CTET July 2024 : కేంద్రీయ ఉపాధ్యాయ అర్హత పరీక్ష జులై నోటిఫికేషన్ విడుదల...
CTET July 2024 : కేంద్రీయ ఉపాధ్యాయ అర్హత పరీక్ష జులై నోటిఫికేషన్ విడుదల...
సీటెట్ జులై 2024 నోటిఫికేషన్ విడుదల అయ్యింది. దేశవ్యాప్తంగా సీబీఎస్‌ఈ నిర్వహించే కేంద్రీయ ఉపాధ్యాయ అర్హత పరీక్ష (CTET Exam-July 2024)కు తాజాగా నోటిఫికేషన్ విడుదల చేశారు. ఈ సందర్భంగా సిబిఎస్ సీటెట్ జులై 2024 పరీక్ష తేదీని కూడా ప్రకటించింది. 19వ ఎడిషన్ సీటెట్ పరీక్షను 2024 జులై 7వ తేదీ ఆదివారం నిర్వహించనున్నట్లు సెంట్రల్ బోర్డ్ స్కూల్ ఎడ్యుకేషన్ వెల్లడించింది. ఈ సీటెట్ పరీక్ష దేశవ్యాప్తంగా నిర్వహించడం జరుగుతుంది. మొత్తం 20 భాషల్లో ఈ పరీక్ష ఉంటుంది. దేశవ్యాప్తంగా ఉన్న136 నగరాల్లో సీటెట్ పరీక్షను నిర్వహిస్తారు. ఇక ఈ పరీక్ష రాయాలనుకునే అభ్యర్థులు మార్చి 7 నుంచి ఏప్రిల్ 2 రాత్రి 11.59 గంటల వరకు ఆన్‌లైన్‌లో దరఖాస్తులు చేసుకోగలరనీ సీబిఎస్ఈ ప్రకటించింది.
అభ్యర్థులు దరఖాస్తు చేసుకోవాలంటే ఈ కింద ఉన్న లింక్‌ను క్లిక్ చేయండి.

ఇతర వివరాలు ఇలా ఉన్నాయి...
సెంట్రల్ టీచర్ ఎలిజిబిలిటి టెస్ట్ ప్రతి సంవత్సరం రెండు సార్లు నిర్వహిస్తారు. ప్రస్తుతం 19వ ఎడిషన్ సీటెట్‌కు రిజిస్ట్రేషన్లు ప్రారంభమయ్యాయి. మార్చి 7వ తేదీనుంచి ఏప్రిల్ 2వరకు అభ్యర్థులు దరఖాస్తు చేసుకోగలరు.
అభ్యర్థుల దరఖాస్తు రుసుము : జనరల్/ఓబీసీ అభ్యర్థులు ఒక పేపర్‌కు రూ.1000, రెండు పేపర్లకు రూ.1200; ఎస్సీ/ఎస్టీ/దివ్యాంగులైతే ఒక పేపర్‌కు రూ.500, రెండు పేపర్లకు రూ.600ల చొప్పున చెల్లించాల్సి ఉంటుంది.
సీటెట్ పరీక్షలో అర్హత సాధించిన అభ్యర్థులు కేంద్ర ప్రభుత్వ పరిధిలోని పాఠశాలల ఉపాధ్యాయ నియామకాల్లో పరిగణనలోకి తీసుకుంటారు. సీటెట్‌లో సాధించిన స్కోర్‌కు జీవిత కాల వ్యాలిడిటీ ఉంటుంది.
ఇక, ఈ పరీక్షలో మొత్తం రెండు పేపర్‌లు ఉంటాయి. పేపర్-1 ఒకటి నుంచి ఐదో తరగతి విద్యార్థులకు బోధించాలనుకునే అభ్యర్థుల కోసం, పేపర్-2 ఆరు నుంచి తొమ్మిదో తరగతి విద్యార్థులకు బోధించాలనుకునే వారు రాయొచ్చు.
సీటెట్ పరీక్ష ఆఫ్‌లైన్‌లో (పెన్ను, పేపర్ విధానంలో) ఉంటుంది. పేపర్-2 పరీక్ష ఉదయం 9.30 గంటల నుంచి మధ్యాహ్నం 12గంటల వరకు ఉండనుంది. పేపర్ -1 మధ్యాహ్నం 2 గంటల నుంచి సాయంత్రం 4.30గంటల వరకు ఉంటుంది.
సీటెట్ పరీక్ష రాసేందుకు తెలుగు రాష్ట్రాల్లో పరీక్ష కేంద్రాల వివరాలు ఇలా ఉన్నాయి...
గుంటూరు, తిరుపతి, విజయవాడ, విశాఖపట్నం, హైదరాబాద్, వరంగల్.












Click it and Unblock the Notifications