టారిఫ్ ఎఫెక్ట్ వీరికి పెద్ద దెబ్బే..!

అంతర్జాతీయంగా ఔట్‌సోర్సింగ్ డిమాండ్ బలహీనపడటం, అమెరికా సుంకాలపై అనిశ్చితి నెలకొనడంతో భారత ఐటీ రంగంలో నియామకాలు మందగిస్తున్నాయని పలు రిక్రూట్‌మెంట్ సంస్థల డేటా స్పష్టం చేస్తోంది. ఐటీ సేవల సంస్థలు జూలై-డిసెంబర్ మధ్య కాలానికి తమ నియామక అంచనాలను తగ్గించాయి. ఇంతకు ముందు 3-5%గా ఉన్న ఈ అంచనాలు ఇప్పుడు 1-3%కి పడిపోయాయని టీమ్‌లీజ్ సంస్థ నివేదించింది.

ప్రస్తుతం ప్రపంచ ఆర్థిక అనిశ్చితి, సాంకేతిక రంగంలో వస్తున్న మార్పుల కారణంగా భారత ఐటీ రంగం తీవ్ర ఒత్తిడిని ఎదుర్కొంటోంది. ఫలితంగా, ఉద్యోగ నియామకాలు గణనీయంగా తగ్గుతున్నట్లు పలు నివేదికలు స్పష్టం చేస్తున్నాయి. అవుట్‌సోర్సింగ్‌కు డిమాండ్ తగ్గడం, అమెరికా సుంకాలపై నెలకొన్న అనిశ్చితి, వ్యయ నియంత్రణ ఒత్తిళ్లు వంటివి ఈ ప్రతికూల ప్రభావానికి ప్రధాన కారణాలుగా పరిగణిస్తున్నారు. సంవత్సరం ప్రారంభంలో అంచనా వేసిన నియామకాలతో పోలిస్తే.. ప్రస్తుతానికి సుమారు 1,50,000 మంది ఉద్యోగుల కొరత ఐటీ పరిశ్రమలో నెలకొందని స్పష్టం చేస్తున్నారు.

decline-in-it-recruitment-in-india-due-to-global-demand-issues

సాఫ్ట్‌వేర్ ఇంజనీర్ల నియామకాల డిమాండ్ గణనీయంగా తగ్గిందని రిక్రూట్‌మెంట్ ఏజెన్సీలు వెల్లడించాయి. కృత్రిమ మేధస్సు (AI) వంటి అభివృద్ధి చెందుతున్న సాంకేతిక విభాగాలలో మాత్రమే ఉద్యోగావకాశాలు ఉన్నాయని పేర్కొన్నాయి. ముంబైకి చెందిన సీఐఈఎల్ హెచ్ఆర్ మేనేజింగ్ డైరెక్టర్, సీఈఓ ఆదిత్య మిశ్రా మాట్లాడుతూ.. 2026 ఆర్థిక సంవత్సరం ప్రారంభంలో నికరంగా 10-11% నియామకాలు జరుగుతాయని అంచనా వేసినప్పటికీ, ప్రస్తుతం అది 6-8%కి తగ్గిందని తెలిపారు.

2025 క్యాలెండర్ సంవత్సరం మొదటి సగంలో మొత్తం నియామకాలు గత ఏడాదితో పోలిస్తే దాదాపు 7% తగ్గాయని అడెకో ఇండియా డేటా వెల్లడించింది. ప్రపంచ డిమాండ్ మందగమనం, కొనసాగుతున్న వ్యయ ఒత్తిళ్లే దీనికి ప్రధాన కారణాలని వివరించారు.

ప్రపంచ వాణిజ్య అనిశ్చితులు దాదాపు 90% ఐటీ కంపెనీల నియామక నిర్ణయాలను ప్రభావితం చేస్తున్నాయి. అలాగే, AI స్వీకరణ, వ్యయ ఒత్తిళ్ల కారణంగా కంపెనీలు తమ ఉద్యోగుల విస్తరణ విషయంలో మరింత జాగ్రత్తగా వ్యవహరిస్తున్నాయని నిపుణులు అభిప్రాయపడుతున్నారు.

ట్రంప్ ప్రభుత్వం HIRE చట్టాన్ని (హాల్టింగ్ ఇంటర్నేషనల్ రిలోకేషన్ ఆఫ్ ఎంప్లాయ్‌మెంట్ యాక్ట్) అమలు చేస్తుందనే ప్రచారం, వ్యాపార డిమాండ్ మెరుగుదలపై స్పష్టత వచ్చే వరకు అదనపు నియామకాలను నిరోధించవచ్చని నిపుణులు సూచిస్తున్నారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+