను దర్శకత్వంలో వచ్చిన ఈ మూవీ.. వారి కాంబినేషన్ లో హ్యాట్రిక్ హిట్స్ తర్వాత మరో బ్లాక్ బస్టర్ గా నిలిచింది.

కాగా వయసుతో సంబంధం లేకుండా బాక్సాఫీస్ వద్ద రికార్డులు సృష్టిస్తున్న ఆయన.. యువ హీరోలకు కూడా సాధ్యం కాని అరుదైన ఘనతను తన ఖాతాలో వేసుకున్నారు. సినిమా వసూళ్ల గణాంకాల ప్రకారం.. బాలకృష్ణ వరుసగా ఐదు సినిమాలను రూ.100 కోట్ల క్లబ్‌లో చేర్చి సరికొత్త రికార్డు సృష్టించారు. దీంతో బాలయ్య జోరు ఏమాత్రం తగ్గలేదని, అసలైన బాక్సాఫీస్ వేట ఇప్పుడే మొదలైందని సోషల్ మీడియాలో పోస్టులు పెడుతున్నారు. ఇలా వరుసగా ఐదు చిత్రాలు రూ.100 కోట్ల మార్కును దాటడం అసాధారణ ఘనతగా చెబుతున్నారు. ఈ నయా రికార్డు వ్యవహారం టాలీవుడ్‌లో ఫుల్ హాట్ టాపిక్ గా మారింది.

nandamuri-balakrishna-created-record-as-5-movies-continuously-on-100-crores-collection

వరుసగా ఐదు హిట్స్..

  • ఈ ప్రస్థానం 2021 డిసెంబర్ 2న విడుదలైన 'అఖండ'తో మొదలయ్యింది. ఆ మూవీ రూ.150 కోట్లు సాధించి భారీ హిట్ సాధించింది.
  • ఆ తర్వాత 2023 జనవరి 12న ఆడియన్స్ ముందుకు వచ్చిన 'వీరసింహారెడ్డి' రూ.134 కోట్లు కొల్లగొట్టి మంచి హిట్ అందుకుంది.
  • అదే ఏడాది అక్టోబరు 19న 'భగవంత్ కేసరి' రూ.138 కోట్లు వసూళ్లు అందుకొని బ్లాక్ బస్టర్ గా నిలిచింది.
  • నాలుగో చిత్రంగా 2025 జనవరి 12న విడుదలైన 'డాకూ మహరాజ్' బాక్సాఫీస్ వద్ద సెన్సేషన్ సృష్టించింది. రూ.130 కోట్లు కలెక్షన్స్ అందుకుంది ఆ చిత్రం.
  • ఇక ఇప్పుడు లేటెస్ట్ గా వచ్చిన "అఖండ-2 తాండవం" సైతం ప్రేక్షకుల మనసులు గెలుచుకుంది. డిసెంబర్ 12న ప్రేక్షకుల ముందుకు వచ్చిన ఈ సినిమా ఇప్పటివరకు రూ.102 కోట్లు రాబట్టింది.

ప్రస్తుతం బాలకృష్ణ.. గో పీచంద్ మలినేని దర్శకత్వంలో తన నెక్స్ట్ సినిమాని అనౌన్స్ చేశారు. రీసెంట్ గానే పోస్టర్ ని రిలీజ్ చేయగా.. త్వరలోనే రెగ్యులర్ షూటింగ్ ప్రారంభం కానుంది. ఇందులో బాలకృష్ణ మరోసారి ద్విపాత్రాభినయంలో కనిపించనున్నారు. పిరియాడికల్ మైథాలజీ కాన్సెప్ట్ తో రాబోతున్న ఈ సినిమాకు తమన్ సంగీతం అందించబోతున్నారు. వృధ్ధి సినిమాస్ బ్యానర్ పై వెంకట సతీష్ కిలారు నిర్మిస్తున్నారు. ఈ మూవీలో నయనతార హీరోయిన్ గా నటిస్తుండగా.. ఇప్పటికే విడుదలైన పోస్టర్‌లు సోషల్ మీడియాలో ఫుల్ వైరల్ అవుతున్నాయి.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+