నీట్ కౌన్సెలింగ్ తో ఐఐటీలో అడ్మిషన్లు..! దేశంలో తొలిసారి ఖరగ్ పూర్ IIT రికార్డు..!

మన దేశంలో ప్రతిష్టాత్మక ఉన్నత విద్యాసంస్థలుగా పేరున్న ఐఐటీలు ఇప్పుడు తమ రూపురేఖలు మార్చుకుంటున్నాయి. ఒకప్పుడు ఇంజనీరింగ్ చదువులకే పరిమితమైన ఐఐటీలు.. ఈ మధ్య మెడికల్ కోర్సులు కూడా ప్రవేశపెడుతున్నాయి. ఇలా పీజీ మెడికల్ కోర్సుల్ని ప్రవేశపెట్టడం ద్వారా ఐఐటీ ఖరగ్ పూర్ (IIT Kharagpur) అరుదైన రికార్డు సాధించింది. దేశంలోనే తొలిసారి పీజీ మెడికల్ కోర్సులు ఆఫర్ చేస్తున్న ఐఐటీగా ఖరగ్ పూర్ IIT నిలిచింది.

NEET UG: నీట్ యూజీలో కీలక మార్పులు? రెండు దశల్లో పరీక్ష, వయో పరిమితి సహా..!
NEET UG: నీట్ యూజీలో కీలక మార్పులు? రెండు దశల్లో పరీక్ష, వయో పరిమితి సహా..!

జాతీయ మెడికల్ కమిషన్ (NMC) గుర్తింపు పొందిన ఆరు పీజీ మెడికల్ కోర్సుల్ని ప్రవేశపెట్టడం ద్వారా దేశంలోనే తొలి ఐఐటీగా ఖరగ్ పూర్ రికార్డు సృష్టించింది. వచ్చే విద్య సంవత్సరం నుంచి ఐఐటీలోని డాక్టర్ బీసీ రాయ్ మల్టీ స్పెషాలిటీ మెడికల్ రీసెర్చ్ సెంటర్ లో తమ మొదటి బ్యాచ్ ఎండీ విద్యార్ధులను చేర్చుకోనుంది. దీంతో వైద్యం, ఇంజనీరింగ్, కృత్రిమ మేథ, బయో మెడికల్ సైన్సెస్, ట్రాన్స్ లేషన్ రీసెర్చ్ లను ఒకే చోట చేర్చి పీజీ మెడికల్ విద్యలోకి ప్రవేశించిన ఐఐటీగా గుర్తింపు తెచ్చుకుంటోంది.

IIT Kharagpur Becomes First IIT to Offer Postgraduate Medical Courses Announces 12 MD Seats
AI ఉద్యోగాల్ని తీసేయట్లేదు- ఇలా మారుస్తోంది..! ఐఐటీ మద్రాస్ షాకింగ్ రిపోర్ట్..!
AI ఉద్యోగాల్ని తీసేయట్లేదు- ఇలా మారుస్తోంది..! ఐఐటీ మద్రాస్ షాకింగ్ రిపోర్ట్..!

ఖరగ్ పూర్ ఐఐటీ ఇప్పుడు మొత్తం ఆరు స్పెషలైజేషన్లలో పీజీ మెడికల్ కోర్సుల్ని అందించబోతోంది. ప్రతీ విభాగంలో రెండు సీట్లతో మొత్తం 12 మంది విద్యార్ధులను ఇందులో చేర్చుకుంటోంది. ఇందులో ఎండీ జనరల్ మెడిసిన్, ఎండీ రేడియాలజీ, ఎండీ ఫిజియాలజీ, ఎండీ పాథాలజీ, ఎండీ కమ్యూనిటీ మెడిసిన్, ఎండీ బయోకెమిస్ట్రీ విభాగాలు ఉన్నాయి. వీటిలో ప్రతీ విభాగంలోనూ ఇద్దరు విద్యార్ధుల చొప్పున పీజీ మెడికల్ కోర్సులకు విద్యార్ధుల్ని చేర్చుకోనుంది. 2026 నీట్ పీజీ ఆన్ లైన్ కౌన్సిలింగ్ ద్వారానే ఈ సీట్లను భర్తీ చేస్తోంది. కాబట్టి అర్హులైన విద్యార్ధులు నీట్ పీజీ-2026 ఆన్ లైన్ కౌన్సిలింగ్ రెండో రౌండ్ ద్వారా వీటికి దరఖాస్తు చేసుకోవచ్చు. ఐఐటీ ఖరగ్ పూర్ వెబ్ సైట్లో దీనికి సంబంధించి పూర్తి వివరాలు ఉన్నాయి.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+