తెలంగాణలో ప్రశాంతంగా ముగిసిన గ్రూప్-1 ప్రిలిమినరీ పరీక్ష: 75 శాతం హాజరు

హైదరాబాద్: తెలంగాణలో ఆదివారం గ్రూప్-1 ప్రిలిమినరీ పరీక్ష ప్రశాంతంగా ముగిసింది. రాష్ట్ర వ్యాప్తంగా నిర్వహించిన పరీక్షకు 75 శాతం మంది అభ్యర్థులు హాజరయ్యారని టీఎస్‌పీఎస్సీ తెలిపింది. 503 పోస్టులకు గానూ.. 3.80 లక్షల మంది అభ్యర్థులు దరఖాస్తులు చేసుకున్నారు.

గ్రూప్-1 పరీక్ష కోసం రాష్ట్ర వ్యాప్తంగా 1019 పరీక్ష కేంద్రాల్ని ఏర్పాటు చేయగా.. 2,86,051 అభ్యర్థులు హాజరయ్యారు. పరీక్షా కేంద్రాల్లో అభ్యర్థుల బయోమెట్రిక్ తీసుకున్నా అధికారులు.. కేంద్రంలోకి షూలు, ఎలక్ట్రానిక్ పరికరాలను అనుమతించలేదు.

 75 percent attendance in telangana group-1 exam.

ఎనిమిది రోజుల్లో ఓఎంఆర్ షీట్ల స్కానింగ్ ప్రక్రియ పూర్తవుతుందని, ఆ తర్వాత ప్రాథమిక కీ విడుదల చేస్తామని టీఎస్‌పీఎస్సీ ఒక ప్రకటనలో తెలిపింది. తెలంగాణ ఏర్పడిన తర్వాత మొట్టమొదటిసారిగా గ్రూప్-1 పరీక్షలు నిర్వహించడంతోపా భారీ సంఖ్యలో అభ్యర్థులు పరీక్ష రాసేందుకు ఆసక్తి చూపారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+