సీఎం జగన్‌కు చంద్రబాబు రాసిన లేఖపై విజయసాయిరెడ్డి వ్యాఖ్యలను సమర్థిస్తారా? మీ కామెంట్ ఏంటి?
మాజీ సీఎం, టీడీపీ అధ్యక్షుడు చంద్రబాబు నాయుడుకి వైసీపీ ఎంపీ విజయసాయి రెడ్డి కౌంటర్లు కంటిన్యూ అవుతున్నాయి. ఇప్పటికే పలు అంశాలపై మాజీ ముఖ్యమంత్రిని ట్విట్టర్ వేదికగా కార్నర్ చేసిన ఆయన.. తాజాగా జగన్‌కు రాసిన లేఖపై స్పందించారు. ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌కు చంద్రబాబు రాసే మొదటి లేఖ ప్రజా సమస్యలపై ఉంటుందనుకున్నామని విజయసాయి రెడ్డి సటైర్ వేశారు. 40ఏళ్ల అనుభవానికి తానుండే విలాసవంతమైన భవనం ఉంటుందా పోతుందా అనే సంశయం తప్ప ఇంకేం కనిపించడంలేదని, ప్రపంచం మొత్తాన్ని అమరావతికి రప్పిస్తానన్న వ్యక్తికి సొంత ఇల్లు కట్టుకునే ఆలోచనే లేనట్లుందంటూ ట్వీట్ చేశారు.
ఏపీ రాజధానిలో కృష్ణా కరకట్ట వెంట నిర్మించిన ప్రజావేదిక భవనాన్ని తమకు ఇవ్వాలని కోరుతూ చంద్రబాబు సీఎం జగన్‌కు లేఖ రాశారు. బుధవారం మధ్యాహ్నం ఆ లేఖ ముఖ్యమంత్రికి అందినప్పటికీ ఇప్పటి వరకు దానిపై ఎలాంటి స్పందన రాలేదు.
సిఎం జగన్ గారికి చంద్రబాబు రాసే మొదటి లేఖ ప్రజా సమస్యల పైన ఉంటుందనుకున్నాం. 40 ఏళ్ల అనుభవానికి తను ఉండే విలాసవంతమైన నివాసం ఉంటుందా, పోతుందా అనే సంశయం తప్ప ఇంకేమీ కనిపించడం లేనట్టుంది. ప్రపంచం మొత్తాన్నిఅమరావతికి రప్పిస్తా అన్న వ్యక్తికి సొంత ఇల్లు కట్టుకునే ఆలోచన లేనట్టేగా?
— Vijayasai Reddy V (@VSReddy_MP) June 6, 2019
ఇదిలా ఉఁటే టెండర్లలో అవినీతికి ఆస్కారం లేకుండా సిట్టింగ్ హైకోర్టు జడ్జి నేతృత్వంలో జ్యూడిషీయల్ కమిషన్ ఏర్పాటు చేయాలన్న ఏపీ ప్రభుత్వ నిర్ణయంపై విజయసాయి రెడ్డి సంతోషం వ్యక్తంచేశారు. ఇది సాహసోపేత నిర్ణయమని ప్రశంసించారు. జగన్ పాలన ఎంత పారదర్శకంగా ఉండబోతోందన్న దానికి ఇదొక చిన్న ఉదాహరణ అని ఆయన మరో ట్వీట్ చేశారు.

ప్రజా సమస్యలను పక్కనబెట్టిన చంద్రబాబు స్వలాభం కోసం జగన్‌కు లేఖ రాయడంపై విజయసాయి రెడ్డి స్పందన సమంజసమని మీరు భావిస్తున్నారా? దీనిపై మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో చెప్పండి.












Click it and Unblock the Notifications