Job Mela: అవనిగడ్డలో 9న జాబ్ మేళా-800 ఉద్యోగాలు ! పూర్తి వివరాలివే
ఏపీలో ఉద్యోగాల కోసం ఎదురుచూస్తున్న యువత కోసం కృష్ణాజిల్లాలో రెండు రెండు ఎన్జీవోలు కలిపి ఓ జాబ్ మేళా నిర్వహిస్తున్నాయి. ఈ నెల 9న దాదాపు 800 మంది ఉద్యోగాల భర్తీ కోసం ఈ జాబ్ మేళా నిర్వహిస్తున్నారు. పదో తరగతి నుంచి డిగ్రీ వరకూ వివిధ విద్యార్హతలతో ఈ జాబ్స్ ను ఆఫర్ చేస్తున్నారు. ఈ జాబ్ మేళాలో అపోలో, టాటా టెక్నాలజీస్, రిలయన్స్ డిజిటల్ వంటి సంస్ధల్లో ఉద్యోగాలు ఉన్నాయి.
జూలై 9న అవనిగడ్డలోని గాంధీ క్షేత్రంలో అంజనాస్ ఫౌండేషన్, గ్రామీణ యువజన వికాస సమితి అనే రెండు సంస్ధలు సంయుక్తంగా ఈ జాబ్ మేళా నిర్వహిస్తున్నాయి. ఈ జాబ్ మేళాలో మొత్తం 7 సంస్ధలు పాల్గొంటున్నాయి. ఈ సంస్ధల్లో 800 ఉద్యోగాలు ఉన్నాయి. ఈ జాబ్ మేళాకు హాజరవుతున్న సంస్ధల్లో అపోలో ఫార్మసీ, టాటా టెక్నాలజీస్, షిండ్లర్ ఎలక్ట్రిక్, సుప్రజిత్ ఇంజనీరింగ్, మదర్సన్ సుమీ సిస్టమ్స్, యాంఫెనాల్, రిలయన్స్ డిజిటల్ వంటి సంస్ధలు ఉన్నాయి.

వీటిలో ఒక్కో సంస్ధల్లో 50 నుంచి 200 ఉద్యోగాల వరకూ ఉన్నాయి. పురుషులు, మహిళలు కూడా ఈ జాబ్ మేళాలో పాల్గొని ఉద్యోగాలకు పోటీ పడే అవకాశం కల్పించారు. జీతం ప్యాకేజీలు కూడా ఏడాదికి లక్షన్నర నుంచి 3 లక్షల వరకూ ఉన్నాయి. పదో తరగతి, ఇంటర్, డిగ్రీ, డిప్లమో చేసిన వారు ఈ ఉద్యోగాలకు అర్హులు. విజయవాడ, గుడివాడ, గుంటూరు, హైదరాబాద్, చెన్నై, బెంగళూరులో ఈ ఉద్యోగాలు ఉన్నాయి. ఈ అర్హతలు కలిగిన వారు ఆధార్, పాస్ పోర్టు ఫొటో, బయోడేటా, సర్టిఫికెట్లతో ఈ నెల 9న ఉదయం 10 గంటలకు జాబ్ మేళాకు హాజరు కావాల్సి ఉంటుంది.












Click it and Unblock the Notifications