ఎటువంటి రాత‌ప‌రీక్ష లేకుండానే ఏపీ విద్యుత్తు సంస్థ‌లో ఉద్యోగాలు...

ఏపీలోని నిరుద్యోగుల‌కు శుభ‌వార్త‌.. ఎటువంటి రాత‌ప‌రీక్ష లేకుండానే ఏపీఈపీడీసీఎల్ ఉద్యోగాల‌కు నోటిఫికేష‌న్ వెలువ‌డింది. విశాఖపట్నంలోని ఆంధ్రప్రదేశ్‌ తూర్పు ప్రాంత విద్యుత్‌ పంపిణీ సంస్థ, కార్పొరేట్ ఆఫీస్‌లో కాంట్రాక్ట్ ప్రాతిపదికన మేనేజర్/ ఐటీ ఉద్యోగాల భర్తీకి అర్హులైన అభ్య‌ర్థుల నుంచి దరఖాస్తులను స్వీక‌రిస్తోంది. రాత‌ప‌రీక్ష లేకుండానే కేవ‌లం ఇంట‌ర్వ్యూ ద్వారానే ఈ పోస్టుల‌ను భ‌ర్తిచేయ‌నున్నారు. అర్హులైన అభ్యర్థులకు వాక్‌ ఇన్‌ ఇంటర్వ్యూ నిర్వహిస్తారు.

పోస్టుల వివ‌రాలివే...

మొత్తం ఖాళీలు : 05

మేనేజర్- ఐటీ/ డేటా అనలిటిక్స్: 01
మేనేజర్- ఐటీ/ డేటా సెంటర్ అడ్మినిస్ట్రేటర్: 01
మేనేజర్- ఐటీ/ సైబర్ సెక్యూరిటీ: 01
మేనేజర్- ఐటీ/ శాప్‌: 01
మేనేజర్- ఐటీ/ మొబైల్ అప్లికేషన్స్: 01

Jobs in AP Electricity Company without any written exam

విద్యార్హ‌త : పోస్టును అనుసరించి బీఈ, బీటెక్‌, ఎంఈ, ఎంటెక్‌, ఎంసీఏ ఉత్తీర్ణతతో పాటు కనీసం 5-8 ఏళ్ల ఎక్స్‌పీరియ‌న్స్ ఉన్న‌వారికి ప్రాధాన్య‌త ఉంటుంది. అర్హత, ఆసక్తి ఉన్న అభ్యర్థులు ఆఫ్‌లైన్‌ విధానంలో ద‌ర‌ఖాస్తు చేసుకోగ‌ల‌రు. ఇత‌ర పూర్తి స‌మ‌చారం కోసం లేదా అప్ల‌య్ చేయ‌డం కోసం అభ్య‌ర్థులు అధికారిక వెబ్‌సైట్‌ను https://apeasternpower.com/ స‌ంప్ర‌దించాల్సి ఉంటుంది.
వయసు : ఈ పోస్టులకు ద‌ర‌ఖాస్తు చేసుకోవాల‌నుకునేవారు నోటిఫికేషన్ ప్ర‌క‌టించిన తేదీ నాటికి 50 ఏళ్లు మించకుండా ఉండాలి.

దరఖాస్తు విధానం: ఆఫ్‌లైన్‌ విధానంలో మాత్ర‌మే అప్ల‌య్ చేయ‌గ‌ల‌రు. ద‌ర‌ఖాస్తు చేసుకున్న అర్హులైన అభ్యర్థులకు వాక్‌ ఇన్‌ ఇంటర్వ్యూ ఉంటుంది. ఇంటర్వ్యూ తేదీని త్వరలో ప్ర‌క‌టిస్తారు.

ఇంటర్వ్యూ నిర్వ‌హించు వేదిక వివ‌రాలు..

చీఫ్ జనరల్ మేనేజర్/ హెచ్‌ఆర్‌డీ, ఏపీఈపీడీసీఎల్‌,
కార్పొరేట్ కార్యాలయం, సీతమ్మధార, విశాఖపట్నం, ఆంధ్ర‌ప్ర‌దేశ్‌.
అభ్య‌ర్థులు పూర్తి వివరాల కోసం ఈ వెబ్‌సైట్: https://apeasternpower.com/

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+