AP DSC 2024: ఇవాళ డీఎస్సీ నోటిఫికేషన్ - వెబ్ సైట్లో దరఖాస్తుల స్వీకరణ- పూర్తి వివరాలివే..!
ఏపీలో 6100 ఉపాధ్యాయ ఉద్యోగాల భర్తీ కోసం ప్రభుత్వం సిద్ధమవుతోంది. ఇందులో భాగంగా ఇప్పటికే ఉద్యోగాల భర్తీ కోసం నిర్వహించే టెట్, డీఎస్సీ పరీక్షల షెడ్యూల్ ను విడుదల చేసింది. వీటి ప్రకారం ఇవాళ డీఎస్సీ నోటిఫికేషన్ విడుదల కానుంది. అధికారికంగా వెబ్ సైట్ ప్రారంభం, దరఖాస్తుల స్వీకరణ ప్రక్రియ కూడా మొదలు కానుంది. దీనికి సంబంధించిన వివరాలు ఇలా ఉన్నాయి.
ఉపాధ్యాయ ఉద్యోగాల భర్తీ కోసం టెట్, డీఎస్సీని ప్రభుత్వం వేర్వేరుగా నిర్వహిస్తోంది. రెండు పరీక్షల్నీ కంప్యూటర్ విధానంలోనే నిర్వహిస్తున్నారు. వీటి నిర్వ హణలో అభ్యర్ధులకు ఎలాంటి ఇబ్బందులు లేకుండా ఎప్పటికప్పుడు పూర్తి సమాచారం అందించేందుకు వీలుగా డీఎస్సీకి సంబంధించిన అధికారిక వెబ్ సైట్ ను ప్రభుత్వం ప్రారంభిస్తోంది. https://apdsc.apcfss.in/ పేరుతో రూపొంందించిన ఈ వెబ్ సైట్ ను విద్యాశాఖ మంత్రి బొత్స సత్యనారాయణ ఇవాళ అధికారికంగా ప్రారంభిస్తారు.

https://apdsc.apcfss.in/ వెబ్ సైట్ ఇప్పటికే సిద్ధం చేశారు. అయితే ఇందులో ఆప్షన్లు పూర్తిగా ఓపెన్ కాలేదు. ఇవాళ మంత్రి అధికారికంగా ప్రారంభించిన తర్వాత ఇందులో దరఖాస్తుల స్వీకరణ, ఫీజు చెల్లింపుతో పాటు ఇతర ఆప్షన్లు అందుబాటులోకి వస్తాయి. వీటికి ముందే మంత్రి డీఎస్సీ నోటిఫికేషన్ ను అధికారికంగా విడుదల చేస్తారు. అనంతరం వెబ్ సైట్ ను కూడా ప్రారంభిస్తారు. దీంతో పాటే దరఖాస్తుల స్వీకరణ ప్రారంభమవుతుంది.
ఈసారి ప్రభుత్వం విడుదల చేసిన షెడ్యూల్ ప్రకారం డీఎస్సీ అప్లికేషన్ల స్వీకరణ ఇవాళ ఆన్ లైన్ లో ప్రారంభమవుతుంది. ఆన్ లైన్లోనే ఫీజు చెల్లించేందుకు ఆప్షన్ ఉంటుంది. వచ్చే నెల 15 నుంచి 30 వరకూ డీఎస్సీ పరీక్షలు ఉంటాయి. మార్చి 31 కల్లా ప్రాథమిక ఆన్సర్ కీ విడుదల చేస్తారు. అభ్యంతరాలు తెలిపేందుకు ఏప్రిల్ 1 వరకూ అవకాశం కల్పిస్తారు. అనంతరం ఏప్రిల్ 2న తుది ఆన్సర్ కీ విడుల చేస్తారు. అనంతరం ఏప్రిల్ 7న ఫలితాలు ప్రకటిస్తారు.
-
లబ్దిదారులకు రెండు ఉచిత వంటగ్యాస్ సిలిండర్లు, రూ. 2,500 రీఛార్జ్ రేషన్ కార్డ్ -
బంగారం ధరల్లో వరస్ట్ డౌన్ ఫాల్- 2008 తర్వాత -
40 దేశాల్లో.. అండర్ వరల్డ్ డాన్‌గా జూనియర్ ఎన్టీఆర్ విశ్వరూపం -
కోట్లకు పడగెత్తిన విజయ్ రైట్ హ్యాండ్ -
సిమెంట్- స్టీల్ ధరలు భారీగా పెంపు, ఇక నుంచి..!? -
ఏపీ ప్రభుత్వం మరో ఎన్నికల హామీ అమలు, రేపే ప్రారంభం..!! -
తిరుపతిలో ఎయిర్ పోర్టును తలదన్నేలా..!! -
ఏపీ ప్రజలకు డిసెంబర్ లోగా మరో బహుమానం.. ఫిక్స్ చేసిన సీఎం చంద్రబాబు -
బిగ్ షాక్: ఏప్రిల్ 1 నుంచి పెరగనున్న పెట్రోల్, డీజిల్ ధరలు.. -
రాహుల్ గాంధీతో డేటింగ్ కోరిక తీరలేదు - బాలీవుడ్ స్టార్ -
అనుష్క కొత్త సినిమా ట్రైలర్ రిలీజ్.. ప్రభాస్ బాహుబలిని మించి !! -
ఆ పార్టీ కండువా కప్పుకొన్న టెన్నిస్ దిగ్గజం- రాజకీయాల్లో ఎంట్రీ












Click it and Unblock the Notifications