JEE Main result 2024: జేఈఈ మెయిన్స్ సెషన్ 1 ఫలితాల విడుదల-స్కోర్ కార్డ్ ఇలా చెక్ చేసుకోెండి

ఈ ఏడాది జనవరి 24 నుంచి ఫిబ్రవరి 1 వరకూ నిర్వహించిన జేఈఈ మెయిన్స్ సెషన్ 1 పరీక్ష ఫలితాలు ఇవాళ ఉదయం విడుదల అయ్యాయి. జాతీయ టెస్టింగ్ ఏజెన్సీ (ఎన్టీఏ)ఫలితాలను అధికారిక వెబ్ సైట్ లో విడుదల చేసింది. నిన్న జేఈఈ పరీక్షకు సంబంధించిన తుది ఆన్సర్ కీని విడుదల చేసిన ఎన్టీఏ... ఫలితాలు కూడా విడుదల చేస్తుందని భావించినా ఆలస్యం కావడంతో ఇవాళ వెలువడ్డాయి.

జేఈఈ మెయిన్ 2024 సెషన్ 1 పరీక్షకు సంబంధించిన ఫలితాలను జాతీయ టెస్టింగ్ ఏజెన్సీ ఎన్టీఏ jeemain.nta.ac.in వెబ్ సైట్ లో విడుదల చేసింది. పరీక్ష రాసిన అభ్యర్ధులు ఇందులోకి లాగిన్ అయి స్కోర్ కార్డు, ఇతర వివరాలను తెలుసుకోవచ్చు. అలాగే ఎన్టీఏ మరో వైబ్ సైట్ ntaresults.nic.in లోకి లాగిన్ అయ్యి కూడా ఫలితాలు తెలుసుకోవచ్చు. ఫలితాల విడుదల తర్వాత రీవ్యాల్యూయేషన్ కానీ, ఫలితాల రీ చెకింగ్ కు కానీ అనుమతించడం లేదని ఎన్టీఏ తెలిపింది.

JEE Main result 2024 Session 1 released- here is how to access scorecard, other details

పరీక్షలో అభ్యర్థుల ప్రతిభ ఆధారంగా జేఈఈ మెయిన్ టాపర్ల జాబితా తయారవుతుంది. జేఈఈ ప్రధాన స్కోర్లు, టాపర్‌ల ర్యాంక్‌లు సరైన సమాధానాలకు +4, తప్పు సమాధానాలకు -1 మార్కింగ్ ఆధారంగా లెక్కిస్తారు. వివిధ సెషన్లలో జరిగిన పరీక్ష కష్టతరమైన స్థాయిలలో తేడాలను లెక్కించడానికి సాధారణీకరణ ప్రక్రియ ఉంటుంది. ఈ ఏడాది జేఈఈ మెయిన్స్ సెషన్ 1 పరీక్షకు గతేడాదితో పోలిస్తే 27 శాతం ఎక్కువ దరఖాస్తులు వచ్చాయి. మొత్తం 12 లక్షల 31 వేల 874 మంది అభ్యర్ధులు దరఖాస్తు చేసుకున్నారు. పేపర్ 1 పరీక్షకు దేశవ్యాప్తంగా 95.8 శాతం మంది అభ్యర్ధులు హాజరయ్యారు.

పరీక్షలో కటాఫ్ ల విషయానికొస్తే.. వీటిని రెండు రకాలుగా నిర్ణయిస్తారు. ఇందులో ఒకటి క్వాలిఫయింగ్ కటాఫ్. దీన్ని జాతీయ టెస్టింగ్ ఏజెన్సీ నిర్ణయిస్తుంది. అలాగే రెండవది అడ్మిషన్ కటాఫ్. దీన్ని అడ్మిషన్లు ఇచ్చేందుకు అందుబాటులో ఉన్న సంస్ధల తరఫున జాయింట్ సీట్ అలకేషన్ అథారిటీ(జేఓఎస్ఏఏ) నిర్ణయిస్తుంది. కేటగిరీల వారీగా కటాఫ్ లు నిర్ణయిస్తారు. ఈసారి జేఈఈ మెయిన్ 2024 కటాఫ్ జనరల్ కేటగిరీకి 90 ప్లస్ ఉండనున్నట్లు తెలుస్తోంది. ఓబీసీ-ఎన్సీఎల్ కేటగిరీకి 75 ప్లస్, ఈడబ్ల్యూఎస్ 78 ప్లస్, ఎస్సీలకు 44 ప్లస్, పీడబ్లూడీకి 0.11 ప్లస్ ఉంటుందని అంచనా వేస్తున్నారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+