2018 గ్రూప్ 1 పరీక్షపై ఏపీ సర్కార్ కు ఊరట- సింగిల్ బెంచ్ తీర్పు కొట్టేసిన హైకోర్టు..!
ఏపీలో 2018లో నిర్వహించిన గ్రూప్ 1 పరీక్ష వ్యవహారం ఇవాళ మరో మలుపు తిరిగింది. ఈ పరీక్ష జవాబు పత్రాల్ని రెండుసార్లు మూల్యాంకనం చేశారన్న కారణంతో ఫలితాలను రద్దు చేస్తూ హైకోర్టు సింగిల్ బెంచ్ ఇచ్చిన తీర్పును సవాల్ చేస్తూ హైకోర్టులో ప్రభుత్వం పిటిషన్ దాఖలు చేసింది. దీనిపై విచారణ జరిపిన హైకోర్టు డివిజన్ బెంచ్ కీలక తీర్పు ఇచ్చింది. దీంతో ప్రభుత్వానికి హైకోర్టులో భారీ ఊరట దక్కింది.
ఏపీలో 2018 గ్రూప్-1 మెయిన్స్‌ను రద్దు చేస్తూ హైకోర్టు సింగిల్ బెంచ్ ఇచ్చిన తీర్పును డివిజన్ బెంచ్ ఇవాళ సస్పెండ్ చేసింది. ఈ మేరకు పరీక్షా ఫలితాల రద్దు చెల్లదని స్పష్టం చేసింది. అంతే కాదు ఇప్పటికే విధులు నిర్వహిస్తున్న వారంతా ఉద్యోగాల్లో కొనసాగుతారని స్పష్టం చేసింది. ఈ కేసులో తదుపరి విచారణను వచ్చే వారానికి వాయిదా వేసింది. దీంతో అప్పట్లో గ్రూప్ 1 పరీక్షల్లో క్వాలిఫై అయి ఉద్యోగాల్లో ఉన్న వారికి కూడా ఊరట దక్కింది.

గతంలో 2018 గ్రూప్ 1 నోటిఫికేషన్ ప్రకారం నిర్వహించిన గ్రూప్ 1 పరీక్ష జవాబు పత్రాల మూల్యాంకనం ఓసారి చేసిన తర్వాత తప్పిదాలు జరిగాయన్న కారణంతో ఏపీపీఎస్సీ మరోసారి నిర్వహించిందని అభ్యర్ధులు ఆరోపించారు. ఇలా రెండోసారి మూల్యాంకనం చేసిన తర్వాత ఏపీపీఎస్సీ ఫలితాలు విడుదల చేసిందని హైకోర్టును ఆశ్రయించారు. దీంతో రెండోసారి మూల్యాంకనం తర్వాత ఎంపికైన అభ్యర్ధులకే ఉద్యోగాలు ఇవ్వడం చెల్లదంటూ సింగిల్ బెంచ్ తీర్పు ఇచ్చారు. దీనిపై ప్రభుత్వం హైకోర్టును ఆశ్రయించింది. దీనిపై విచారణ జరిపిన తీర్పు దీన్ని కొట్టేసింది.












Click it and Unblock the Notifications