Kadambari Jethwani: జెత్వానీ బాధితురాలా ? నిందితురాలా ? వాస్తవం ఇదే..!
ఏపీలో గత వైసీపీ ప్రభుత్వ హయాంలో ముంబై నుంచి వచ్చిన టాలీవుడ్ హీరోయిన్ కాదంబరీ జెత్వానీ (Kadambari Jethwani)ని కుక్కల విద్యాసాగర్ అనే అధికార పార్టీ నేత పోలీసుల సాయంతో వేధింపులకు గురి చేయడంతో, ఆమె బాధితురాలు కాబట్టి ఈ కేసును పూర్తిగా మార్చి సీఐడీ ఏడాదిన్నర క్రితం విచారణ ప్రారంభించింది. అయితే తాజాగా ఇదే కూటమి సర్కార్ ఆధ్వర్యంలో పనిచేస్తున్న సీఐడీ.. ఆమెను నిందితురాలిగా చూపిస్తూ తాజాగా కోర్టులో ఛార్జిషీట్ దాఖలు చేయడంతో భారీ ట్విస్ట్ చోటు చేసుకుంది. అయితే బాధితురాలు కాస్తా నిందితురాలు ఎలా అయిందన్న దానిపై ప్రభుత్వ వర్గాలు క్లారిటీ ఇస్తున్నాయి.
కాదంబరి జెత్వానీ ఎపిసోడ్ లో మొత్తం రెండు కేసులు నమోదు అయినట్లు ప్రభుత్వం చెబుతోంది. ఇందులో ఓ కేసులో జెత్వానీ-కుక్కల విద్యాసాగర్ మధ్య సంబంధం ఉందనే ఆరోపణలు, వారి మధ్య జరిగిన ఆర్థిక లావాదేవీలు, కాదంబరి జెత్వానీ బ్లాక్‌మెయిల్ చేసిందనే ఆరోపణలతో కూడినది. రెండవది నకిలీ పత్రాలతో విద్యాసాగర్ అనుచరులతో జెత్వానీ భూ ఒప్పందం చేసుకున్నట్లు సీఎంఓ ఆదేశాలతో కథ అల్లి, ఆమెను, ఆమె కుటుంబ సభ్యులను అక్రమంగా నిర్బంధించారనేది. ఇందులో రెండో కేసులో డీజీ ర్యాంక్ అధికారి పీఎస్సార్ ఆంజనేయులు, ఐజీ స్థాయి అధికారి కాంతిరాణా టాటా, ఎస్పీగా ఉన్న విశాల్ గున్నిని నిందితులుగా చేర్చి సస్పెండ్ చేశారు. ఈ కేసులో జెత్వానీ బాధితురాలు.

మొదటి కేసులో తెర వెనుక వ్యవహరాలను దాచిపెట్టేందుకు నాటి సీఎంఓ ఆదేశాలతో పోలీసు ఉన్నతాధికారులు ఓ కథ అల్లారని సీఐడీ వర్గాలు చెప్తున్నాయి. ఈ కేసులో జెత్వానీతోపాటు ఆమె కుటుంబ సభ్యులను అరెస్ట్ చేశారు. ఓ గెస్ట్ హౌసులో ఓ ప్రైవేట్ హోటల్లో కొన్ని రోజులు అక్రమంగా నిర్బంధించారు. అలాగే జెత్వానీని నానా రకాలుగా వేధించారు. నాడు పోలీసుల అత్యుత్సాహం, విపరీతమైన స్వామి భక్తి వల్ల మొదటి కేసులో నిందితురాలిగా ఉన్న జెత్వానీ రెండో కేసులో బాధితురాలిగా మారిందనేది కూటమి సర్కార్ వాదన.

ఇప్పుడు కూటమి ప్రభుత్వం ఈ రెండు కేసులను వేర్వేరుగానే చూస్తోంది. చట్టప్రకారం, నిబంధనల ప్రకారం ఈ రెండు కేసుల్లో చర్యలు చేపడుతోంది. ఓ కేసులో జెత్వానీది తప్పని తేలితే అదే ఛార్జ్ షీటును పోలీసులు ఫైల్ చేశారు. అలాగే మరో కేసులో పోలీస్ ఉన్నతాధికారుల పాత్ర నిర్థారణ అయింది. దానికి అనుగుణంగా చర్యలు తీసుకున్నారు. ప్రస్తుతం జెత్వానీ నిందితురాలిగా ఉన్న మొదటి కేసులోని ఛార్జ్ షీట్లోని అంశాల ఆధారంగా రెండు కేసులను కలిపేసి కొందరు ప్రజలను తప్పుదోవ పట్టిస్తున్నారంటూ ప్రభుత్వం వివరణ ఇచ్చింది.












Click it and Unblock the Notifications