APPSC గ్రూప్ 2 నోటిఫికేషన్ విడుదల - 720 పోస్టులు- దరఖాస్తులు ప్రారంభం..!

ఆంధ్రప్రదేశ్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ ఏపీపీఎస్సీ ఇవాళ 720 పోస్టులతో గ్రూప్ 2 నోటిఫికేషన్ (APPSC Group 2 Notification) విడుదల చేసింది. ఇందులో ఎగ్జిక్యూటివ్ తో పాటు నాన్ ఎగ్జిక్యూటివ్ పోస్టులు కూడా ఉన్నాయి. ఇవాళ్టి నుంచే దరఖాస్తుల ప్రక్రియ కూడా ప్రారంభమైంది. డిసెంబర్ 11 వరకూ దరఖాస్తులు స్వీకరిస్తారు. అనంతరం గ్రూప్ 2 స్క్రీనింగ్ టెస్ట్ వచ్చే ఏడాది ఫిబ్రవరి 21న ఉంటుంది.

ఏపీ ఉద్యోగులకు అలర్ట్..! పీఆర్సీ ఇచ్చే వరకూ వీటన్నింటికీ బ్రేక్..!
ఏపీ ఉద్యోగులకు అలర్ట్..! పీఆర్సీ ఇచ్చే వరకూ వీటన్నింటికీ బ్రేక్..!

గ్రూప్ 2 నోటిఫికేషన్ లో మున్సిపల్ కమిషనర్లు, డిప్యూటీ ఎంపీడీవోలు, డిప్యూటీ తహసీల్దార్లు, సబ్ రిజిస్ట్రార్లు, జీఎస్టీ అధికారులు, అసిస్టెంట్ సెక్షన్ ఆఫీసర్లు, సీనియర్ అకౌంటెంట్లు, జూనియర్ అకౌంటెంట్లు వంటి పోస్టులు ఉన్నాయి. కేటగిరీల వారీగా చూస్తే
ఎగ్జిక్యూటివ్ పోస్టులు 471, నాన్ ఎగ్జిక్యూటివ్ పోస్టులు 249 ఉన్నాయి. ఎగ్జిక్యూటివ్ పోస్టుల వారీగా చూస్తే మున్సిపల్ కమిషనర్ గ్రేడ్-3 కేటగిరీలో 6 పోస్టులు ఉన్నాయి.డిప్యూటీ మండల పరిషత్ డెవలప్‌మెంట్ ఆఫీసర్ పోస్టులు 176, అసిస్టెంట్ రిజిస్ట్రార్ ఆఫ్ కోఆపరేటివ్ సొసైటీస్ పోస్టులు 10, డిప్యూటీ తహసీల్దార్ పోస్టులు 203, సబ్ రిజిస్ట్రార్ గ్రేడ్-2 పోస్టులు 7, జీఎస్టీ ఆఫీసర్ పోస్టులు 40
ప్రొహిబిషన్ అండ్ ఎక్సైజ్ సబ్ ఇన్‌స్పెక్టర్ పోస్టులు 29 ఉన్నాయి.

APPSC Group 2 Notification 2026 Out 720 Vacancies Announced Applications Open

నాన్ ఎగ్జిక్యూటివ్ విభాగంలో అసిస్టెంట్ సెక్షన్ ఆఫీసర్ (జీఏడీ) పోస్టులు 71 ఉన్నాయి. అలాగే అసిస్టెంట్ సెక్షన్ ఆఫీసర్ (ఫైనాన్స్)పోస్టులు 5, అసిస్టెంట్ సెక్షన్ ఆఫీసర్ (లా) పోస్టులు 4, సీనియర్ అకౌంటెంట్ (హెచ్ఓడీలు) 90, సీనియర్ అకౌంటెంట్ (జిల్లాలు) ఒక పోస్టు, జూనియర్ అకౌంటెంట్ 47 పోస్టులు, ఇతర శాఖల్లో జూనియర్ ఆఫీస్ అసిస్టెంట్ పోస్టులు 31 ఉన్నాయి. వీటికి గుర్తింపు పొందిన యూనివర్శిటీ నుంచి బ్యాచిలర్ డిగ్రీ అర్హతగా నిర్ణయించారు. అసిస్టెంట్ సెక్షన్ ఆఫీసర్ లా పోస్టుకు లా డిగ్రీ కూడా కావాలి. సీనియర్ అకౌంటెంట్ పోస్టులకు కామర్స్, ఎకనామిక్స్ లేదా మ్యాథమెటిక్స్ డిగ్రీతో పాటు కంప్యూటర్ సంబంధిత సర్టిఫికెట్ లేదా నిర్దేశించిన కంప్యూటర్ అర్హత అవసరం.

ఏపీ జిల్లా, మండల పరిషత్తుల్లో పరోక్ష ఎన్నికలు..! ఎస్ఈసీ షెడ్యూల్ విడుదల..!
ఏపీ జిల్లా, మండల పరిషత్తుల్లో పరోక్ష ఎన్నికలు..! ఎస్ఈసీ షెడ్యూల్ విడుదల..!

జూనియర్ అకౌంటెంట్ పోస్టులకు డిగ్రీ అవసరం. కామర్స్, మ్యాథమెటిక్స్ లేదా ఎకనామిక్స్ అభ్యర్థులకు ప్రాధాన్యత ఇస్తారు. 2026 జులై 1వ తేదీ నాటికి పోస్టును బట్టి కనీస వయోపరిమితి 18, 20 లేదా 21 సంవత్సరాలుగా, గరిష్ఠ వయోపరిమితి 30 లేదా 44 సంవత్సరాలుగా నిర్ణయించారు. ప్రొహిబిషన్ అండ్ ఎక్సైజ్ సబ్ ఇన్‌స్పెక్టర్ పోస్టులకు వయోపరిమితి 18 నుంచి 30 సంవత్సరాలు ఉండాలి. ఎస్సీ, ఎస్టీ, బీసీ, ఈడబ్ల్యూఎస్ అభ్యర్థులకు ఐదేళ్లు, దివ్యాంగ అభ్యర్థులకు పదేళ్లు, మాజీ సైనికులకు నిబంధనల ప్రకారం సడలింపు ఇస్తారు. ఏపీ ప్రభుత్వ రెగ్యులర్ ఉద్యోగులకు గరిష్ఠంగా ఐదేళ్ల వరకు సడలింపు ఉంటుంది.

మున్సిపల్ కమిషనర్, డిప్యూటీ ఎంపీడీవో, అసిస్టెంట్ రిజిస్ట్రార్ పోస్టులకు రూ.45,830 నుంచి రూ.1,30,580 వరకు జీతభత్యాలు ఉంటాయి. డిప్యూటీ తహసీల్దార్, సబ్ రిజిస్ట్రార్, జీఎస్టీ ఆఫీసర్ పోస్టులకు రూ.44,570 నుంచి రూ.1,27,480 వరకు, ప్రొహిబిషన్ అండ్ ఎక్సైజ్ సబ్ ఇన్‌స్పెక్టర్ పోస్టులకు రూ.40,970 నుంచి రూ.1,24,380 వరకు, అసిస్టెంట్ సెక్షన్ ఆఫీసర్ పోస్టులకు రూ.40,970 నుంచి రూ.1,24,380 వరకు, సీనియర్ అకౌంటెంట్ పోస్టులకు రూ.34,580 నుంచి రూ.1,07,210 వరకు, జూనియర్ అకౌంటెంట్, జూనియర్ ఆఫీస్ అసిస్టెంట్ పోస్టులకు రూ.25,220 నుంచి రూ.80,910 వరకు ఉంటాయి. అప్లికేషన్ ప్రాసెసింగ్ ఫీజు రూ.250, పరీక్ష ఫీజు రూ.80 కలిపి మొత్తం రూ.330 చెల్లించాలి. ఎస్సీ, ఎస్టీ, బీసీ, దివ్యాంగులు, మాజీ సైనికులు, తెల్ల రేషన్ కార్డు కలిగిన కుటుంబాల అభ్యర్థులకు, నిరుద్యోగ యువతకు 80 ఫీజు మినహాయింపు ఉంటుంది. గ్రూప్-2 ఎంపిక ప్రక్రియలో స్క్రీనింగ్ టెస్ట్, మెయిన్ పరీక్ష, కంప్యూటర్ ప్రొఫిషియెన్సీ టెస్ట్ (CPT) ఉంటాయి.

APPSC Group 2 Notification 2026 Out 720 Vacancies Announced Applications Open

అభ్యర్ధులు ఏపీపీఎస్సీ అధికారిక వెబ్‌సైట్ https://psc.ap.gov.in లోకి వెళ్లి ఇప్పటికే OTPR ఐడీ ఉన్నవారు తమ యూజర్ ఐడీ, పాస్‌వర్డ్‌తో లాగిన్ కావాలి.తొలిసారి దరఖాస్తు చేసుకునే వారు ముందుగా వన్ టైమ్ ప్రొఫైల్ రిజిస్ట్రేషన్ పూర్తి చేయాలి. అనంతరం నోటిఫికేషన్ నంబర్ 37/2026కు సంబంధించిన ఆన్‌లైన్ అప్లికేషన్‌ను ఎంచుకోవాలి. విద్యార్హతలు, స్థానికత, రిజర్వేషన్ వివరాలు, పోస్టుల ప్రాధాన్యతలు, పరీక్ష కేంద్రాలను నమోదు చేయాలి. వివరాలను పరిశీలించి సేవ్ అండ్ సబ్‌మిట్ బటన్‌పై క్లిక్ చేయాలి.
ఆన్‌లైన్‌లో ఫీజు చెల్లించిన తర్వాతే దరఖాస్తు పూర్తవుతుంది. అప్లికేషన్ కాపీని డౌన్‌లోడ్ చేసుకుని భద్రపరుచుకోవాలి.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+