AP TET Notification : ఏపీ టెట్ నోటిఫికేషన్ రిలీజ్-ఆగస్టులోనే పరీక్షలు, ఫలితాలు ఇలా..!
ఏపీలో ఉపాధ్యాయ ఖాళీల భర్తీ కోసం మెగా డీఎస్సీ నిర్వహణకు సిద్ధమవుతున్న ప్రభుత్వం అంతకు ముందే మరోసారి టెట్ నిర్వహణకు ఏర్పాట్లు చేస్తోంది. ఇందులో భాగంగా టెట్ నోటిఫికేషన్ విడుదల చేసింది. ఈసారి టెట్ ప్రిపరేషన్ కు దాదాపు నెల రోజులకు పైగా గడువు ఇచ్చారు. దీంతో ఈసారి మెగా డీఎస్సీ రాయాలనుకునే అభ్యర్ధులకు పూర్తిస్దాయిలో ప్రిపేర్ అయ్యేందుకు వీలు కలిగింది.
తాజాగా విడుదలైన ఏపీ టెట్ నోటిఫికేషన్ ప్రకారం ఈ నెల 3 నుంచి 16వ తేదీ వరకూ టెట్ దరఖాస్తుల రుసుము చెల్లింపుకు అవకాశం కల్పిస్తారు. అలాగే ఈ నెల 4 నుంచి 17 వరకూ దరఖాస్తుల్ని స్వీకరిస్తారు. ఈనెల 16 నుంచి ఆన్ లైన్ లో మోడల్ పేపర్లు అందుబాటులో ఉంచుతారు. 25 నుంచి హాల్ టికెట్లు డౌన్ లోడ్ చేసుకోవచ్చు. అనంతరం ఆగస్టు 5 నుంచి 20వ తేదీ వరకూ పరీక్షలు నిర్వహిస్తారు.ఆగస్టు 10న ప్రైమరీ కీ, 25న ఫైనల్ కీ విడుదల ఉంటుంది. అనంతరం ఆగస్టు 30న ఫలితాలు ప్రకటిస్తారు.

ఇందులో కేటగిరీల వారీగా చూసుకుంటే.. ఎస్జీటీ టీచర్లకు పేపర్ 1ఏ, స్పెషల్ ఎడ్యుకేషన్ ఎస్జీటీ టీచర్లకు పేపర్ 1బీ, స్కూల్ అసిస్టెంట్లకు పేపర్ 2ఏ, స్పెషల్ ఎడ్యుకేషన్ స్కూల్ అసిస్టెంట్లకు పేపర్ 2బీ పరీక్షలు ఉంటాయి. అలాగే శిక్షణ పొందిన గ్రాడ్యుయేట్, పోస్టు గ్రాడ్యుయేట్ టీచర్లకు ప్రత్యేకంగా ఇంగ్లీష్ నైపుణ్య పరీక్ష నిర్వహిస్తారు. పరీక్షలు ఆన్ లైన్ లోనే ఉండబోతున్నాయి.
రాష్ట్రంలో వివిధ కేటగిరీల కింద 16347 ఉపాధ్యాయ పోస్టుల భర్తీ కోసం ప్రభుత్వం మెగా డీఎస్సీ నోటిఫికేషన్ విడుదలకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. కేబినెట్ ఆమోదం కూడా లభించడంతో త్వరలోనే ఇది విడుదల కాబోతోంది. ఆలోపు మెగా డీఎస్సీకి అర్హత అయిన టెట్ పరీక్షను మరోసారి నిర్వహించడం ద్వారా ఇంకా ఎవరైనా రాయాలనుకుంటే రాసే వీలును ప్రభుత్వం కల్పించింది. ఆగస్టు 30 కల్లా టెట్ పూర్తయితే అనంతరం డీఎస్సీ నోటిఫికేషన్ విడుదల చేసి ఎట్టి పరిస్ధితుల్లోనూ డిసెంబర్ 10లోగా ఉపాధ్యాయ ఖాళీలన్నీ భర్తీ చేస్తారు.












Click it and Unblock the Notifications