Job News:కేంద్ర ప్రభుత్వ రంగ సంస్థలో పరీక్ష లేకుండానే ఉద్యోగాలు..!!
ప్రభుత్వరంగ సంస్థ నేవేలి లిగ్నైట్ కార్పొరేషన్ (NLC)ఇండియా లిమిటెడ్‌లో పలు పోస్టుల భర్తీకి దరఖాస్తులు ఆహ్వానిస్తోంది.ఇందులో భాగంగా గ్రాడ్యుయేట్ & టెక్నీషియన్ అప్రెంటిస్ పోస్టులను భర్తీ చేయనుంది. .ఆసక్తిగల అర్హులైన అభ్యర్థులు పూర్తి నోటిఫికేషన్ చదివి దరఖాస్తులను ఆఫ్‌లైన్ లేదా ఆన్‌లైన్ ద్వారా పూర్తి చేసి పంపాల్సి ఉంటుంది.
మొత్తం 588 పోస్టులను భర్తీ చేసేందుకు నేవేలి లిగ్నైట్ కార్పొరేషన్ ఇండియా లిమిటెడ్ నోటిఫికేషన్ విడుదల చేసింది.ఇక అర్హత విషయానికొస్తే గ్రాడ్యుయేట్ అప్రెంటిస్ పోస్టులకు దరఖాస్తు చేసుకునే అభ్యర్థులు బీఎస్సీ నర్సింగ్, ఇంజినీరింగ్ డిగ్రీ పూర్తి చేసి ఉండాలి. టెక్నీషియన్ పోస్టుకు దరఖాస్తు చేసుకునే అభ్యర్థులు ఇంజినీరింగ్‌లో డిప్లొమా, నర్సింగ్‌లో డిప్లొమా పూర్తి చేసి ఉండాలి.

భర్తీ చేయనున్న పోస్టుల వివరాలు ఇలా ఉన్నాయి:
ముందుగా గ్రాడ్యుయేట్ అప్రెంటిస్ విభాగంలో మెకానికల్ ఇంజినీరింగ్- 84, ఎలక్ట్రికల్ ఇంజినీరింగ్ -81,సివిల్ ఇంజినీరింగ్-26, ఇన్స్‌ట్రుమెంటేషన్ ఇంజినీరింగ్-12,కెమికల్ ఇంజినీరింగ్ - 10, మైనింగ్ ఇంజినీరింగ్ - 49, కంప్యూటర్ సైన్స్ ఇంజినీరింగ్-45, ఎలక్ట్రానిక్స్ & కమ్యూనికేషన్ ఇంజినీరింగ్-04, నర్సింగ్ -25 పోస్టులును భర్తీ చేయనుంది.
టెక్నీషియన్ అప్రెంటిస్ విభాగంలో పోస్టుల వివరాలు:
మెకానికల్ ఇంజినీరింగ్-77, ఎలక్ట్రికల్ ఇంజినీరింగ్ -73,సివిల్ ఇంజినీరింగ్-19, ఇన్స్‌ట్రుమెంటేషన్ ఇంజినీరింగ్-07,మైనింగ్ ఇంజినీరింగ్ -30, కంప్యూటర్ సైన్స్ ఇంజినీరింగ్-18, ఎలక్ట్రానిక్స్ & కమ్యూనికేషన్ ఇంజినీరింగ్-08, నర్సింగ్ -20 పోస్టులును భర్తీ చేయనుంది.
వేతన వివరాలు:
గ్రాడ్యుయేట్ ఇంజినీరింగ్ అప్రెంటిస్ ట్రైనీకి నెలకు రూ.15028/- స్టైపెండ్ చెల్లిస్తారు.బీఎస్సీ నర్సింగ్ వారికి నెలకు రూ.12524/- స్టైపెండ్ చెల్లిస్తారు. ఇందులో రూ.4500/- ప్రభుత్వం డీబీటీ పథకం కింద చెల్లిస్తుంది. టెక్నీషియన్ అప్రెంటిస్ ట్రైనీకి నెలకు రూ.12524 స్టైపెండ్ చెల్లిస్తారు. ఇందులో రూ.4000/-ప్రభుత్వం డీబీటీ పథకం కింద చెల్లిస్తుంది.
అప్లయ్ చేసుకునే అభ్యర్థులు తమిళనాడు, ఆంధ్రప్రదేశ్, తెలంగాణ,కర్నాటక, కేరళ, పుదుచ్చేరి, లక్షద్వీప్ రాష్ట్రాలకు చెందిన వారై ఉండాలి. ఇక సంస్థ ప్రకటించిన విద్యార్హతల ప్రకారం ఎంపిక ఉంటుంది. క్వాలిఫైయింగ్ పరీక్షలో అభ్యర్థికి వచ్చిన మార్కులు ఆధారంగా ఎంపిక జరుగుతుంది.
ముఖ్య తేదీలు:
ఆన్‌లైన్ ద్వారా రిజిస్ట్రేషన్ ప్రారంభం: 9 డిసెంబర్ 2024
ఆన్‌లైన్ అప్లికేషన్లకు చివరి తేదీ: 23 డిసెంబర్ 2024
దరఖాస్తు ప్రింట్ తీసుకుని సంస్థకు చేరాల్సిన చివరి తేదీ: 03-01-2025
సర్టిఫికేషన్ వెరిఫికేషన్ తేదీ: 20 జనవరి 2025 - 24 జనవరి 2025
సెలెక్ట్ అయిన అభ్యర్థుల జాబితా విడుదల: 31-01-2025
అభ్యర్థులు జాయినింగ్ తేదీ: 10 ఫిబ్రవరి 2025 లేదా 12 ఫిబ్రవరి 2025.
ఇక పూర్తి వివరాల కోసం www.nlcindia.in వెబ్‌సైట్‌ను సందర్శించండి.












Click it and Unblock the Notifications