NEET-PG Exam: నీట్ పీజీ పరీక్ష ఎప్పుడంటే ? 2 గంటల ముందు ప్రశ్నాపత్రం తయారీ..!
దేశవ్యాప్తంగా వైద్య విద్యలో ప్రవేశాల కోసం ఏటా నిర్వహిస్తున్న నీట్ యూజీ పరీక్ష ఈసారి అత్యంత వివాదాస్పదంగా మారింది. ఎన్నడూ లేనంతగా పేపర్ లీక్ వివాదాలు తలెత్తడం, సీబీఐ రంగంలోకి దిగి దర్యాప్తు ప్రారంభించడం, అరెస్టులు చోటు చేసుకోవడంతో ఈ ప్రభావం నీట్ పీజీ పరీక్షపైనా పడింది. దీంతో గత నెల 23న జరగాల్సిన నీట్ పీజీ పరీక్ష కాస్తా వాయిదా పడింది. దీన్ని తిరిగి నిర్వహించేందుకు కేంద్రం సన్నాహాలు చేస్తోంది.
పోస్ట్‌గ్రాడ్యుయేట్ మెడికల్ కోర్సుల్లో ప్రవేశానికి ఏటా నీట్-పీజీ పరీక్ష నిర్వహిస్తున్నారు. ఈసారి నీట్ వివాదాల కారణంగా వాయిదా పడిన నీట్ ను ఈ నెలలో నిర్వహించేందుకు వీలుగా కేంద్రం అడుగులేస్తోంది. ఇందులో భాగంగా ఇవాళ హోం మంత్రిత్వ శాఖ ప్రభుత్వ సైబర్ క్రైమ్ నిరోధక సంస్థ అధికారులతో సమావేశం నిర్వహించింది. అనంతరం ఈ నెలలో పలు జాగ్రత్తలతో పరీక్ష నిర్వహణకు నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది. లీకుల ఆరోపణల నేపథ్యంలో ఈసారి నీట్ పీజీ పరీక్ష ప్రశ్నాపత్రాన్ని పరీక్షకు కేవలం రెండు గంటల ముందు మాత్రమే తయారు చేయాలని కీలక నిర్ణయం తీసుకున్నారు.

ఇప్పటికే నీట్ యూజీ పరీక్షలో లీకుల వ్యవహారంపై వచ్చిన ఫిర్యాదులపై విచారణకు విద్యాశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ కమిటీని నియమించారు. అలాగే నీట్ రీ టెస్ట్ కూడా రద్దయింది. దీన్ని జూలై 25-27 తేదీల్లో నిర్వహించేందుకు కేంద్రం సన్నాహాలు చేస్తోంది. ఇప్పటికే జాతీయ స్థాయి పరీక్ష అయిన నీట్ పై దేశవ్యాప్తంగా నిరసనలు వెల్లువెత్తుుతున్న నేపథ్యంలో కేంద్రం ఈసారి వేసే ప్రతీ అడుగూ జాగ్రత్తగా వేయాల్సిన పరిస్ధితి. ఇందులో ఎక్కడ తేడా వచ్చినా మొత్తం ఉమ్మడి పరీక్షల భవిష్యత్తు అగమ్య గోచరంగా మారబోతోంది.












Click it and Unblock the Notifications