ఏపీ, తెలంగాణలో జేఈఈ అడ్వాన్స్‌డ్ ఎగ్జామ్ సెంటర్స్ ఇవే..?
భారతదేశంలో అత్యంత ప్రతిష్టాత్మకమైన ఇంజనీరింగ్ ప్రవేశ పరీక్షగా " జాయింట్ ఎంట్రన్స్ ఎగ్జామినేషన్ "(JEE) అడ్వాన్స్‌డ్ 2026 నిలుస్తుంది. ఈ ప్రవేశ పరీక్ష ద్వారా దేశంలోని ప్రతిష్ఠాత్మక ఐఐటీల్లో బీటెక్ సీట్ల భర్తీ చేపడతారు. అందుకే జేఈఈ అడ్వాన్స్‌డ్ పరీక్షకు విపరీతమైన పోటీ ఉంటుంది. ప్రతి ఏడాది లక్షలాది మంది విద్యార్థులు జేఈఈ మెయిన్ రాస్తున్నప్పటికీ.. అందులో మొదటి 2.50 లక్షల ర్యాంకులు సాధించిన వారికే జేఈఈ అడ్వాన్స్‌డ్ రాసే అవకాశం కల్పిస్తారు. ఈ పరీక్ష ద్వారా దేశవ్యాప్తంగా ఉన్న 23 ఐఐటీల్లో ప్రవేశాలు కల్పించానున్నారు.
పరీక్ష తేదీ & విధానం..
ఈ పరీక్షను మే 17, 2026న దేశవ్యాప్తంగా పలు పరీక్షా కేంద్రాల్లో ఆన్‌లైన్ (CBT) విధానంలో నిర్వహించనున్నారు. గత ఏడాది దేశవ్యాప్తంగా 725 పరీక్షా కేంద్రాల్లో ఈ పరీక్ష జరగగా, ఈసారి కేంద్రాల సంఖ్యను 717కు తగ్గించారు. అయినప్పటికీ, విద్యార్థులకు ఇబ్బంది లేకుండా ప్రాంతాల వారీగా కేంద్రాల కేటాయింపు జరిగింది.

దరఖాస్తు ప్రక్రియ..
ఈ పరీక్షకు సంబంధించిన పూర్తి నోటిఫికేషన్‌ను ఐఐటీ రూర్కీ విడుదల చేసింది.
ఆన్‌లైన్ రిజిస్ట్రేషన్: ఏప్రిల్ 23, 2026 నుంచి ప్రారంభం
జేఈఈ మెయిన్ ఫలితాలు వెలువడిన మరుసటి రోజు నుంచే అప్లికేషన్ లింక్ యాక్టివ్ అవుతుంది
అభ్యర్థులు దరఖాస్తులో గరిష్టంగా 10 పరీక్షా కేంద్రాలను ఎంపిక చేసుకోవచ్చు
పరీక్ష ఫలితాలు, ర్యాంకుల వివరాలను నేరుగా విద్యార్థుల మొబైల్ నంబర్లకు పంపిస్తారు
తెలంగాణలో 13, ఏపీలో 24 పరీక్షా కేంద్రాలు..
తెలంగాణలోని పరీక్షా కేంద్రాలు (13):
ఆదిలాబాద్, హైదరాబాద్, కరీంనగర్, ఖమ్మం, కోదాడ, కొత్తగూడెం, మహబూబ్‌నగర్, నల్గొండ, నిజామాబాద్, సత్తుపల్లి, సిద్దిపేట, సూర్యాపేట, వరంగల్.
ఆంధ్రప్రదేశ్‌లోని పరీక్షా కేంద్రాలు (24):
శ్రీకాకుళం, విశాఖపట్నం, విజయనగరం, అమలాపురం, అనంతపురం, భీమవరం, చీరాల, చిత్తూరు, ఏలూరు, గుడ్లవల్లేరు, గూడూరు, కడప, కాకినాడ, కర్నూలు, మార్కాపురం, మైలవరం, నరసరావుపేట, నెల్లూరు, ఒంగోలు, రాజమహేంద్రవరం, సూరంపాలెం, తాడేపల్లిగూడెం, తిరుపతి, విజయవాడ.
ఐఐటీల్లో సీట్ల వివరాలు..
18,160 బీటెక్ & బీఎస్ సీట్లు
ప్రస్తుతం దేశవ్యాప్తంగా ఉన్న 23 ఐఐటీల్లో బీటెక్, బీఎస్ కోర్సుల కోసం మొత్తం 18,160 సీట్లు అందుబాటులో ఉన్నాయి.
- కంప్యూటర్ సైన్స్
- ఎలక్ట్రికల్
- మెకానికల్
- సివిల్
- కెమికల్
- ఎయిరోస్పేస్
వంటి కోర్సుల్లో ఈ సీట్లు ఉన్నాయి. వచ్చే విద్యా సంవత్సరంలో కొత్త కోర్సులు లేదా విస్తరణతో సీట్లు మరింత పెరిగే అవకాశం ఉందని నిపుణులు అంచనా వేస్తున్నారు.
విద్యార్థులకు కీలక సూచనలు..
జేఈఈ అడ్వాన్స్‌డ్ పరీక్ష కాన్సెప్ట్ ఆధారితంగా, లోతైన అవగాహనతో ప్రశ్నలు ఉంటాయి
మాక్ టెస్టులు, గత సంవత్సరాల ప్రశ్నాపత్రాల సాధన ఎంతో అవసరం
అప్లికేషన్ సమయంలో వ్యక్తిగత వివరాలు, సెంటర్ ఆప్షన్లు జాగ్రత్తగా నమోదు చేయాలి
పూర్తి సమాచారం కోసం అధికారిక వెబ్‌సైట్‌ను తప్పనిసరిగా సందర్శించాలి.
-
వంట గ్యాస్ ఇక బుక్ చేయాలంటే, ఇలా తప్పనిసరి - తాజా మార్గదర్శకాలు..!! -
రామ్‌చరణ్ నా ప్రాణం కంటే ఎక్కువ: అల్లు అర్జున్ -
సప్తగిరి ఎక్స్‌ప్రెస్, చర్లపల్లి సూపర్ ఫాస్ట్ రైళ్లకు ఇకపై -
ఉత్తర తెలంగాణా అభివృద్ధిలో గేమ్ ఛేంజర్ ఆ ఎయిర్పోర్ట్.. కేంద్రం మరో కీలక అడుగు! -
20 ఏళ్ల తేడా ఉన్న ఆ చిన్నదే ఎందుకు? ఒక్క సీన్‌తో ఛాన్స్ కొట్టేసింది! -
తండ్రి, తనయుడి స్థానాలు ఇవే- డీఎంకే తొలి జాబితా -
జన్మ నక్షత్రం పునర్వసు, పుష్యమి, ఆశ్లేష ఉన్నవారి ఏప్రిల్ నెల జాతక ఫలం -
H-1B Visa: హెచ్1బీ లాటరీ నోటీసుల విడుదల-స్టేటస్ ఇలా చెక్ చేసుకోండి..! -
రాజమండ్రి- కాకినాడ పోర్ట్ రైలు ప్రయాణికులకు ముఖ్య గమనిక -
ఏప్రిల్ లో బ్యాంకులకు వరుస హాలిడేస్ - స్కూళ్లకు వేసవి సెలవులపై తాజా ఉత్తర్వులు..!! -
ఇరాన్‌కు రోజుకు రూ. 1,319 కోట్ల ఆదాయం.. అమెరికా అంతమే లక్ష్యంగా..!! -
బంగారం ధరలు తలకిందులు












Click it and Unblock the Notifications