AP DSC 2024: ఏపీ డీఎస్సీలో ఈడబ్ల్యూఎస్ కోటా ఆప్షన్- వారికి అవకాశం లేనట్లేనా?
ఏపీలో చాలాకాలం తర్వాత విడుదలైన డీఎస్సీ నోటిఫికేషన్ లో అధికారులు చేసిన ఓ తప్పిదం వేల మంది అభ్యర్ధుల పాలిట శాపంగా మారే అవకాశాలు కనిపిస్తున్నాయి. తాజా నోటిఫికేషన్ ప్రకారం డీఎస్సీకి దరఖాస్తు చేసుకునే అభ్యర్ధులకు ఈడబ్ల్యూఎస్ రిజర్వేషన్ కల్పించలేదు. దీనిపై అభ్యర్ధుల్లో ఆందోళన మొదలైంది. ఈ నెల 12 నుంచి దరఖాస్తుల స్వీకరణ ప్రారంభమైనా ఈడబ్ల్యూఎస్ రిజర్వేషన్ కల్పించకపోవడంపై ఆభ్యర్ధులు ఆందోళనకు దిగడంతో ప్రభుత్వం సవరణ చేసింది.
డీఎస్సీ దరఖాస్తులకు ఉద్దేశించిన వెబ్ సైట్ లో ప్రభుత్వం ఈడబ్ల్యూఎస్ ఆప్షన్ ను నిన్న జత చేసింది. అయితే ఈ నెల 12న దరఖాస్తులు మొదలైన తర్వాత మూడు రోజుల పాటు భారీ సంఖ్యలో అభ్యర్ధులు ఈడబ్ల్యూఎస్ కోటాకు అర్హత ఉండి కూడా ఆప్షన్ లేకపోవడంతో సాధారణ అభ్యర్ధుల తరహాలోనే దరఖాస్తు చేసుకున్నారు. దీంతో ఇప్పుడు ఈ డబ్ల్యూఎస్ కోటాలో దరఖాస్తు చేసుకుంటున్న వారితో పాటు ఇప్పటికే వివిధ రిజర్వేషన్ కేటగిరీల కింద దరఖాస్తు చేసుకున్న వారితో పోలిస్తే వెనుకబడాల్సిన పరిస్దితి నెలకొంది.

ఈ నేపథ్యంలో ఇప్పటికే తాము చేసిన దరఖాస్తుల్ని ఎడిట్ చేసుకునే ఆప్షన్ కల్పించాలనే డిమాండ్లను అభ్యర్ధులు చేస్తున్నారు. అయితే ప్రభుత్వం మాత్రం వీరు తిరిగి రూ.750 ఫీజు చెల్లించి కొత్తగా దరఖాస్తు చేసుకోవాలని సూచిస్తున్నారు. దీంతో ఓసారి ఫీజు కట్టిన తర్వాత కూడా ప్రభుత్వ తప్పిదాలతో మరోసారి దరఖాస్తు చేయాల్సిన అవసరం వచ్చిందని వాపోతున్నారు. ఈ నేపథ్యంలో ప్రభుత్వం ఇప్పటికే సమర్పించిన దరఖాస్తుల్ని ఎడిట్ చేసే ఆప్షన్ ఇస్తుందా లేదా అన్న చర్చ జరుగుతోంది.
మరోవైపు డీఎస్సీ పరీక్షకు తగినంత సమయం ఇవ్వలేదంటూ ఇప్పటికే హైకోర్టులో పిటిషన్లు దాఖలవుతున్నాయి.












Click it and Unblock the Notifications