విద్యార్థులకు అలర్ట్.. ఇకనుంచి ఏడాదికి రెండుసార్లు సీబీఎస్ఈ పరీక్షలు..
విద్యార్థులకు ముఖ్య గమనిక.. ఇకనుంచి ఏడాదికి రెండుసార్లు సీబీఎస్ఈ పరీక్షలను నిర్వహించేందుకు గతకొంతకాలంగా కేంద్ర విద్యాశాఖ కసరత్తు చేస్తున్న సంగతి తెలిసిందే. తాజాగా ఈ నూతన విధానంపై మరో కొత్త ఆప్‌డేట్‌ను కేంద్ర విద్యాశాఖ అందించింది. 2025-26 విద్యా సంవత్సరం నుంచే ఈ విధానాన్ని అమలుచేసేలా ప్రణాళికలు వేయాలని సీబీఎస్‌ఈని కోరింది. సీబీఎస్‌ఈ పదోతరగతి, 12వ తరగతి బోర్డు పరీక్షలు ఇకనుంచి ఏడాదికి రెండుసార్లు నిర్వహించేలా కేంద్ర విద్యాశాఖ నిర్ణయం తీసుకుంది.
ఈ నేపథ్యంలోనే పన్నెండో తరగతి పరీక్షలపై త్వరలోనే ఓ నిర్ణయానికి రానున్నట్లు తెలుస్తోంది. ఇందులో భాగంగానే మార్చి నెలలో ఒకసారి, జూన్ నెలలో రెండోసారి సీబీఎస్ఈ బోర్డు పరీక్షలు నిర్వహించే అంశాన్ని కేంద్రం పరిగణనలోకి తీసుకోనుంది. సీబీఈఎస్ఈ పరీక్షలు ఏడాదిలో రెండుసార్లు నిర్వహించే అంశంపై నిర్వహించే అంశంపై పాఠశాలల ప్రిన్సిపాళ్లతో సీబీఎస్‌ఈ విస్తృత సంప్రదింపులు జరిపింది. అందులో సెమిస్టర్ విధానంపై చర్చలు జరగగా, దానిపై ఏకాభిప్రాయం కుదరలేదు. ఇప్పటిలాగే ఫిబ్రవరిలో, మార్చిలో 12వ తరగతి బోర్డు పరీక్షలు నిర్వహించి, అనంతరం జూన్‌లో మరోసారి అవకాశం ఇవ్వాలని నిర్ణయించినట్లు తెలుస్తోంది. ఈ సిఫార్సులను కేంద్ర విద్యాశాఖ దృష్టికి తీసుకెళ్లినట్లు సమాచారం. ప్రస్తుతం పన్నెండో తరగతి విద్యార్థులకు ఫిబ్రవరి, మార్చి నెలలో సీబీఎస్ఈ బోర్డు పరీక్షలు జరుగుతున్నాయి. మేలో ఫలితాలను విడుదల అవుతున్నాయి. అనంతరం విద్యార్థులు ఏదైనా ఒక సబ్జెక్టులో మార్కులను పెంచుకునేందుకు 'సప్లిమెంటరీ పరీక్షలు' రాయొచ్చు. పాస్ కాని 'కంపార్ట్‌మెంట్' విద్యార్థులకు ఇక సప్లిమెంటరీ రాసే అవకాశముంది.

త్వరలోనే అధికారిక ప్రకటన..
ఒకవేళ నూతన విద్యా విధానం అమల్లోకి వస్తే మాత్రం మార్చిలో పరీక్షలు రాసిన విద్యార్థులు జూన్‌లో మరోసారి అన్ని పరీక్షలు రాసే అవకాశం ఉంటుంది. అయితే, అది పూర్తిగా విద్యార్థుల ఇష్టంతోనే ఆధారపడి ఉంటుంది. కానీ, అది తప్పనిసరేం కాదట. ఇక, రెండోసారి రాసే పరీక్షల్లో అన్ని పరీక్షలు కాకుండా తమకు మార్కులు తక్కువ వచ్చిన ఒకటో రెండో పరీక్షలు కూడా రాసుకునే అవకాశం ఇవ్వనున్నట్లు తెలుస్తోంది. దీనిపై త్వరలోనే అధికారిక ప్రకటన వచ్చే అవకాశముంది.












Click it and Unblock the Notifications