భారత్ లో ఐటీకి కష్టకాలం ! 64 వేల ఉద్యోగాల్లో కోత పెట్టిన మూడు దిగ్గజాలు..!

భారత్ లో టెక్నాలజీ రంగంలో గ్రాడ్యుయేషన్, పోస్ట్ గ్రాడ్యుయేషన్ పూర్తి చేసుకుంటున్న యువతకు ఐటీ సంస్ధలు బ్యాడ్ న్యూస్ చెప్పాయి. అంతర్జాతీయంగా నెలకొంటున్న పరిణామాల నేపథ్యంలో దేశంలోని మూడు ప్రముఖ ఐటీ దిగ్గజ సంస్ధలు తమ ఉద్యోగాల్లో భారీగా కోత పెట్టాయి. దీంతో కరోనా తర్వాత తిరిగి ఐటీ ఉద్యోగాల కోసం ఎదురుచూస్తుున్న యువతకు ఇదో షాక్ గా మారుతోంది. ఇప్పటికే ఆయా సంస్ధల్లో పనిచేస్తున్న మిగతా వారు కూడా బిక్కుబిక్కుమంటూ కాలం వెళ్లదీస్తున్నారు.

తాజాగా ముగిసిన గత ఆర్ధిక సంవత్సరంలో దేశంలో మూడు ప్రముఖ ఐటీ సంస్ధలు టీసీఎస్, ఇన్ఫోసిస్, విప్రో ముగ్గురూ కలిపి ఏకంగా 64 వేల ఉద్యోగాల్లో కోత పెట్టేశాయి. దీంతో ఆయా కంపెనీల్లో పనిచేస్తూ ఉద్యోగాలు కోల్పోయిన వారంతా లబోదిబోమంటున్నారు. దీంతోనే ఇది ఆగిపోలేదు. ఈ ఆర్ధిక సంవత్సరంలోనూ ఆయా కంపెనీలు గుడ్ న్యూస్ చెప్తాయని భావించినా అదేమీ లేదని తేలిపోతోంది.

more trouble for techies as IT giants cutting off workforce by 64 0000

ఇన్పోసిస్ ఆదాయం ఈ ఏడాదిలో 1 నుంచి 3 శాతం తగ్గుతుందని అంచనా వేస్తుండగా.. విప్రో జూన్ కే తమ ఆాదాయంలో 1.5 శాతం క్షీణత ఉంటుందని అంచనా వేసింది. దీంతో ఆయా కంపెనీల్లో ఉద్యోగాల కోసం ఎదురుచూస్తున్న లక్షలాది మంది గ్రాడ్యుయేట్లకు నిరాశ తప్పడం లేదు. దీని వెనుక ఎన్నో కారణాలు ఉన్నాయని విశ్లేషకులు చెప్తున్నారు. ఆయా కంపెనీలు కరోనా సమయంలో భారీగా తీసుకున్న సిబ్బందిలో ఇప్పుడు కోత పెట్టకపోతే లాభదాయకత ఉండదన్నది వీరి అంచనా.

అయితే భారతీయ ఐటీ సంస్ధలతో పోలిస్తే విదేశీ దిగ్గజాలు తమ వ్యాపారాన్ని ఇక్కడ విస్తరించేందుకు చేస్తున్న ప్రయత్నాలు టెకీలకు కాస్త ఊరటనిచ్చేలా ఉన్నాయి. అవి ఏర్పాటు చేయదల్చుకున్న గ్లోబల్ క్యాపబులిటీ సెంటర్లు (జీసీసీలు) అందుబాటులోకి వస్తే ఇక్కడి టెకీలకు కాస్తయినా ఉద్యోగాలు లభించే అవకాశాలు కనిపిస్తున్నాయి.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+