డీఎస్సీ కొత్త షెడ్యూల్ పై మంత్రి బొత్స క్లారిటీ ఇదే...!
ఏపీలో 6100 టీచర్ పోస్టుల భర్తీ కోసం ప్రభుత్వం ఇప్పటికే జారీ చేసిన షెడ్యూల్ లో మార్పులు చోటు చేసుకున్నాయి. హైకోర్టు తీర్పు నేపథ్యంలో ప్రభుత్వం తాజాగా కొత్త షెడ్యూల్ విడుదల చేసింది. దీనిపైనా అభ్యర్ధుల్లో అనుమానాలు నెలకొన్న నేపథ్యంలో విద్యాశాఖ మంత్రి బొత్స సత్యనారాయణ ఇవాళ ఓ ప్రకటన విడుదల చేశారు. ఇందులో ఆయన డీఎస్సీ కొత్త షెడ్యూల్ పై క్లారిటీ ఇచ్చారు.
డీఎస్సీ 2024 షెడ్యూల్ లో ప్రభుత్వం తాజాగా మార్పులు చేసినట్లు విద్యామంత్రి బొత్స సత్యనారాయణ తెలిపారు. డీఎస్సీ కోసం ఫిబ్రవరి 25 వరకూ దరఖాస్తులు స్వీకరించామని, అయితే ముందుగా ప్రకటించిన విధంగా ఈనెల 15 నుంచి కాకుండా మార్చి 30 నుంచి ఏప్రిల్ 30 వరకూ పరీక్షలు నిర్వహిస్తున్నట్లు బొత్స తెలిపారు. మొత్తం 14 రోజుల పాటు రెండు సెషన్స్ లో డీఎస్సీ పరీక్షలు నిర్వహించేలా షెడ్యూల్ రూపొందించామన్నారు. కాబట్టి అభ్యర్ధులు కొత్త షెడ్యూల్ గమనించాలని కోరారు.

సెకండరీ గ్రేడ్ టీచర్ పోస్టులకు(ఎస్జీటీ) అర్హతలను మార్చడం, టెట్ పరీక్షకు డిఎస్సీ పరీక్షకు మధ్యన తగిన సమయం ఇవ్వడం వంటి కారణాలతో షెడ్యూల్ లో ఈ మార్పులు అనివార్యమయ్యాయని మంత్రి బొత్స తెలిపారు. అభ్యర్ధులు పరీక్షా కేంద్రాల్ని ఎంపిక చేసుకోడానికి మార్చి 20 నుంచి వెబ్ ఆప్షన్ల ద్వారా అవకాశం కల్పిస్తున్నట్లు ఆయన వెల్లడించారు. అలాగే డీఎస్సీ 2024 హాల్ టిక్కెట్లను మార్చి 25 వ తేదీ నుంచి డౌన్ లోడ్ చేసుకోవచ్చని తెలిపారు. ప్రభుత్వం తాజాగా విడుదల చేసిన కొత్త షెడ్యూల్ ద్వారా లభించిన అవకాశాన్ని అభ్యర్ధులందరూ సద్వినియోగం చేసుకుని పరీక్షలకు సిద్ధం కావాలని మంత్రి బొత్స సత్యనారాయణ అభ్యర్ధులకు సూచించారు.

ప్రభుత్వం తాజాగా విడుదల చేసిన కొత్త షెడ్యూల్ ప్రకారం డీఎస్సీ పరీక్షలు మార్చి 30 నుంచి ఏప్రిల్ 30 వరకూ జరగబోతున్నాయి. సెకండరీ గ్రేట్ టీచర్స్ (ఎస్జీటీ) పరీక్షల్ని మార్చి 30 నుంచి ఏప్రిల్ 3 వరకూ 10 సెషన్లలో నిర్వహించబోతున్నారు. అలాగే టీజీటీ, పీజీటీ, ప్రిన్సిపాల్ పోస్టుల కోసం నిర్వహించే ఇంగ్లీష్ ప్రావీణ్య పరీక్ష ఏప్రిల్ 7న ఉంటుంది. అలాగే స్కూల్ అసిస్టెంట్లు, టీజీటీ, పీజీటీ, ఫిజికల్ డైరెక్టర్, ప్రిన్సిపాల్ పోస్టుల కోసం పరీక్షలను ఏప్రిల్ 13 నుంచి ఏప్రిల్ 30 వరకూ నిర్వహించబోతున్నారు.
ఐఐటీ జేఈఈ, ఇతర పరీక్షల దృష్ట్యా ఏప్రిల్ నెలలో డీఎస్సీ పరీక్షలకు కొన్ని పరీక్షా కేంద్రాలు అందుబాటులో ఉండటం లేదు. దీంతో కొత్తగా అభ్యర్ధులు పరీక్షా కేంద్రాల్ని ఎంచుకోవాల్సి ఉంటుంది. డీఎస్సీ పరీక్షలకు సంబంధించిన పూర్తి సమాచారం కోసం ప్రభుత్వం https://apcfss.in/ వెబ్ సైట్ లోకి వెళ్లి తెలుసుకోవచ్చు.
-
బంగారం ధరల అంచనాలు తలకిందులు -
తులా రాశి, వృశ్చిక రాశి ఏప్రిల్ నెల జాతక ఫలం -
PM Modi: అన్నింటికీ సిద్దం అయిపోండి..! ప్రధాని మోడీ షాకింగ్ పిలుపు..! -
బంగారం ధరలు అధోగతి- కనీవినీ ఎరుగనంత పతనం -
సికింద్రాబాద్ స్టేషన్ సిద్దం, ప్రధాని మోదీ ప్రారంభం - ముహూర్తం ఫిక్స్..!! -
ఇరాన్ ను లేపేద్దాం రండి: ప్రపంచ దేశాలకు నెతన్యాహు పిలుపు -
మహేష్ బాబు కాకుండా ఆ హీరో అంటే చాలా ఇష్టం - కృష్ణ -
క్రికెట్ రాజకీయాలకు బలైన రియల్ లైఫ్ 'ధురంధర్' ఆదిత్య ధర్! -
విజయ్ సంచలనం.. టీవీకే అభ్యర్థుల ఫుల్ జాబితా విడుదల.. -
తులారాశి వార్షిక ఫలం 2026-27: ఈ ఏడాది వీరికి తిరుగేలేదు.. ఈ విషయంలో జాగ్రత్త! -
మకరరాశి వార్షిక జాతకం ఇలా.. ఈ ఏడాది విశేష లాభాలు! -
రైతు భరోసా నిధులు జమ కాలేదా, ఇలా చేయండి- వెంటనే..!!












Click it and Unblock the Notifications