నిరుద్యోగులకు ఏపీ ప్రభుత్వం గుడ్ న్యూస్.. ఆయుష్ విభాగంలో పోస్టుల భర్తీ !
ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం రాష్ట్రంలోని నిరుద్యోగులకు గుడ్ న్యూస్ ప్రకటించింది . ఆయుష్ (Ayush) విభాగంలో మొత్తం 358 పోస్టుల భర్తీకి గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. ఈ నియామకాలపై మంత్రి సత్యకుమార్ యాదవ్ స్పందిస్తూ.. తక్కువ కాలంలోనే నియామక ప్రక్రియ పూర్తి చేసి, కొత్త సిబ్బందిని నియమిస్తామని మంత్రి హామీ ఇచ్చారు. త్వరలోనే నోటిఫికేషన్ విడుదలయ్యే అవకాశముందని సమాచారం.
ఏఏ పోస్టులు భర్తీ అంటే..
- డాక్టర్లు - 71
- జిల్లా ప్రోగ్రాం మేనేజర్లు - 26
- పంచకర్మ థెరపిస్టులు - 90
మిగిలిన పోస్టుల్లో సహాయకులు, ఇతర సిబ్బందిని భర్తీ చేయనున్నట్టు స్పష్టం చేశారు.

ఆయుష్ సేవల విస్తరణ కోసం ఈ నియామకాలను అత్యవసరంగా చేపట్టాలని నిర్ణయం తీసుకున్నామని మంత్రి సత్యకుమార్ తెలిపారు. రాష్ట్రవ్యాప్తంగా ఆయుష్ సేవలను మరింత విస్తరించేందుకు కూటమి ప్రభుత్వం ప్రణాళిక రూపొందిస్తుందని తెలిపారు. కొత్త ఆసుపత్రుల ఏర్పాటుకు కృషి చేస్తున్నామని.. త్వరితగతిన మౌలిక సదుపాయాల అభివృద్ధి, శిక్షణా కార్యక్రమాలు చేపడతామని ఆయన వెల్లడించారు.
మరోవైపు గత వైసీపీ ప్రభుత్వంపై మంత్రి సత్యకుమార్ విమర్శలు గుప్పించారు. గత ఐదేళ్లలో ఆయుష్ సేవల అభివృద్ధికి కేవలం రూ. 37 కోట్లు మాత్రమే ఖర్చు చేశారని మండిపడ్డారు. ఈ విభాగాన్ని పూర్తిగా నిర్లక్ష్యం చేశారని ఫైర్ అయ్యారు. ఇప్పటికే 2024-25 సంవత్సరానికి కేంద్రం ఆమోదించిన స్టేట్ యాన్యువల్ యాక్షన్ ప్లాన్‌లో భాగంగా పలు కార్యక్రమాలను ప్రారంభించామని మంత్రి తెలిపారు.












Click it and Unblock the Notifications