త్వరపడండి.. పదో తరగతి అర్హతతో పరీక్ష లేకుండా ఏకంగా 44,228 ఉద్యోగాలు!
నిరుద్యోగులకు శుభవార్త.. పదోతరగతి అర్హతతో వివిధ పోస్టల్ సర్కిళ్లలో భారీ ఉద్యోగ నోటిఫికేషన్ వెలువడింది. ఎలాంటి అర్హత పరీక్ష లేకుండా పదోతరగతిలో వచ్చిన మార్కుల ఆధారంగా ఉద్యోగం పొందేందుకు ఇదో గొప్ప అవకాశం. పోస్టల్ డిపార్టుమెంట్ వారు 2024-25 సంవత్సరానికి గాను ఏకంగా 44,228 పోస్టులను విడుదల చేశారు. ఈ నోటిఫికేషన్‌కు సంబంధించిన పూర్తి వివరాలు ఇలా ఉన్నాయి..
పోస్టల్ శాఖలో దేశవ్యాప్తంగా గ్రామీణ డాక్ సేవక్ (జీడీఎస్) నోటిఫికేషన్ విడుదలయ్యింది. ఇందుకు అర్హులైన అభ్యర్థులు ఆన్‌లైన్‌లో ఆగస్టు 5వ తేదిలోపు దరఖాస్తు చేసుకోవాల్సి ఉంటుంది. పదోతరగతిలో వచ్చిన మార్కుల ఆధారంగా ఉద్యోగ నియామక ఎంపిక ఉంటుంది. దీంతో ఈ ఉద్యోగాలకు పోటీ ఎక్కువగానే ఉండే అవకాశం ఉంది. ఈ నోటిఫికేషన్‌కు సంబంధించి రాష్ట్రాల వారీగా, జిల్లాల వారీగా పోస్టుల వివరాలను అధికారిక వెబ్‌సైట్‌లో పొందుపరిచారు.

ఇక, తెలుగు రాష్ట్రాలకు సంబంధించి పోస్టుల వివరాలను పరిశీలిస్తే.. బ్రాంచ్ పోస్టు మాస్టర్ (బీపీఎం), అసిస్టెంట్ బ్రాంచ్ పోస్టు మాస్టర్ (ఏబీపీఎం), డాక్ సేవక్ ఉద్యోగాలు తెలంగాణలో 981, ఆంధ్రప్రదేశ్‌లో 1,355 ఉన్నాయి. బ్రాంచ్ పోస్టు మాస్టర్ (బీపీఎం) పోస్టులకు నెలకు రూ.12 వేల నుంచి రూ.29,380, అసిస్టెంట్ బ్రాంచ్ పోస్టు మాస్టర్ (ఏబీపీఎం), డాక్ సేవక్ పోస్టులకు నెలకు రూ.10 వేల నుంచి రూ.24,470 వరకు జీతం అందుకోవచ్చు.
ఎంపిక విధానం..
ఈ ఉద్యోగాలకు దరఖాస్తు చేసుకునే అభ్యర్ధులు పదో తరగతిలో ఉత్తీర్ణతతో పాటు వయోపరిమితి తప్పనిసరి. అభ్యర్థులు 18 నుంచి 40 ఏళ్ల వయసు ఉండాలి. ఎస్సీ, ఎస్టీలకు ఐదేళ్లు, ఓబీసీలకు మూడేళ్లు, దివ్యాంగులకు పదేళ్లవరకు సడలింపు ఉంది. కంప్యూటర్ నాలెడ్జ్, సైకిల్ తొక్కడం రావడం తప్పనిసరి. మెరిట్ లిస్టులో ఎంపికైన వారందరికీ సర్టిఫికెట్ వెరిఫికేషన్ అనంతరం పోస్టులను కేటాయిస్తారు. మరిన్ని వివరాలకోసం అధికారిక వెబ్ సైట్‌ను సందర్శించండి.
ముఖ్యమైన తేదీలు..
ఆన్‌లైన్ దరఖాస్తులు ప్రారంభం: 15-07-2024
దరఖాస్తు చివరి తేదీ: 05-08-2024
దరఖాస్తుల సవరణ : ఆగస్టు 06 నుంచి 08 వరకు ఉంటుంది












Click it and Unblock the Notifications