యూజీసీ నెట్ అభ్యర్థులకు అలర్ట్.. కొత్త పరీక్షల షెడ్యూల్ ప్రకటించిన ఎన్‌టిఎ..!
యూజీసీ నెట్ అభ్యర్థులకు అలర్ట్.. నెట్ కొత్త పరీక్షల షెడ్యూల్‌ను ఎన్‌టిఎ ప్రకటించింది. యూజీసీ నెట్ పరీక్ష జూన్ 18న నిర్వహించిన సంగతి తెలిసిందే. అయితే, పరీక్ష జరిగిన మరుసటి రోజే రద్దైన విషయం అందరికీ తెలిసిందే. తాజాగా కొత్త పరీక్షల షెడ్యూల్‌ను ఎన్‌టిఎ విడుదల చేసింది. ఆగస్టు 21వ తేది నుంచి సెప్టెంబర్ 4వ తేది వరకు యూజీసీ నెట్ పరీక్షలు జరుగుతున్నట్లు ప్రకటించింది. వీటితోపాటు రద్దైన, వాయిదా పడిన ఇతర పరీక్షలకు సంబంధించిన వివరాలను కూడా నేషనల్ టెస్టింగ్ ఏజన్సీ వెల్లడించింది.
యూజీసీ-నెట్ పరీక్ష జూనియర్ రీసెర్చ్ ఫెలోషిప్, అసిస్టెంట్ ప్రొఫెసర్ల నియామకం, పీహెచ్డీ కోర్సుల్లో ప్రవేశాల కోసం నిర్వహిస్తారు. ఇందులో వచ్చే ర్యాంకును బట్టి ఆయా కోర్సుల్లో ప్రవేశాలు పొందొచ్చు. ఈ పరీక్ష ప్రతి ఏటా నిర్వహిస్తారు. పీజీలో సంబంధిత సబ్జెక్టుల్లో ఉత్తీర్ణులైనవారు ఈ పరీక్షను రాసుకోవచ్చు. ఈ ప్రవేశ పరీక్ష ఎన్‌టిఎ ఆధ్వర్యంలో నిర్వహించబడుతుంది. ఇక, ఈ ఏడాది ఈ పరీక్ష జూన్ 18వ తేదిన నిర్వహించిన సంగతి తెలిసిందే. ఈసారి యూజీసీ నెట్ పరీక్షను ఆఫ్‌లైన్ పద్ధతిలో ఒకేరోజు నిర్వహించడం జరిగింది.

ఈ పరీక్ష నిర్వహణలో అవకతవకలు జరిగాయనే ఆరోపణల నేపథ్యంలో ఈ పరీక్షను మరుసటి రోజే రద్దు చేశారు. ప్రశ్నాపత్రం డార్క్ నెట్ లో లీక్ అయిందని, టెలిగ్రామ్ యాప్లో సర్క్యులేట్ అయిందని కేంద్ర విద్యాశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ తెలిపారు. ప్రస్తుతం ఈ కేసు సీబీఐ దర్యాప్తు చేస్తోంది. అయితే రీషెడ్యూల్ చేసిన పరీక్షను గతంలో మాదిరిగా కంప్యూటర్ బేస్డ్ టెస్ట్ విధానంలోనే నిర్వహించనున్నారు.
తాజాగా విడుదల చేసిన రీషెడ్యూల్ ప్రకారం యూజీసి నెట్ పరీక్షలు 2024 ఆగస్టు 21వ తేది నుంచి సెప్టెంబర్ 4వ తేది వరకు జరగనున్నాయి. వీటితోపాటు 'ఎన్‌సెట్' పరీక్షను జులై 10వ తేదీన, 'సీఎస్ఐఆర్- యూజీసీ నెట్' పరీక్షను జులై 25వ తేది నుంచి 27 తేదీల మధ్య నిర్వహిస్తామని ఎన్‌టిఎ ప్రకటించింది. ఇక, ఆలిండియా ఆయుష్ పీజీ ఎంట్రెన్స్ టెస్టు ముందుగా ప్రకటించిన షెడ్యూల్ ప్రకారమే జులై 6వ తేదిన జరుగుతుందని స్పష్టం చేసింది












Click it and Unblock the Notifications