CBSE OnMark Portal: భద్రతా లోపాలు నిజమే..! సీబీఎస్ఈ షాకింగ్..!

సెంట్రల్ బోర్డ్ ఆఫ్ సెకండరీ ఎడ్యుకేషన్ (CBSE) తన ఆన్‌మార్క్ పోర్టల్‌లో భద్రతా లోపాల్ని ఎట్టకేలకు అంగీకరించింది. తాజాగా తమ పోర్టల్ (CBSE OnMark Portal)లో గుర్తించిన భద్రతా లోపాలను నియంత్రించినట్లు ప్రకటించింది. అయితే వీటి వల్ల విద్యార్థుల డేటా లేదా రికార్డులకు ఎలాంటి నష్టం జరగలేదని తెలిపింది. సైబర్ భద్రతా నిపుణులు, నైతిక హ్యాకర్లు ఇప్పటికీ వ్యవస్థను సమీక్షిస్తున్నారని వెల్లడించింది. సీబీఎస్ఈ సేవా ప్రదాత నిర్వహిస్తున్న ఈ పోర్టల్‌లో భద్రతా లోపాలపై బహిరంగ ఆందోళనలు వ్యక్తమైన నేపథ్యంలో బోర్డు స్పందించి ఈ ప్రకటన చేసింది.

ఎక్స్ లో చేసిన ప్రకటనలో సీబీఎస్ఈ .. తాజాగా బయటపడిన లోపాలను నిశితంగా పర్యవేక్షిస్తున్నట్లు తెలిపింది. సైబర్ భద్రతా నిపుణుల బృందాన్ని గత కొన్ని రోజులుగా మోహరించినట్లు తెలిపింది. ప్రభుత్వ ఏజెన్సీలు, ఇండియన్ ఇన్‌స్టిట్యూట్స్ ఆఫ్ టెక్నాలజీ (IITలు) నిపుణులు వ్యవస్థ భద్రతా నిర్మాణాన్ని బలోపేతం చేయడానికి, పోర్టల్‌ను మరింత సురక్షితమైన సెటప్‌కు తరలించడానికి కృషి చేస్తున్నారని వెల్లడించింది. గుర్తించిన లోపాలు నియంత్రించామని, ఇతర దుర్వినియోగానికి గురయ్యే లోపాలు పరిగణనలోకి తీసుకుంటున్నట్లు తెలిపింది. అలాగే ఈ సమస్యలను బయటపెట్టిన పౌరులు, నైతిక హ్యాకర్‌లకు బోర్డు కృతజ్ఞతలు తెలిపింది.

కొన్ని రోజుల క్రితం ఒక టీనేజ్ సైబర్ సెక్యూరిటీ పరిశోధకుడు బోర్డు ఆన్-స్క్రీన్ మార్కింగ్ (OSM) వ్యవస్థలో కొన్ని ఆరోపించిన లోపాలను గుర్తించారు. ఈ లోపాలు ఎగ్జామినర్ ఖాతాలకు, ఇతర సున్నితమైన కార్యకలాపాలకు అనధికారిక యాక్సెస్ ఇస్తున్నట్లు ఆరోపించారు. దీంతో సోషల్ మీడియాలో విస్తృత చర్చ జరిగింది. ఈ ఆరోపణలు CBSE డిజిటల్ మూల్యాంకన మౌలిక సదుపాయాల భద్రతపై ఆందోళనలను పెంచాయి. అయితే, ఆన్‌లైన్ చర్చల్లో ప్రస్తావించిన పోర్టల్ జవాబు పత్రాలను మూల్యాంకనం చేయడానికి ఉపయోగించే లైవ్ సిస్టమ్ కాదని CBSE అప్పట్లో చెప్పింది. విద్యార్థుల డేటా, మార్కులు లేదా మూల్యాంకన రికార్డులకు నష్టం లేదని తాజాగా చెబుతోంది.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+