పేరు గొప్ప ఊరు దిబ్బ.. IIT Roorkeeలో విద్యార్థుల ఆందోళన, ఏమైందంటే?
Rats in IIT Roorkee Mess: ప్రతిష్టాత్మకమైన ఇండియన్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ రూర్కీలో విద్యార్థులు తమ హాస్టల్ ఫుడ్‌లో ఎలుకలు ఉన్నట్లు నివేదించిన తర్వాత వివాదం పెద్దదిగా మారింది. ఈ సంఘటన విద్యార్థి సంఘంలో ఆగ్రహాన్ని రేకెత్తించింది. యాజమాన్యం వెంటనే స్పందించాలంటూ డిమాండ్స్ ఊపందుకున్నాయి.
మెస్ కిచెన్ ప్రాంతంలో ఎలుకలు కనిపించాయని పేర్కొంటూ గురువారం రాధా కృష్ణ భవన్ హాస్టల్ విద్యార్థులు నిరసన ప్రదర్శన చేయడంతో ఐఐటీ రూర్కీలో వివాదం పెద్దదిగా మారింది. మెస్ అపరిశుభ్రంగా ఉందని, ఆహార పాత్రలు, వంటగది సామాగ్రిలో ఎలుకలు ఉన్నాయని విద్యార్థులు ఆరోపించారు. దీనికి సంబంధించిన వీడియో కూడా ఒకటి సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. ఈ క్రమంలో చాలా మంది విద్యార్థులు తమ అనుభవాలను, ఎలుకలు పాకిన ఆహారానికి సంబంధించిన ఫోటోలను సోషల్ మీడియాలో పంచుకున్నారు. గత ఏడాది కాలంగా ఈ సమస్య కొనసాగుతోందని వారు ఆరోపిస్తున్నారు. సరైన పరిష్కారం చూపటంలో యాజమాన్యం విఫలమైందని వారు అంటున్నారు.

మా ఆహారంలో ఎలుకలు కనిపించడంతో మేము ఆశ్చర్యపోయామంటూ ఒక విద్యార్థి అసహ్యం వ్యక్తం చేశారు.ఇది తీవ్రమైన ఆరోగ్య ప్రమాదానికి దారితీస్తుందని వారు అంటున్నారు. సోషల్ మీడియాలో విషయం బయటకు రావటంతో స్థానిక పత్రికల్లో వార్త మెయిన్ హెడ్ లైన్ అయ్యింది. దీంతో జిల్లా ఆహార భద్రతా విభాగం హాస్టల్ వంటగదిని తనిఖీ చేసింది. తదుపరి పరీక్ష కోసం వారు ఆహారం, సుగంధ ద్రవ్యాలు, ఇతర వస్తువుల నమూనాలను సేకరించారు. ఇప్పటికే ఇక్కడ చదువుకునేందుకు తాము అధిక ఫీజులు చెల్లించామని, మంచి వసతులను ఆశిస్తున్నట్లు విద్యార్థులు చెబుతున్నారు.
उत्तराखंड में देश के प्रसिद्ध संस्थान IIT रुड़की की मेस में कल दोपहर छात्रों ने खाने के बर्तनों में चूहों को उथल-पुथल करते देखा। ये देख 400 से अधिक छात्र दोपहर को भूखे ही रह गए। चूहों का वीडियो बनाकर छात्रों ने सोशल मिडिया पर भी पोस्ट किया#IIT #IITRoorkee #ViralVideo #IITMess pic.twitter.com/zsakJfVvoo
— Shivanand Kashyap (@Shivanand425) October 19, 2024
ఇదిలా ఉండగా ఐఐటీ రూర్కీ అడ్మినిస్ట్రేషన్ మాత్రం ఆహారంలో ఎటువంటి కలుషితం జరగలేదంటూ ఖండించింది. హాస్టళ్లలోకి విచ్చలవిడిగా ఎలుకలు ప్రవేశించడమే ఈ ఘటనలకు కారణమని వారు తెలిపారు. తాము విద్యార్థుల ఆరోగ్యం, భద్రతకు చాలా తీవ్రంగా పరిగణిస్తామని ఇన్స్టిట్యూట్ ప్రతినిధి చెప్పారు. ఇలాంటి ఘటనలు పునరావృతం కాకుండా కఠిన చర్యలు తీసుకున్నామని కూడా వెల్లడించారు. పైగా ఈ విషయంపై దర్యాప్తు క్షుణ్ణంగా కొనసాగుతున్నట్లు పేర్కొన్నారు. వంటగది ప్రాంతంలో ఇన్‌ఫెక్షన్ మోసే ఎలుకలు తిరగటంపై విద్యార్థులు అసంతృప్తితో పాటు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. అన్ని భద్రత, పరిశుభ్రత ప్రోటోకాల్‌లను అనుసరించినట్లయితే మెస్‌లో ఎలుకలు ఎందుకు ఉన్నాయని వారు ప్రశ్నించారు. వీడియో ఫుటేజీని మెస్‌లోని క్లోజ్డ్-ఆఫ్ సెక్షన్‌లో రాత్రిపూట తీయబడిందని, అక్కడ తినదగిన వస్తువులు నిల్వ చేయలేదని ఇన్‌స్టిట్యూట్ స్పష్టం చేసింది.












Click it and Unblock the Notifications