New Labour Codes:ఉద్యోగస్తులకు గుడ్ న్యూస్.. వారంలో మూడు రోజులు సెలవులు..!
ఇక పై ఉద్యోగస్తులకు గుడ్ న్యూస్ చెప్పనుంది కేంద్రం. ఇప్పటి వరకు చాలా కంపెనీల్లో ఐదురోజులు పనిదినాలు ఉండేవి. తాజాగా పనిదినాలను నాలుగు రోజులకు కుదిస్తూ కార్మిక చట్టాల్లో మార్పులు తీసుకొచ్చేందుకు సమాయాత్తమవుతోంది. అయితే ఈ ఆప్షన్ కంపెనీలకే వదిలేస్తోంది. నాలుగు రోజుల పనిదినాలకు కంపెనీ ఓకే అనుకుంటే ఆమేరకు అమలు చేయొచ్చని కేంద్రం తెలిపింది. అయితే ఇక్కడ ఒక చిన్న మెలిక కూడా పెట్టింది. నాలుగు రోజులు పనిదినాలు ఎంపిక చేసే కంపెనీలు తమ ఉద్యోగస్తులకు పనివేళలు పెంచే అవకాశాలున్నాయి.
చాలా కంపెనీలు నాలుగు రోజుల పనిదినాలకు ఆమోదం తెలిపాయని కార్మికశాఖ కార్యదర్శి అపూర్వ చంద్ర చెప్పారు. కొన్ని కంపెనీ యాజమాన్యాలు మాత్రం ఐదు రోజుల పనిదినాలకే మొగ్గు చూపాయని చెప్పారు. అయితే వారంలో 48 గంటల మేరా పనివేళలు ఉండాలని అంతకు మించి ఉండరాదని అపూర్వ చంద్ర తెలిపారు. అయితే ఒక వేళ పనిదినాలను నాలుగురోజులకే పరిమితం చేస్తే ప్రస్తుతం ఉన్న పనివేళలను పొడిగించాల్సి ఉంటుందని చెప్పారు. అలా చేస్తే నాలుగు రోజుల తర్వాత వరుసగా మూడురోజులను సెలవు దినాలుగా ప్రకటించాల్సి ఉంటుందని అపూర్వ చంద్ర చెప్పారు. ఈ క్రమంలోనే నాలుగు రోజులా, ఐదు రోజులా, లేదా ఆరు రోజులా అనేది కంపెనీల ఇష్టం మేరకే ఉంటుందని చెప్పారు.

ఇదిలా ఉంటే నాలుగు రోజులు పాటు పనిదినాలు కుదించి ఆ తర్వాత మూడు రోజులు సెలవు దినాలుగా ప్రకటించకుంటే యూనియన్లు వ్యతిరేకిస్తాయని అపూర్వ చంద్ర తెలిపారు. సెప్టెంబర్ 2020లో నాలుగు లేబర్ కోడ్‌లను పార్లమెంటు పాస్ చేసింది. ఆ తర్వాత ముసాయిదా నిబంధనలను డిసెంబర్‌లో రూపకల్పన చేసింది. అయితే దీనిపై అభ్యంతరాలను జనవరిలో కేంద్రానికి అందాయి. ఇక కేంద్ర కార్మిక మంత్రిత్వ శాఖ కార్మిక చట్టాలకు తుది మెరుగులు అద్దుతోందని చెప్పారు. అదే సమయంలో ఆయా రాష్ట్ర ప్రభుత్వాలు కూడా తమ నిబంధనలతో ముందుకొస్తున్నాయని గుర్తు చేశారు. ఈ కొత్త చట్టాలతో భారత్‌లో ఉద్యోగాలు పెరగడమే కాకుండా పెద్ద ఎత్తున పెట్టుబడులు వస్తాయని ప్రభుత్వం భావిస్తున్నప్పటికీ... ఈ చట్టాల వల్ల ఉద్యోగస్తులకు మేలు జరుగుతుందని పలువురు నిపుణులు అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు.
కొత్తగా లేబర్ చట్టాలు అమల్లోకి వస్తే ఉద్యోగస్తుల నియామకంతో పాటు వారిని తొలగించే ప్రక్రియ కూడా సులభతరంగా మారనుంది.అంతేకాదు యూనియన్లు ఒకవేళ స్ట్రైక్‌కు దిగాలంటే 60 రోజుల ముందస్తు నోటీసులు ఇవ్వాల్సి ఉంటుంది. దీంతో ఉద్యోగస్తులు లేదా కార్మికుల భవిష్యత్తుపై నీలినీడలు అలుముకునే అవకాశాలున్నాయని మరికొందరు నిపుణులు అభిప్రాయపడుతున్నారు.
-
ఏప్రిల్ 14న మేషరాశిలోకి సూర్యుడు.. వీరి పంట పండుతుంది! -
ఉచిత విద్యుత్, రూ. 25,000 ప్రసూతి సాయం: ఎక్కడ కొట్టాలో అక్కడ కొట్టిన విజయ్ -
today rashiphalalu: నేడు అద్భుత రాజయోగంతో పండుగ చేసుకునే రాశులు ఇవే -
భారత్ కు పాక్ వార్నింగ్: ఇళ్లల్లోకి చొరబడి చంపుతాం.. -
పదో తరగతి పరీక్షల్లో పొరపాట్లు, ఆ రెండు సబ్జెక్టుల్లో మార్కుల యాడింగ్..ఇలా..!! -
కేంద్రం బ్రహ్మాస్త్రం: రూ. 2.5 లక్షల కోట్ల భారీ పథకం -
అల్లు అర్జున్-అట్లీ మూవీ టైటిల్ లీక్?.. నెట్టింట రచ్చ! -
చుక్కలు చూపుతున్న పసిడి రేట్లు -
ఎవరైనా ఇలా చేస్తే అమరావతి చట్టబద్ధత రద్దవుతుంది: బాంబు పేల్చిన సాయిరెడ్డి -
ఇరాన్ కు సపోర్ట్ చేస్తావా..? పాకిస్థాన్ ను కోలుకోలేని దెబ్బ కొట్టిన యూఏఈ.. -
తిరుమల, అలిపిరిల్లో చిరుతలను గుర్తించడానికి టీటీడీ కొత్త టెక్నాలజీ -
No Stock: ధర చూస్తే గుండె గుభేల్! డ్రైవర్ల కన్నీటి గాథ!












Click it and Unblock the Notifications