సెంట్రల్ యూనివర్సిటీలో డిగ్రీ అడ్మిషన్స్‌కు ఇకపై ఉమ్మడి పరీక్ష- వివరాలు ఇవే..!
సెంట్రల్ యూనివర్సిటీలో డిగ్రీ అడ్మిషన్స్ ఇకపై ఉమ్మడి పరీక్ష నిర్వహిస్తారు. దేశంలో గల 45 వర్సిటీలకు కామన్ టెస్ట్ ఉండనుంది. జూలై ఫస్ట్ వీక్‌లో పరీక్ష ఉంటుందని యూజీసీ చైర్మన్ ఎం జగదీష్ కుమార్ తెలిపారు. కామన్ యూనివర్సిటీ ఎంట్రెన్స్ టెస్ట్‌ను నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ నిర్వహించనుంది. పరీక్ష విధానాన్ని ప్రకటించారు. ఏప్రిల్ మొదటి వారం నుంచి దరఖాస్తు చేసుకునేవారికి అవకాశం ఇచ్చారు.
టెస్ట్‌లో సాధించిన స్కోర్ బట్టి సీటు లభించనుంది. 12వ తరగతి మార్కులను వెయిటేజీగా పరిగణిస్తారు. పరీక్ష రాసే సమయంలో కూడా అర్హతను పరిగణిస్తారు. ఢిల్లీ వర్సిటీలో కటాఫ్ మార్కులు ఎక్కువగా ఉంటాయి. ఏడు డియూ కాలేజీలు 10 ప్రోగ్రామ్‌లకు సంబంధించి విద్యార్థులను చేర్చుకోవడానికి తొలి జాబితాలో 100 శాతం మార్కులు ఉండాల్సిందేనని స్పష్టంచేసింది.

అయితే ఇంటర్నల్ మార్కుల ఆధారం చేసుకోవడాన్ని వర్సిటీ అంగీకరించలేదు. ఎందుకంటే కొన్ని బోర్డులు ఉదారంగా వ్యవహరిస్తాయని భావించింది. దీంతో మిగతా విద్యార్థులకు అన్యాయం జరుగుతుందని తెలిపింది. టెస్ట్ నిర్వహించి.. మెరిట్ ఆధారంగా సీట్ ఇస్తారు.
ఢిల్లీలో గల ఢిల్లీ యూనివర్సిటీ, జవహర్ లాల్ నెహ్రూ యూనివర్సిటీ, జమియా మిలియా ఇస్లామియా అండ్ ఇందిరాగాంధీ నేషనల్ ఓపెన్ యూనివర్సిటీ... ఉత్తరప్రదేశ్‌లో అలిఘడ్ ముస్లిం యూనివర్సిటీ, బనారజ్ హిందూ యూనివర్సిటీ కామన్ ఎంట్రెన్ టెస్ట్ పరిధిలో ఉన్నాయి. అందరికీ ఎంట్రెన్స్ టెస్ట్ కంపల్సరీ అని స్పష్టంచేశారు.
మల్టీఫుల్ చాయిస్ విధానంలో పరీక్ష ఉంటుంది. ఎన్‌సీఈఆర్టీ టెస్ట్ బుక్స్ చదివాల్సి ఉంటుంది. అయితే తప్పుడు సమాధానానికి మార్కుల కోత ఉండనుంది. 13 భాషల్లో పరీక్షను కండక్ట్ చేస్తారు. హిందీ, మరాఠీ, గుజరాతీ, తమిళ్, తెలుగు, కన్నడ, మలయాళం, ఉర్దూ, అస్సామీ, బెంగాలీ, పంజాబీ, ఒడియా, ఇంగ్లిష్‌లో పరీక్ష నిర్వహిస్తారు. ఉదయం, మధ్యాహ్నం వేళల్లో పరీక్షను నిర్వహిస్తారు. విదేశాలకు చెందిన విద్యార్థులకు మాత్రం ఈ పరీక్ష నిర్వహించే వీలు లేదు.












Click it and Unblock the Notifications