భద్రాచలం ఏపీకి ఇవ్వాలన్న ప్రతిపాదనపై మీ కామెంట్ పోస్ట్ చేయండి
హైదరాబాద్ : భద్రాద్రి ఏ ప్రాంతానికి చెందుతుంది అనే చర్చ మొదలైంది. భద్రాద్రి మినహా మిగతా ప్రాంతమంతా ఏపీలో కలువడంతో .. భద్రాద్రిని కూడా ఆంధ్రప్రదేశ్‌లో కలుపాలనే డిమాండ్ వస్తోంది. ఈ అంశంపై ఇప్పటికే ఏపీ సీఎం జగన్, తెలంగాణ సీఎం కేసీఆర్‌ను కోరినట్టు తెలుస్తోంది. అందుకు గులాబీ దళపతి కూడా సానుకూలంగా స్పందించినట్టు విశ్వసనీయంగా తెలిసింది.
తెరపైకి భద్రాద్రి ..?
రాష్ట్ర విభజన తర్వాత తెలంగాణ, ఏపీ సవ్యంగా పరిపాలనపై ఫోకస్ చేశాయి. పోలవరం ప్రాజెక్టు కోసం కూనవరం, వీఆర్ పురం, చింతూరు సహా ఏడు మండలాలను ఏపీలో అప్పటి ఎన్డీఏ సర్కార్ విలీనం చేసింది. దీనిపై తెలంగాణ ఉద్యమ సంఘాలు, ప్రజాసంఘాల నుంచి తీవ్ర వ్యతిరేకత వచ్చింది. తర్వాత పరిస్థితి సద్దుమణిగింది. కానీ ఏపీ అసెంబ్లీ ఎన్నికల్లో చంద్రబాబు భద్రాచలం గురించి ప్రస్తావించారు. దీంతో భద్రాచలం ఏపీలో కలుపాలనే డిమాండ్ చాలారోజుల తర్వాత తెరపైకి వచ్చింది.

ఇటీవల ఇఫ్తార్ విందు సందర్భంగా ఇరురాష్ట్రాల సీఎంలు జగన్, కేసీఆర్ మధ్య కూడా చర్చ వచ్చినట్టు తెలిసింది. హైదరాబాద్‌లో ఉన్న ఏపీ భవనాలను తెలంగాణకు ఇచ్చిన జగన్ .. భద్రాచలం ఇవ్వాలని కోరారని .. ఇందుకు కేసీఆర్ కూడా సమ్మతించినట్టు విశ్వసనీయంగా తెలిసింది. దీనికి గవర్నర్ కూడా సుముఖంగా ఉన్నారని .. కేంద్రం కూడా భద్రాద్రిని ఏపీలో కలిపేందుకు అంగీకారంతో ఉన్నదని ప్రచారం జరుగుతుంది. ఈ క్రమంలో భద్రాద్రి సీతారాముని గ్రామాన్ని ఏపీలో కలిపేందుకు తెలంగాణ ప్రజలు అంగీకరిస్తారా ? భద్రాద్రిని ఏపీలో కలుపాలని అక్కడి ప్రజలు నిజంగా కోరుకుంటున్నారా ? మీ కామెంట్ తెలియజేయండి.












Click it and Unblock the Notifications