నిరుద్యోగులకు సెంట్రల్ బ్యాంక్ ఆఫ్ ఇండియా బంపర్ ఆఫర్..
బ్యాంకింగ్ రంగంలో స్థిరమైన కెరీర్‌ను ప్రారంభించాలనుకునే నిరుద్యోగులకు సెంట్రల్ బ్యాంక్ ఆఫ్ ఇండియా తీపి కబురు చెప్పింది. వెయ్యికి పైగా క్రెడిట్ ఆఫీసర్ పోస్టుల రిక్రూట్‌మెంట్ కోసం నోటిఫికేషన్ రిలీజ్ చేసింది. ఈ ఛాన్స్‌ను సద్వినియోగం చేసుకోవాలనుకునే వారి కోసం ఈ అనౌన్స్ మెంట్ గురించి పూర్తి వివరాలు తెలుసుకుందాం. ముఖ్యంగా ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్స్, ఎంపిక విధానం, దరఖాస్తు రుసుములు, పరీక్ష నిర్మాణం, జీతం సహా పూర్తి సమాచారం మీకోసం ప్రత్యేకంగా..
ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్..
క్రెడిట్ ఆఫీసర్ పోస్టుకు దరఖాస్తు చేసుకునే అభ్యర్థులు గుర్తింపు పొందిన విశ్వవిద్యాలయము నుంచి గ్రాడ్యుయేట్ డిగ్రీ పొందాలి. జనరల్/ ఈడబ్ల్యుఎస్ విద్యార్ధులు 60 శాతం, ఎస్సీ/ఎస్టీ/ఓబీసీ/పిడబ్ల్యుబిడి అభ్యర్ధులు 55 శాతం ఉత్తీర్ణత సాధించి ఉండాలి.

వయస్సు..
ఈ పోస్టులకు అప్లై చేసుకునే వారి కనీస వయస్సు 21 సంవత్సరాలు ఉండాలి.
పరీక్ష విధానం..
ఆన్ లైన్
ఎంపిక ప్రక్రియ..
ఎంపిక ప్రక్రియను మూడు దశల్లో నిర్వహిస్తారు. ప్రారంభ దశలో అభ్యర్థులకు ఆబ్జెక్టివ్, వివరణాత్మక ప్రశ్నలతో ఆన్‌లైన్ పరీక్ష ఉంటుంది. ఆన్‌లైన్ పరీక్షలో అర్హత సాధించిన అభ్యర్థులు ఇంటర్వ్యూ రౌండ్‌కు వెళ్తారు.. ఈ దశలో బ్యాంకింగ్ పరిజ్ఞానం, సమస్య పరిష్కార నైపుణ్యాలు, కమ్యూనికేషన్ సామర్థ్యాలు అంచనా వేస్తారు. ఆన్‌లైన్ పరీక్ష, ఇంటర్వ్యూ నుంచి కలిపి స్కోర్‌ల ఆధారంగా తుది ఎంపిక జరుగుతుంది. అన్ని దశలను విజయవంతంగా పూర్తిచేసిన అభ్యర్థులు క్రెడిట్ ఆఫీసర్లుగా నియమిస్తారు.
ఈ విధంగా, సెంట్రల్ బ్యాంక్ ఆఫ్ ఇండియా క్రెడిట్ ఆఫీసర్ పోస్టుల కోసం నిర్వహించే రిక్రూట్‌మెంట్ ద్వారా అద్భుతమైన కెరీర్ అవకాశాలను అందిస్తుంది. బ్యాంకింగ్ రంగంలో ప్రగతి సాధించాలని ఆశించే అభ్యర్థులు ఈ అవకాశాన్ని తప్పకుండా ఉపయోగించుకోవచ్చని సూచిస్తున్నారు.












Click it and Unblock the Notifications