ఏపీ ఇంటర్ పరీక్షల్లో మార్పు..! కొత్త తేదీలివే..!

ఏపీలో వచ్చే ఏడాది జరిగే ఇంటర్మీడియట్ పరీక్షలకు ప్రభుత్వం ఇప్పటికే ప్రకటించిన షెడ్యూల్ లో మార్పులు చోటు చేసుకున్నాయి. వివిధ కారణాలతో ప్రభుత్వం ఈ మార్పులు చేసినట్లు తెలుస్తోంది. సవరించిన షెడ్యూల్ ను ఇంటర్మీడియట్ బోర్డు ఇవాళ విడుదల చేసింది. దీని ప్రకారమే పరీక్షలు జరగబోతున్నాయి. కాబట్టి అభ్యర్ధులు ఈ విషయాన్ని గమనించాలని అధికారులు కోరుతున్నారు.

ఏపీ ఇంటర్ పరీక్షల కోసం ఈ ఏడాది ప్రకటించిన షెడ్యూల్ లో రెండు తేదీల్ని మార్చారు. మార్చి 3న మ్యాథ్స్ పేపర్ 2ఏ, సివిక్స్ పేపర్ 2 ఉంటాయని గతంలో ప్రకటించగా.. ఇప్పుడు దాన్ని కాస్తా మార్చి 4వ తేదీకి మారుస్తూ ఇంటర్ బోర్డు నిర్ణయం తీసుకుంది. ఇది మినహా మిగిలిన పరీక్షల తేదీల్లో ఎలాంటి మార్పులు లేవు. వచ్చే ఏడాది ఫిబ్రవరి 23 నుంచి మార్చి 24 వరకూ ఇంటర్ ఫస్టియర్, సెకండియర్ పరీక్షలు జరగబోతున్నాయి. ఉదయం 9 గంటల నుంచి 12 గంటల వరకూ పరీక్షలుంటాయి.

AP government revises intermediate exams 2026 schedule

ఇవాళ సవరించిన రెండు పరీక్షలు మినహా మిగిలిన పరీక్షల షెడ్యూల్ ను ఓసారి గమనిస్తే.. వచ్చే ఫిబ్రవరి 23న ఇంటర్ ఫస్టియర్ రెగ్యులర్ విద్యార్ధులకు పేపర్ 1 తెలుగు, సంస్కృతం, ఉర్దూ, హిందీ వంటి భాషా పరీక్ష జరగనుంది. అదే రోజు బ్యాక్ లాగ్ విద్యార్ధులకు పార్ట్ 2 సెకండ్ లాంగ్వేజ్ పేపర్ 1 ఉంటుంది. 25న రెగ్యులర్ విద్యార్ధులకు ఇంగ్లీష్ పేపర్ 1, బ్యాక్ లాగ్ విద్యార్ధులకు కూడా పార్ట్ 1 ఇంగ్లీష్ పేపర్ 1 ఉంటుంది. 27న రెగ్యులర్ విద్యార్ధులకు హిస్టరీ పేపర్1, బ్యాక్ లాగ్ విద్యార్ధులకు హిస్టరీ, బోటనీ పరీక్షలు ఉంటాయి.

అలాగే మార్చి 2న ఫస్టియర్ రెగ్యులర్ విద్యార్ధులకు మ్యాథ్స్ పేపర్1, బ్యాక్ లాగ్ విద్యార్ధులకు మ్యాథ్స్ పేపర్ 1ఏ, మార్చి 5న రెగ్యులర్ విద్యార్ధులకు బయోలజీ పేపర్ 1, బ్యాక్ లాగ్ విద్యార్ధులకు మ్యాథ్స్ పేపర్ 1 బీ, జువాలజీ పేపర్ 1 ఉంటాయి. మార్చి 7న రెగ్యులర్,బ్యాక్ లాగ్ ఇద్దరికీ ఎకనామిక్స్ పేపర్ 1 ఉంటుంది. మార్చి 10న ఇద్దరికీ ఫిజిక్స్ పేపర్ 1, మార్చి 12న ఇద్దరికీ కామర్స్ పేపర్ 1 ఉంటుంది. దీంతో పాటు అదే రోజు బ్యాక్ లాగ్ వారికి సోషియాలజీ, ఫైన్ ఆర్ట్స్, మ్యూజిక్ పరీక్షలు ఉంటాయి. మార్చ్ 14న రెగ్యులర్, బ్యాక్ లాగ్ కు కామర్స్ తో పాటు బ్యాక్ లాగ్ బైపీసీ విద్యార్ధులకు మ్యాథ్స్ బ్రిడ్జి కోర్సు పరీక్ష కూడా ఉంటుంది. మార్చి 17న రెగ్యులర్, బ్యాక్ లాగ్ కు కెమిస్ట్రీ పరీక్ష ఉంటుంది. మార్చి 20న ఇద్దరికీ పబ్లిక్ అడ్మినిస్ట్రేషన్, లాజిక్ పేపర్ 1 పరీక్షలుంటాయి. మార్చి 24న ఇద్దరికీ మోడ్రన్ లాంగ్వేజ్, జాగ్రఫీ ఉంటాయి.

AP government revises intermediate exams 2026 schedule

ఇంటర్ సెకండియర్ కు ఫిబ్రవరి 24తో పరీక్షలు మొదలవుతాయి. 24న రెగ్యులర్, బ్యాక్ లాగ్ ఇద్దరికీ సెకండ్ లాంగ్వేజ్ పేపర్ ఉంటుంది. 26న ఇంగ్లీష్ పేపర్ 2, 28న బోటనీ, హిస్టరీ, మార్చి 4న మ్యాథ్స్ పేపర్ 2ఏ, సివిక్స్ పేపర్ 2 ఉంటాయి. మార్చి 6న జువాలజీ, ఎకనామిక్స్ ఉంటాయి. మార్చి 9న మ్యాథ్స్ పేపర్ 2బీ ఉంటుంది. మార్చి 11న కామర్స్, సోషియాలజీ, ఫైన్ ఆర్డ్స్, మ్యూజిక్ ఉంటాయి. మార్చి 13న ఫిజిక్స్, మార్చి 16న మోడ్రన్ లాంగ్వేజ్, జాగ్రఫీ, బైపీసీ విద్యార్ధులకు మ్యాథ్స్ బ్రిడ్జి కోర్సు పరీక్షలు ఉంటాయి. మార్చి 18న కెమిస్ట్రీ, మార్చి 23న పబ్లిక్ అడ్మినిస్ట్రేషన్, లాజిక్ పేపర్లు ఉంటాయి.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+