జవహర్ నవోదయ విద్యాలయ ప్రవేశ పరీక్ష ఫలితాలు విడుదల...
జవహర్ నవోదయ విద్యాలయ ప్రవేశ పరీక్ష ఫలితాలు విడుదలయ్యాయి. దేశవ్యాప్తంగా ఉన్న 649 జవహర్ నవోదయ విద్యాలయాల్లో ఆరు, తొమ్మిదో తరగతుల ప్రవేశాల కోసం పరీక్షలు జరిగిన సంగతి తెలిసిందే. ఈ పరీక్ష ఫలితాలను నవోదయ విద్యాలయ సమితి తాజాగా విడుదల చేసింది. విద్యార్థులు తమ రోల్ నెంబరు, పుట్టినతేదీ వివరాలు నమోదుచేసి ఫలితాలను చెక్ చేసుకోవచ్చు.
రెండు తెలుగురాష్ట్రాల్లో ఈ నవోదయ ప్రవేశ పరీక్షను జనవరి 20వ తేదీన నిర్వహించిన సంగతి తెలిసిందే. ఈ పరీక్షను ఆంగ్ల, హిందీ మాధ్యమంతో పాటు ఇతర రాష్ట్ర ప్రాంతీయ భాషల్లో కూడా నిర్వహించారు. ఈ ప్రవేశ పరీక్షలో సాధించిన మెరిట్ ఆధారంగా విద్యార్థులకు సీట్లు కేటాయిస్తారు. ఈ పరీక్ష ఫలితాలను నవోదయ విద్యాలయ సమితి అధికారిక వెబ్‌సైట్‌లో పొందుపరిచింది. దేశంలోని మొత్తం 649 జేఎన్‌వీల్లో సుమారు 48 వేల వరకు సీట్లు అందుబాటులో ఉన్నాయి. ఇందులో ఒక్కో నవోదయ పాఠశాలలో 80 మంది విద్యార్థులకు ఆరోతరగతిలో ప్రవేశం కల్పించనున్నారు. ఏపీలో అయితే, 15 పాఠశాలలు, తెలంగాణలో అయితే 9 నవోదయ విద్యాలయ సమితిలు ఉన్నాయి. ప్రభుత్వ గుర్తింపు పొందిన పాఠశాలల్లో ఐదవ తరగతి పూర్తిచేసిన విద్యార్థులు ఈ పరీక్షకు దరఖాస్తు చేసుకునేందుకు అర్హులు. మొత్తం సీట్లలో 75 శాతం సీట్లు గ్రామీణ ప్రాంతాల విద్యార్థులకు, 25శాతం సీట్లు పట్టణ ప్రాంత విద్యార్థులకు కేటాయిస్తారు. ఈ పరీక్షలో ఎంపికయిన అభ్యర్థులకు 6వ తరగతి నుంచి 12వ తరగతి వరకు ఉచిత విద్యను అందిస్తారు.

ఉచిత విద్యతో పాటు వసతి, భోజన సౌకర్యాలు..
మొత్తం సీట్లలో మూడో వంతు సీట్లను బాలికలకు కేటాయించారు. ఎస్సీలకు 15, ఎస్టీలకు 7.5, ఓబీసీలకు 27 శాతం సీట్లు కేటాయిస్తారు. దివ్యాంగులకు కూడా సీట్లు కేటాయిస్తారు. ఈ పరీక్షలో ఎంపికైనవారికి 6వ తరగతి నుంచి ఇంటర్ వరకు ఉచిత విద్యతో పాటు వసతి, భోజన సౌకర్యాలు ఉంటాయి. ఎనిమిదో తరగతి వరకు మాతృ భాష లేదా ప్రాంతీయ భాషలో విద్య అభ్యసించే అవకాశం ఉంటుంది. తొమ్మిదో తరగతి నుంచి ఆంగ్ల మాధ్యమాన్ని బోధిస్తారు.
https://cbseit.in/cbse/2024/NVS_RST/Result.aspx












Click it and Unblock the Notifications