Loksabhaలో ఉద్యోగాలు: సోషల్ మీడియా విభాగంలో..మంచి జీతం..!!

పార్లమెంటులో ప్రజాప్రతినిధులే కాదు నిరుద్యోగులైన మీరు కూడా అడుగుపెట్టే అవకాశం లభించింది. లోక్‌సభ సెక్రటేరియట్‌లో పలు విభాగాల్లో పనిచేసేందుకు ఉద్యోగ ప్రకటన విడుదలైంది. ఇందులో భాగంగా సోషల్ మీడియా మార్కెటింగ్ (సీనియర్ కన్సల్టెంట్), సోషల్ మీడియా మార్కెటింగ్ (సీనియర్ కన్సల్టెంట్), సీనియర్ కంటెంట్ రైటర్ (హిందీ), జూనియర్ కంటెంట్ రైటర్ (హిందీ), సోషల్ మీడియా మార్కెటింగ్ (జూనియర్ అసోసియేట్), మేనేజర్ (ఈవెంట్స్) విభాగాల్లో పోస్టులు భర్తీ చేయనుంది. ఇక వీటి గురించి పూర్తి వివరాలు ఇలా ఉన్నాయి.

లోక్‌సభ సెక్రటేరియట్ విడుదల చేసిన ఉద్యోగ ప్రకటన ప్రకారం మొత్తం 11 ఖాళీలు ఉన్నాయి. అయితే ఈ పోస్టులన్నీ ఒప్పంద ప్రాతిపదికనే ఉంటాయి. ముందుగా ఒక ఏడాది పాటు ఒప్పందం ఉంటుంది. ఆ తర్వాత అభ్యర్థి పని తీరు మెరుగ్గా ఉంటే మరో రెండేళ్లు పాటు పొడిగించడం జరుగుతుందని ఉద్యోగ ప్రకటనలో పేర్కొంది. ఒకవేళ ప్రదర్శన బాగోలేకపోతే ఎలాంటి ముందస్తు నోటీసు ఇవ్వకుండానే అభ్యర్థిని తొలగించే ప్రక్రియను చేపడతారని ఉద్యోగ ప్రకటనలో స్పష్టం చేసింది. అయితే ఈ ఉద్యోగంలో చేరిన అభ్యర్థులు రెగ్యులర్ అపాయింట్‌మెంట్ కిందకు రారని స్పష్టం చేసింది.

Loksabha secretariat had issued job nitification to fill up 11 various posts

పైన పేర్కొన్న పోస్టులకు దరఖాస్తు చేసుకునే అభ్యర్థులు 22 ఏళ్ల నుంచి 58 ఏళ్ల వయసు మధ్య ఉండాలి. ఎస్సీ ఎస్టీ అభ్యర్థులకు ప్రభుత్వం సూచించిన రిజర్వేషన్లు వర్తిస్తాయి. ఇక వేతనం విషయానికొస్తే ఒక్కో పోస్టుకు ఒక్కో రకమైన వేతనం అందజేస్తారు.

సోషల్ మీడియా మార్కెటింగ్ (సీనియర్ కన్సల్టెంట్)- రూ.65000/-
సోషల్ మీడియా మార్కెటింగ్ (సీనియర్ కన్సల్టెంట్)- రూ.35000/-
సీనియర్ కంటెంట్ రైటర్ (హిందీ)- రూ.45000/-
జూనియర్ కంటెంట్ రైటర్ (హిందీ)- రూ.35000/-
సోషల్ మీడియా మార్కెటింగ్ (జూనియర్ అసోసియేట్)- రూ.30000/-
మేనేజర్ (ఈవెంట్స్) - రూ.50000/-

అభ్యర్థుల విద్యార్హతలు ఇతర అర్హతల విషయానికొస్తే సీనియర్ పోస్టులకు గుర్తింపు పొందిన యూనివర్శిటీ నుంచి ఇంజినీరింగ్, బిజినెస్ మేనేజ్‌మెంట్, మార్కెటింగ్, జర్నలిజం, పబ్లిక్ రిలేషన్స్‌లో డిగ్రీతో పాటు డిజిటల్ కమ్యూనికేషన్స్ మరియు సోషల్ మీడియా మేనేజ్‌మెంట్‌లో రెండేళ్ల పని అనుభవం తప్పనిసరి.జూనియర్ పోస్టులకు ఒక ఏడాది పని అనుభవం తప్పనిసరి. ఇక మిగతా విద్యార్హతల కోసం అధికారిక నోటిఫికేషన్‌ను అభ్యర్థులు చూడగలరు.

ఎంపికైన అభ్యర్థుల పనితీరు మెరుగ్గా ఉంటే వారి అనుభవం, వారి అర్హతలు, వారి నైపుణ్యతను, ప్రొఫెషనలిజం అంశాలను పరిగణలోకి తీసుకుని వేతనం పెంచే అవకాశాలున్నాయి. ఇక వార్షిక వేతనం పెంపును లోక్‌సభ సెక్రటేరియట్ నిర్ణయిస్తుంది. ఎంపికైన అభ్యర్థులు లోక్‌సభ సెక్రటేరియట్‌లోని పీపీఆర్‌లో ఉన్న సోషల్ మీడియా మరియు కమ్యూనికేషన్ విభాగంలో రిపోర్ట్ చేయాల్సి ఉంటుంది. ఇక అభ్యర్థులు దరఖాస్తులను ఆఫ్‌లైన్ ద్వారా సబ్మిట్ చేయాల్సి ఉంటుంది. పూర్తి వివరాలతో కూడిన దరఖాస్తులను ఈ కింది చిరునామాకు పంపాల్సి ఉంటుంది.
Administration Branch-I,
Room No. 619,
Lok Sabha Secretariat,
Parliament House Annexe,
New Delhi - 110001.

ఇక పూర్తి చేసిన దరఖాస్తులు పోస్టు ద్వారా చేరేందుకు చివరి తేదీ 11 అక్టోబర్ 2021. మరిన్ని వివరాలకు అధికారిక వెబ్‌సైట్‌ను సందర్శించండి: www.loksabha.nic.in

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+