Class 12 Results: NCERT కీలక ప్రతిపాదన-9,10,11 క్లాసుల వెయిటేజ్..!

సీబీఎస్ఈ పరీక్షలు, మూల్యాంకనం, ఫలితాల విషయంలో జాతీయ విద్యావిధానానికి అనుగుణంగా పలు మార్పులు చేస్తున్న జాతీయ విద్యాపరిశోధన, శిక్షణ మండలి (NCERT)ఇప్పుడు క్లాస్ 12 విషయంలో మరో ప్రతిపాదన చేసింది. 12వ తరగతి పరీక్షల మూల్యాంకనం, ఫలితాల ప్రకటనలో కొత్త మోడల్ ను ప్రతిపాదించింది. విద్యాబోర్డుల్లో సమానత్వం తీసుకొచ్చే లక్ష్యంతో ఈ ప్రతిపాదన చేస్తున్నట్లు ఎన్సీఈఆర్టీ చెబుతోంది.

సీబీఎస్ఈ విద్యార్ధులు 9, 10, 11 క్లాసుల్లో తెచ్చుకున్న మార్కులను క్లాస్ 12 ఫలితాల్లో వెయిటేజ్ ఇవ్వాలని ఎన్సీఈఆర్టీ ప్రతిపాదిస్తోంది. తాజా ఫ్రేమ్ వర్క్ లో విద్యా సంవత్సరాన్ని రెండు భాగాలుగా విభజిస్తారు. 12వ తరగతి బోర్డు ఫలితాల్లో 9, 10 , 11 తరగతుల మార్కులను చేర్చాలని ఈ ప్రతిపాదన సిఫార్సు చేసింది. 9వ తరగతి నుంచి 12వ తరగతి వరకూ మార్కుల వెయిటేజీని క్రమంగా సర్దుబాటు చేసుకుంటూ రావాలని సూచించింది.

NCERT proposes new model for evaluation of class 12 board results

దీని ప్రకారం 9వ తరగతిలో 7 శాతం ఫార్మేటివ్, 30 శాతం సమ్మేటివ్ స్కోరు ఉండాలని, క్లాస్ 10లో 50 శాతం ఫార్మేటివ్, మరో 50 శాతం సమ్మేటివ్ స్కోరు ఉండాలని, 11వ తరగతి నుంచి 40 శాతం ఫార్మేటివ్, 60 శాతం సమ్మేటివ్ స్కోర్లు ఉండాలని, 12వ తరగతిలో 30 శాతం ఫార్మేటివ్‌, 70 శాతం సమ్మేటివ్ నిష్పత్తి ఉండాలని సూచిస్తోంది. దీనివల్ల హైస్కూలు ముగింపులో సంచిత మార్కులు 9వ తరగతికి 15 శాతం, 10వ తరగతికి 20 శాతం, 11వ తరగతికి 25శాతం, 12వ తరగతికి 40 శాతం ఉంటాయని ఎన్సీఈర్టీ చెబుతోంది. ఈ నాలుగు తరగతుల్లో విద్యార్ధుల మార్కులకూ ప్రాధాన్యం ఉండనుంది.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+