AP SSC Exam Results: ఏపీలో పదో తరగతి ఫలితాల విడుదల తేదీ ఇదే..!
ఈ ఏడాది ఏపీలో విద్యాశాఖ నిర్వహించిన పదో తరగతి పరీక్షల ఫలితాల విడుదలకు ముహుర్తం ఖరారైంది. ఈ ఏడాది మార్చి 18 నుంచి 30 వరకూ ఏపీలో పదో తరగతి పరీక్షలు జరిగాయి. అనంతరం జవాబు పత్రాల మూల్యాంకనం, ఇతర కార్యక్రమాలు పూర్తి చేసుకోవడంతో ఫలితాల విడుదలకు రంగం సిద్ధమైంది. ఫలితాల విడుదలకు ఈసీ నుంచి అనుమతి కూడా లభించడంతో ఇవాళ విద్యాశాఖ ఓ ప్రకటన విడుదల చేసింది.
ఈ ఏడాది దాదాపు 6.3 లక్షల మందికి పైగా విద్యార్ధులు పదో తరగతి పరీక్షలు రాశారు. వీరంతా ఇప్పుడు ఫలితాల కోసం ఎదురుచూస్తున్నారు. ఈ నేపథ్యంలో ఏప్రిల్ 22న సోమవారం ఉదయం 11 గంటలకు విజయవాడ ఎంజీ రోడ్డులోని తాజ్ వివంటా హోటల్లో పదో తరగతి ఫలితాలు విడుదల చేయనున్నట్లు అధికారులు ఇవాళ ప్రకటించారు. అనంతరం ఫలితాలు అధికారిక వెబ్ సైట్లో అందుబాటులో ఉంచుతారు.

అధికారులు సోమవారం ఉదయం 11 గంటలకు ఫలితాలు విడుదల చేయగానే..విద్యార్ధులు విద్యాశాఖ అధికారిక వెబ్ సైట్
https://results.bse.ap.gov.in/లోకి వెళ్లి ఫలితాలు తెలుసుకోవచ్చు. ఈ వెబ్ సైట్ లోకి వెళ్లి హాల్ టికెట్ నంబర్, ఇతర వివరాలు ఎంటర్ చేయగానే ఫలితాలు కనిపిస్తాయి. వాటిని డౌన్ లోడ్ చేసుకుని ప్రింట్ తీసుకునే అవకాశం కూడా ఉంటుంది. అధికారిక వెబ్ సైట్ తో పాటు పలు ఇతర ప్రైవేట్ వెబ్ సైట్లలోనూ ఫలితాలు అందుబాటులోకి రానున్నాయి.













Click it and Unblock the Notifications