AP SSC Results 2024: కాసేపట్లో ఏపీ పదో తరగతి ఫలితాలు-ఇలా చెక్ చేసుకోండి..!
ఈ ఏడాది ఏపీలో విద్యాశాఖ నిర్వహించిన పదో తరగతి పరీక్షల ఫలితాలు కాసేపట్లో విడుదల కానున్నాయి. విద్యాశాఖ అధికారులు విజయవాడలోని ఓ ప్రైవేటు హోటల్లో ఎస్సెస్సీ ఫలితాలను విడుదల చేయనున్నారు. అనంతరం అధికారిక వెబ్ సైట్ లో ఫలితాలు అందుబాటులోకి రానున్నాయి. వీటికి సంబంధించిన వివరాలను ఇప్పటికే విద్యాశాఖ అధికారులు వెల్లడించారు.
ఈ ఏడాది మార్చి 18 నుంచి 30 వరకూ ఏపీలో పదో తరగతి పరీక్షలు నిర్వహించారు. అనంతరం జవాబు పత్రాల మూల్యాంకనం, ఇతర కార్యక్రమాలు పూర్తి కావడంతో ఇవాళ ఫలితాల విడుదలకు రంగం సిద్ధమైంది. ఈ ఏడాది దాదాపు 6.3 లక్షల మందికి పైగా విద్యార్ధులు పదో తరగతి పరీక్షలు రాశారు. వీరంతా ఇప్పుడు ఫలితాల కోసం ఎదురుచూస్తున్నారు. ఈ నేపథ్యంలో ఇవాళ ఉదయం 11 గంటలకు ఫలితాలను విడుదల చేస్తున్నారు.

అధికారులు ఉదయం 11 గంటలకు ఫలితాలు విడుదల చేయగానే..విద్యార్ధులు విద్యాశాఖ అధికారిక వెబ్ సైట్
https://results.bse.ap.gov.in/లోకి వెళ్లి ఫలితాలు తెలుసుకునే అవకాశం కల్పిస్తున్నారు. ఈ వెబ్ సైట్ లోకి వెళ్లి హాల్ టికెట్ నంబర్, ఇతర వివరాలు ఎంటర్ చేయగానే ఫలితాలు కనిపిస్తాయి. వాటిని డౌన్ లోడ్ చేసుకుని ప్రింట్ తీసుకునే అవకాశం కూడా ఉంటుంది. అధికారిక వెబ్ సైట్ తో పాటు పలు ఇతర ప్రైవేట్ వెబ్ సైట్లలోనూ ఫలితాలు అందుబాటులోకి రానున్నాయి.












Click it and Unblock the Notifications