జేఈఈ అడ్వాన్స్‌డ్‌ 2024 రిజిస్ట్రేషన్లు ప్రారంభం...ఇలా ద‌ర‌ఖాస్తు చేసుకోండి..!

నేటి నుంచే జేఈఈ అడ్వాన్స్‌డ్‌ 2024 రిజిస్ట్రేషన్లు ప్రారంభమయ్యాయి. వ‌చ్చే నెల 7వ తేదీలోగా అభ్య‌ర్థులు ద‌ర‌ఖాస్తు చేసుకునేందుకు అవ‌కాశం ఉంటుంది. జేఈఈ మెయిన్‌లో కటాఫ్‌ మార్కులు పొంది ఉత్తీర్ణత సాధించిన 2.50 లక్షల మంది అభ్యర్థులకి జేఈఈ అడ్వాన్స్‌డ్‌ పరీక్ష రాసేందుకు అర్హులు. అభ్య‌ర్థులు జేఈఈ అధికారిక సైట్ jeeadv.ac.in నుండి ఆన్‌లైన్‌లో దరఖాస్తులు చేసుకోవచ్చు.

జేఈఈ మెయిన్ 2024 ఫలితాలను ఇటీవల ఎన్‌టిఎ విడుదల చేసిన సంగ‌తి తెలిసిందే. JEE మెయిన్‌లో తమ కేటగిరీకి చెందిన కటాఫ్ మార్కులకు సమానంగా లేదా అంతకంటే ఎక్కువ స్కోర్ చేసిన విద్యార్థులు JEE అడ్వాన్స్‌డ్ పరీక్షకు ద‌ర‌ఖాస్తు చేసుకోవచ్చు. ఈ ఏడాది దాదాపు 2 లక్షల 50 వేల మంది విద్యార్థులు జేఈఈ మెయిన్‌ కటాఫ్‌లో ఉత్తీర్ణులయ్యారని ఎన్‌టిఈ తెలిపింది. వీరంతా జేఈఈ అడ్వాన్స్‌డ్ పరీక్షకు హాజరయ్యేందుకు అర్హులు. ఇక‌, జేఈఈ అడ్వాన్స్‌డ్ ప‌రీక్ష మే 26న ఉంటుంది. ఇందులో రెండు పేప‌ర్లు ఉంటాయి. పేప‌ర్ 1 ప‌రీక్ష ఉదయం 9 గంటల నుంచి మధ్యాహ్నం 12 గంటల వరకు ఉంటుంది. పేప‌ర్ 2 ప‌రీక్ష మధ్యాహ్నం 2.30 గంటల నుంచి సాయంత్రం 5.30 గంటల వరకు పేపర్‌ -2 పరీక్షలు నిర్వహించనున్నారు. ఈ పరీక్ష‌ల‌కు సంబంధించిన అడ్మిట్‌కార్డుల‌ను మే 17 నుంచి 26 వరకు అభ్య‌ర్థుల‌కు వెబ్‌సైట్‌లో అందుబాటులో ఉంచుతారు. ఇక‌, జేఈఈ అడ్వాన్స్‌డ్‌ ఫలితాలను జూన్‌ 9వ తేదీన విడుదల చేస్తారు.

JEE Advanced 2024 Registrations Begin Apply Here

రిజిస్ట్రేషన్ ఫీజు, ఇత‌ర వివ‌రాలు ఇలా ఉన్నాయి..

ఈ ప‌రీక్షకు ద‌ర‌ఖాస్తు చేసుకోవాల‌నుకునే SC, ST, PWD కేటగిరీ అభ్యర్థులు - రూ 1600 చెల్లించాలి.

అన్ని కేటగిరీలకు చెందిన మహిళా అభ్యర్థులు రూ 1600 చెల్లించాలి.

అన్ని క‌లిపి ఇతర దరఖాస్తుదారులు - రూ 3200 చెల్లించాల్సి ఉంటుంది.

జేఈఈ ముఖ్య‌మైన తేదీలు ఇవే..

జేఈఈ అడ్వాన్స్‌డ్ ప‌రీక్ష కోసం ఆన్‌లైన్ రిజిస్ట్రేషన్ చేయుట‌కు చివరి తేదీ 2024 - మే 7

నమోదిత అభ్యర్థులకు రిజిస్ట్రేషన్ ఫీజు చెల్లించడానికి చివరి తేదీ - మే 10

మే 17 నుండి మే 26 వరకు అడ్మిట్ కార్డ్ డౌన్‌లోడ్ చేసుకోవ‌చ్చు.

జేఈఈ అడ్వాన్స్‌డ్ 2024 పరీక్ష - మే 26, 2024

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+