రాత పరీక్ష లేకుండానే 21,413 ఉద్యోగాలు.. ఈరోజే లాస్ట్ డేట్ ?
నిరుద్యోగులకు అదిరిపోయే బంపర్ ఆఫర్ ఇచ్చింది తపాలా శాఖ. కేవలం పదో తరగతి మార్కుల ఆధారంగా ఎలాంటి నియామక పరీక్ష లేకుండా భారీగా తపాలా ఉద్యోగాలకు ప్రకటన జారీ చేసింది. దేశ వ్యాప్తంగా మొత్తం 21,413 గ్రామీణ డాక్ సేవక్ ఉద్యోగాలను ఈ నోటిఫికేషన్ కింద భర్తీ చేయనున్నారు. ఇక తెలుగు రాష్ట్రాల్లో ఏపీలో 1215, తెలంగాణలో 519 చొప్పున ఉద్యోగాలు ఉన్నట్టు ప్రకటించింది. అయితే నేటితో ఈ పోస్టులకు అప్లై చేసుకునేందుకు గడువు ముగియనుంది.
నోటిఫికేషన్ గురించి పూర్తి వివరాలు..
ఖాళీలు..
మొత్తం - 21,413
( ఏపీ - 1215, తెలంగాణ - 519 )

ఎంపిక విధానం..
ఎలాంటి నియామక పరీక్ష లేకుండా కేవలం పదో తరగతిలో వచ్చిన మార్కుల ఆధారంగా దేశ వ్యాప్తంగా ఉన్న వివిధ పోస్టల్ సర్కిళ్లలో ఉద్యోగాలు భర్తీ చేయనున్నారు. గణితం, ఆంగ్లం, స్థానిక భాషల్లో తప్పని సరిగా నైపుణ్యం ఉండాలి.
జాబ్ రోల్..
బ్రాంచ్ పోస్టు మాస్టర్, అసిస్టెంట్ బ్రాంచ్ పోస్టు మాస్టర్, డాక్ సేవక్
వయస్సు పరిమితి..
మార్చి 3, 2025 నాటికి 18 నుంచి 40 ఏళ్ల మధ్య వయసు ఉండాలి. ఎస్సీ, ఎస్టీలకు అయిదేళ్లు, ఓబీసీలకు మూడేళ్లు, దివ్యాంగులకు పదేళ్లు గరిష్ఠ వయసు సడలింపు వర్తిస్తుంది.
వేతనం..
పోస్టులను బట్టి సుమారు రూ.10 నుంచి రూ.29 వేల వరకు జీతం పొందవచ్చు.
దరఖాస్తు ఫీజు..
ఎస్సీ, ఎస్టీ, మహిళలు, దివ్యాంగులు, ట్రాన్స్‌జెండర్ - ఉచితం
జనరల్ అభ్యర్థులు - రూ.100 చెల్లించాలి.
దరఖాస్తు గడువు..
ఈ ఉద్యోగాల కోసం దరఖాస్తు చేసుకునే వారు మార్చి 3వ తేదీ రాత్రి 11 గంటల 59 నిమిషాల వరకు దరఖాస్తు చేసుకోవడానికి అవకాశం ఉంటుంది. ఇప్పటి వరకు దరఖాస్తు చేసుకోని అభ్యర్ధులు ఈ చివరి అవకాశాన్ని సద్వినియోగపరచుకోవచ్చు.
దరఖాస్తు విధానం..
దరఖాస్తు చేసుకునే అభ్యర్ధులు ఫోన్ నంబర్, మెయిల్ ఐడీ, వ్యక్తిగత వివరాలతో ముందుగా రిజిస్టర్ చేసుకోవాలి. పదో తరగతి మార్కులు, ఆధార్‌కార్డు, ఫొటోలు, అప్‌లోడ్ చేయాల్సి ఉంటుంది. దరఖాస్తు పూర్తిచేసిన అనంతరం జిల్లాలో ఉన్న ఖాళీల ప్రకారం ప్రాధాన్యత ఇస్తే మీ రిజిస్ట్రేషన్ ప్రక్రియ ముగుస్తుంది. మార్చి 6, 2025 నుంచి మార్చి 8, 2025 వరకు దరఖాస్తు సవరణలకు అవకాశం ఉంటుంది.
ఇక ఈ పోస్టులకు ఎంపికైనవారు రోజుకు నాలుగు గంటలు పనిచేస్తే సరిపోతుందని.. వీటితోపాటు ఇండియన్ పోస్టల్ పేమెంట్ బ్యాంకుకు సంబంధించిన సేవలకు గానూ ప్రత్యేకంగా ఇన్సెంటివ్ రూపంలో బీపీఎం/ ఏబీపీఎం/ డాక్ సేవక్‌లకు ప్రోత్సాహం అందిస్తారని స్పష్టం చేశారు.
-
అంచనాలను తలకిందులు చేస్తోన్న బంగారం ధరలు -
ఉగాది నుంచి వృషభరాశి, మేషరాశి వారి జాతక ఫలం -
Work From Home ఇచ్చేశారు. ప్రభుత్వం, ఐటీ దిగ్గజాల కీలక ప్రకటన! -
ICC T20I ర్యాంకింగ్స్: దూసుకొచ్చిన సంజూ, ఇషాన్ - అభిషేక్ ఏ స్థానంలో..!! -
రైతులకు శుభవార్త.. రైతు భరోసాపై కీలక ప్రకటన చేసిన మంత్రి! -
తమిళ నాట అధికారం వారిదే, విజయ్ కు దక్కే సీట్లెన్ని- తేల్చేసిన కేకే సర్వే..!! -
2024 నాటి భీభత్సం మళ్లీ వస్తుంది: ఈ వేసవి చాలా కాలం ఉంటుంది! -
ఉగాది నుంచి మిథున రాశి, కర్కాటక రాశి వారి జాతక ఫలం -
ఇన్నాళ్లూ ఆచితూచి- ఇప్పుడు ప్రధాని మోదీపై సీఎం డైరెక్ట్ అటాక్? -
భారత్‌పై అమెరికా దర్యాప్తు. సెక్షన్ 301 ప్రయోగించిన ట్రంప్ -
దేశంలో తొలి `కారుణ్య మరణం`- తీర్పు చెబుతూ కన్నీళ్లు పెట్టిన సుప్రీంకోర్టు ధర్మాసనం -
తెలంగాణ నూతన డీజీపీ ఖరారు, అనూహ్య ఎంపిక..!!












Click it and Unblock the Notifications