IDBI బ్యాంకులో ఉద్యోగాల జాతర: ఎగ్జిక్యూటివ్ పోస్టులకు నోటిఫికేషన్: అర్హతలు ఇవే..!!
బ్యాంకులో ఉద్యోగం చేయాలని ఎదురు చూస్తున్న నిరుద్యోగులకు గుడ్ న్యూస్. ఇండస్ట్రియల్ డెవలప్‌మెంట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఐడీబీఐ) పలు పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ విడుదల చేసింది. ఈ నోటిఫికేషన్‌లో భాగంగా 920 ఎగ్జిక్యూటివ్ పోస్టులను భర్తీ చేసేందుకు ఉద్యోగ ప్రకటన విడుదల చేసింది. అర్హులైన అభ్యర్థులు ఆసక్తిగల అభ్యర్థులు నోటిఫికేషన్ పూర్తిగా చదివి ఆ తర్వాత ఆన్‌లైన్ ద్వారా దరఖాస్తు పూర్తి చేయాల్సి ఉంటుంది.
ఇండస్ట్రియల్ డెవలప్‌మెంట్ బ్యాంక్ ఆఫ్ ఇండియాలో 920 ఎగ్జిక్యూటివ్ పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ విడుదలైంది. ఈ పోస్టులన్నీ దేశవ్యాప్తంగా భర్తీ చేయనుంది ఐడీబీఐ బ్యాంకు. ఈ పోస్టులన్నీ కాంట్రాక్ట్ ప్రాతిపదికన భర్తీ చేయనున్నారు. ఓపెన్ కాంపిటీషన్ ద్వారానే పోస్టులన్నీ భర్తీ చేయడం జరుగుతుందని భర్తీ ప్రక్రియలో ఎవరినీ నమ్మి మోసపోవద్దని నిరుద్యోగులకు ఐడీబీఐ బ్యాంక్ విడుదల చేసిన ప్రకటనలో స్పష్టం చేసింది.
ఐడీబీఐ బ్యాంకు విడుదల చేసిన 920 ఎగ్జిక్యూటివ్ పోస్టుల్లో జనరల్ కేటగిరీలో 373 పోస్టులు ఉండగా ఎస్సీ కేటగిరీలో 138 పోస్టులు, ఎస్టీ కేటగిరీలో 69 పోస్టులు, ఓబీసీ కేటగిరీలో 248 పోస్టులు ఉన్నాయి. ఇక ఈడబ్ల్యూఎస్ కేటగిరీలో 92 పోస్టులు ఉంంగా పీడబ్ల్యూడీ కోటాలో 36 పోస్టులను కేటాయించడం జరిగింది.

విద్యార్హతలు:
గుర్తింపు పొందిన యూనివర్శిటీ నుంచి 55శాతం మార్కుల ఉత్తీర్ణతతో ఏదైనా డిగ్రీ ఉండాలి. ఎస్సీ ఎస్టీ పీడబ్ల్యూడీ అభ్యర్థులకు 50శాతం మార్కులతో డిగ్రీ ఉంటే చాలు. ఇక కచ్చితంగా 55శాతం లేదా 50శాతం మార్కులు తప్పనిసరి అని ఐడీబీఐ స్పష్టం చేసింది.అభ్యర్థులు ఆన్‌లైన్ టెస్టు రాయాల్సి ఉంటుంది. అయితే ఆన్‌లైన్ టెస్టు ఎప్పుడు ఉంటుందనేది బ్యాంకు తన అధికారిక వెబ్‌సైట్‌పై పొందుపరుస్తుంది. ఇక పోస్టుల సంఖ్య పెరగొచ్చు లేదా తగ్గొచ్చు అని స్పష్టం చేసింది.
అభ్యర్థుల వయస్సు 1 జూలై 2021 నాటికి 20 నుంచి 25 ఏళ్లు ఉండాలి. ఎస్సీ ఎస్టీ అభ్యర్థులకు 5 ఏళ్లు, నాన్ క్రీమీ లేయర్ ఓబీసీ అభ్యర్థులకు 3 ఏళ్లు, పీడబ్ల్యూడీ అభ్యర్థులకు 10 ఏళ్లు ఎక్స్ సర్వీస్‌మెన్‌లకు 5 ఏళ్ల పాటు ప్రభుత్వ రిజర్వేషన్లు వర్తిస్తాయి.
ముఖ్యమైన తేదీలు:
ఆన్ లైన్ రిజిస్ట్రేషన్ 4 ఆగష్టు 2021న ప్రారంభమై 18 ఆగష్టు 2021న ముగుస్తుంది. ఆన్‌లైన్ టెస్టు 05 సెప్టెంబర్ 2021 ఉండే అవకాశం ఉంది. ఇక ఎంపికైన అభ్యర్థులు మూడేళ్ల కాంట్రాక్ట్ పూర్తి చేసుకున్న తర్వాత వారిని అసిస్టెంట్ మేనేజర్‌గా ప్రమోట్ చేస్తారు.ఇక మూడేళ్ల పాటు తొలి ఏడాది రూ.29వేలు, రెండవ ఏడాది రూ.31వేలు, మూడవ ఏడాది రూ.34వేలు వేతనం పొందుతారు. కాంట్రాక్ట్ సమయంలో అభ్యర్థులు దేశంలోని ఏ ఐడీబీఐ బ్రాంచ్‌లో నైనా పోస్టింగులు ఇవ్వబడతాయి.
అభ్యర్థులు ఐడీబీఐ అధికారిక వెబ్‌సైట్‌ను సందర్శించి ఆన్‌లైన్ ద్వారా అప్లయ్ చేయాలి. అంతకుముందు అభ్యర్థులు వైట్ పేపర్‌పై బ్లాక్ పెన్‌తో సంతకం చేసి సిద్ధంగా ఉంచుకోవాలి. ఇది 10కేబీ నుంచి 20 కేబీ సైజుతో ఉండాలి. ఇక ఫోటో కూడా స్కాన్ చేసి ఉంచుకోవాలి. ఫోటో సైజు 20 నుంచి 50 కేబీ మధ్య ఉండాలి. పూర్తి వివరాలకోసం : www.idbibank.in సందర్శించండి
-
ఉచిత విద్యుత్, రూ. 25,000 ప్రసూతి సాయం: ఎక్కడ కొట్టాలో అక్కడ కొట్టిన విజయ్ -
today rashiphalalu: నేడు అద్భుత రాజయోగంతో పండుగ చేసుకునే రాశులు ఇవే -
భారత్ కు పాక్ వార్నింగ్: ఇళ్లల్లోకి చొరబడి చంపుతాం.. -
పదో తరగతి పరీక్షల్లో పొరపాట్లు, ఆ రెండు సబ్జెక్టుల్లో మార్కుల యాడింగ్..ఇలా..!! -
కేంద్రం బ్రహ్మాస్త్రం: రూ. 2.5 లక్షల కోట్ల భారీ పథకం -
అల్లు అర్జున్-అట్లీ మూవీ టైటిల్ లీక్?.. నెట్టింట రచ్చ! -
చుక్కలు చూపుతున్న పసిడి రేట్లు -
ఎవరైనా ఇలా చేస్తే అమరావతి చట్టబద్ధత రద్దవుతుంది: బాంబు పేల్చిన సాయిరెడ్డి -
ఇరాన్ కు సపోర్ట్ చేస్తావా..? పాకిస్థాన్ ను కోలుకోలేని దెబ్బ కొట్టిన యూఏఈ.. -
తిరుమల, అలిపిరిల్లో చిరుతలను గుర్తించడానికి టీటీడీ కొత్త టెక్నాలజీ -
No Stock: ధర చూస్తే గుండె గుభేల్! డ్రైవర్ల కన్నీటి గాథ! -
గ్యాస్ కష్టాలకు చెక్, ఇలా చేస్తే వెంటనే మీ ముందుకే సిలిండర్..!!












Click it and Unblock the Notifications