Get Updates
Get notified of breaking news, exclusive insights, and must-see stories!

AP DSC 2024 notification: డీఎస్సీ నోటిఫికేషన్ విడుదల- పోస్టుల వివరాలు- ముఖ్యమైన తేదీలివే..!

డీఎస్సీ నోటిఫికేషన్

ఏపీలో 6100 ఉపాధ్యాయ ఖాళీల భర్తీ కోసం ప్రభుత్వం ఇవాళ డీఎస్సీ నోటిఫికేషన్ విడుదల చేసింది. రాష్ట్రంలో ఖాళీగా ఉన్న ఉపాధ్యాయ ఉద్యోగాల భర్తీ కోసం ప్రభుత్వం దీన్ని నిర్వహిస్తోంది. ఇప్పటికే విద్యాశాఖ మంత్రి బొత్స సత్యనారాయణ డీఎస్సీ పరీక్ష నిర్వహణకు సంబంధించిన షెడ్యూల్ రిలీజ్ చేశారు. దీని ప్రకారం ఇవాళ అధికారికంగా నోటిఫికేషన్ విడుదల అయింది. దీంతో దరఖాస్తుల స్వీకరణతో పాటు ఇతర ప్రక్రియలు కూడా మొదలయ్యాయి.

AP DSC 2024 notification released- here are important dates, other details

డీఎస్సీ వెబ్ సైట్

రాష్ట్రంలో ఈ ఏడాది నిర్వహిస్తున్న డీఎస్సీ పరీక్ష నిర్వహణ కోసం ప్రభుత్వం అధికారిక వెబ్ సైట్ ను ప్రారంభించింది. https://apdsc.apcfss.in/ పేరుతో రూపొందించిన ఈ వెబ్ సైట్ ను విద్యాశాఖ మంత్రి బొత్స సత్యనారాయణ ఇవాళ అధికారికంగా ప్రారంభించారు. ఇందులో నోటిఫికేషన్, వివిధ కేటగిరీల వారీగా ఖాళీలు, దరఖాస్తుల స్వీకరణ, ఫీజు చెల్లింపు, ముఖ్యమైన తేదీలు, ఇతర వివరాలను అందుబాటులో ఉంచారు. అలాగే cse.ap gov.in వెబ్ సైట్ లోనూ పూర్తి వివరాలు అందుబాటులో ఉంచుతున్నారు.

దరఖాస్తు- పరీక్షల తేదీలు

ఈసారి ప్రభుత్వం విడుదల చేసిన షెడ్యూల్ ప్రకారం డీఎస్సీ అప్లికేషన్ల స్వీకరణ ఇవాళ ఆన్ లైన్ లో ప్రారంభమైంది. ఈ నెల 22 వరకూ దరఖాస్తుల్ని స్వీకరిస్తారు. ఆన్ లైన్లోనే ఫీజు చెల్లించేందుకు ఆప్షన్ ఇచ్చారు. మార్చి 5 నుంచి హాల్ టికెట్లు డౌన్ లోడ్ చేసుకునే అవకాశం కల్పిస్తారు. వచ్చే నెల 15 నుంచి 30 వరకూ డీఎస్సీ పరీక్షలు నిర్వహించనున్నారు. జనరల్ అభ్యర్ధులకు 44 ఏళ్లు గరిష్ట వయోపరిమితిగా నిర్ణయించారు. రిజర్వుడు అభ్యర్ధులకు మరో ఐదేళ్ల వెసులుబాటు కల్పించారు.

డీఎస్సీ పరీక్ష సమయాలు- ఫలితాలు

డీఎస్సీ పరీక్షల్ని ఉదయం‌ 9.30 గంటల నుంచి 12 గంటల వరకు ఒక సెషన్ గా...మధ్యాహ్నం 2.30 గంటల నుంచి సాయంత్రం 5 గంటల వరకు రెండవ సెషన్ గా పరీక్షలు నిర్వహిస్తారు. మార్చి 31 కల్లా ప్రాథమిక ఆన్సర్ కీ విడుదల చేస్తారు. అభ్యంతరాలు తెలిపేందుకు ఏప్రిల్ 1 వరకూ అవకాశం ఉంటుంది. అనంతరం ఏప్రిల్ 2న తుది ఆన్సర్ కీ విడుదల చేస్తారు. అనంతరం ఏప్రిల్ 7న ఫలితాల ప్రకటనతో ఈ ప్రక్రియ ముగుస్తుంది.

డీఎస్సీలో కేటగిరీ వారీ ఖాళీలు

అన్ని కేటగిరీలు కలిపి ఉమ్మడి జిల్లాల వారీగా ఖాళీల్ని చూసుకుంటే శ్రీకాకుళం జిల్లాలో 283, విజయనగరం జిల్లాలో 284, విశాఖపట్నం 329, తూర్పు గోదావరి 392, పశ్చిమగోదావరి 306, కృష్ణా 279, గుంటూరు 416, ప్రకాశం 503, నెల్లూరు 346, చిత్తూరు 336, కడప 386, కర్నూలు 1693 పోస్టులున్నాయి. వీటితో పాటు పీజీటీ 215, ప్రిన్సిపాల్ పోస్టులు 42 ఉన్నాయి. అలాగే విద్యాశాఖలో ఎస్టీజీ పోస్టులు 2000 ఉంటే, గిరిజన సంక్షేమ శాఖలో 280 పోస్టులున్నాయి. స్కూల్ అసిస్టెంట్లు విద్యాశాఖలో 2060 ఉంటే గిరిజన శాఖలో 226 ఉన్నాయి. గిరిజన సంక్షేమ శాఖ ఆధ్వర్యంలోని రెసిడెన్షియల్ స్కూళ్లలో 13 పోస్టులున్నాయి.

More From
Prev
Next
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+