హిందూపురం ఎమ్మెల్యే , నందమూరి నటసింహం బాలకృష్ణ కాలికి గాయాలు!
టాలీవుడ్ లోని నటరత్న, నటసింహం, హిందూపురం ఎమ్మెల్యే నందమూరి బాలకృష్ణ షూటింగ్ సెట్ లో గాయపడ్డారు. గోపీచంద్ మలినేని దర్శకత్వంలో రూపొందుతున్న NBK 111 చిత్రం షూటింగ్ కాకినాడ పోర్ట్ లొకేషన్ లో జరుగుతోంది. ఈ సినిమాలో హై యాక్షన్ సీక్వెన్స్ లో భాగంగా బాలకృష్ణ, మంచు మనోజ్ మధ్య ఫైట్ సీన్స్ చిత్రీకరిస్తుండగా బాలకృష్ణ మోకాలికి గాయం అయ్యింది.
బాలకృష్ణకు సినిమా షూటింగ్ సెట్ లో గాయం
వెంటనే సెట్ లోని సిబ్బంది అప్రమత్తమై ఆయనను సమీప ఆస్పత్రికి తరలించారు. వైద్యులు పరీక్షలు నిర్వహించి, కొన్ని రోజులపాటు విశ్రాంతి సూచించారు. అయితే గాయం తీవ్రంగా లేదని, బాలకృష్ణ ఆరోగ్యం స్థిరంగా ఉందని చెప్పారు. బాలకృష్ణకు సినిమా షూటింగ్ సెట్ లో గాయం అయ్యిందన్న వార్త బాలకృష్ణ అభిమానులలో తీవ్ర ఆందోళనకు కారణం అయ్యింది. బాలకృష్ణ కోసం అభిమానులు సోషల్ మీడియా వేదికగా ఆయన త్వరగా కోలుకోవాలని పోస్టులు పెడుతున్నారు.

సినిమా ఏదైనా సరే బాలకృష్ణ నిబద్దత
ప్రస్తుతం బాలకృష్ణ వయసు 66 సంవత్సరాలు. అయినా బాలకృష్ణ తాను పని చేసే సినిమాలలో వయస్సుతో నిమిత్తం లేకుండా పూర్తి నిబద్ధతతో పని చేస్తారు. ఈ క్రమంలోనే బాలకృష్ణ హై యాక్షన్ సీక్వెన్స్ లో నటిస్తున్న క్రమంలో ఫైట్ సీన్ లో మోకాలికి గాయం అయ్యింది. గతంలో కూడా బాలకృష్ణ సినిమాలలో నటించిన సమయంలో ఇలాగే గాయాలైనా, ఆయన గాయాల నుండి కోలుకుని మళ్ళీ షూటింగ్ కొనసాగించిన సందర్భాలు ఉన్నాయి.
బాలయ్యకు ఉన్న కమిట్మెంట్ పై చర్చ
యాక్టర్ గా బాలకృష్ణ కు ఉన్న కమిట్మెంట్ ఆయన ప్రతీ సినిమాలోనూ, ఆయన ప్రతీ ఎఫర్ట్ లోనూ కనిపిస్తుంది. ఇదిలా ఉంటే మాస్ డైరెక్టర్ గోపీ చంద్ మలినేని దర్శకత్వంలో ఈ సినిమా తెరకెక్కుతుంది. ఇది ముంబై మాఫియా బ్యాక్ డ్రాప్ తో గ్యాంగ్ స్టర్ డ్రామాగా రూపొందుతుంది. వృద్ధి సినిమా బ్యానర్ పై వెంకట్ సతీష్ కిలారు ఈ సినిమాను నిర్మాణం చేస్తున్నారు. ఎస్. ఎస్ తమన్ సంగీతం అందిస్తున్నారు. బాలకృష్ణ సరసన కాజల్ అగర్వాల్ నటిస్తుండగా, మంచు మనోజ్ కీలక పాత్రలో కనిపించనున్నారు.












Click it and Unblock the Notifications