వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

ప్రధానిని తామే డిసైడ్ చేస్తామంటున్న టీఆర్ఎస్, టీడీపీ మాటలను నమ్ముతారా? మీ కామెంట్ పోస్ట్ చేయండి

|
Google Oneindia TeluguNews

లోక్‌సభ ఎన్నికల తర్వాత కేంద్రంలో చక్రం తిప్పేదే తామేనంటూ ఇటు టీఆర్‌ఎస్, అటు తెలుగుదేశం పార్టీలు ఢంకా బజాయించి చెబుతున్నాయి. కారు - సారు - పదహారు నినాదంతో ఢిల్లీలో సర్కారు ఏర్పాటు చేస్తామని టీఆర్‌ఎస్ అంటోంది. అందుకోసం తమకు మరోసారి ఓటువేసి గెలిపించాలని అభ్యర్థిస్తోంది. వాస్తవానికి 16వ లోక్‌సభలో మజ్లిస్, బీజేపీ, కాంగ్రెస్‌కు చెందిన ఒక్కో ఎంపీని మినహాయిస్తే మిగిలిన 14 మంది టీఆర్ఎస్ ఎంపీలు టీఆర్‌ఎస్‌కు చెందినవారే. అలాంటప్పుడు 14 మంది మద్దతు ఉన్నప్పుడు కేంద్రంలో తమ హవా చూపని టీఆర్ఎస్ మరో రెండు సీట్లు పెంచుకుని ప్రధానిని తానే ఎలా డిసైడ్ చేస్తుందన్నది ప్రతిపక్షాల ప్రశ్న.

మరోవైపు చంద్రబాబు సైతం ఎన్నికల తర్వాత కేంద్రంలో తమ సత్తా ఏంటో చూపుతామని అంటున్నారు. ఫెడరల్ ఫ్రంట్ ఏర్పాటు చేస్తామని పీఎంను తామే డిసైడ్ చేస్తామని చెబుతున్నారు. అందుకోసం మరోసారి తమకు అవకాశం ఇవ్వాలని కోరుతున్నారు. అయితే డబుల్ డిజిట్‌లో ఎంపీలు ఉన్నప్పటికీ కనీసం ప్రత్యేక హోదా సాధించుకోలేని టీడీపీ సర్కారు.. ఫెడరల్ ఫ్రంట్ ఏర్పాటు చేసి పీఎం అభ్యర్థిని నిర్ణయిస్తామంటూ ప్రజలను మోసగిస్తోందని విపక్షాలు విమర్శిస్తున్నాయి. టీఆర్ఎస్, టీడీపీల వాదనలపై అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో తెలియజేయండి.

TRS, TDP Claiming that they will decide Future PM: How Do You Respond
English summary
TRS, TDP Claiming that they will decide Future PM: How Do You Respond
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X