తండ్రిపై లైంగిక ఆరోపణలు.. ఒక్క కామెంట్.. 22 కేసులు! సుప్రీంకోర్టు వరకు వెళ్లిన స్టార్ హీరోయిన్!
దక్షిణాది చలన చిత్ర పరిశ్రమలో ఒకప్పుడు తన అందంతో కుర్రకారును ఉర్రూతలూగించిన ముద్దుగుమ్మ.. తెలుగు తమిళం, కన్నడ, హిందీ, మలయాళం భాషల్లో అనేక సూపర్ హిట్ చిత్రాల్లో మెప్పించింది. ఒకప్పుడు ఆ హీరోయిన్ క్రేజ్ ఎలాంటిదంటే.. అభిమానులు ఆమె కోసం గుడి కట్టి పూజించారు. ఇప్పటికీ ఆమె సినిమాల్లో అభిమానులను అలరిస్తూనే ఉంది. అలాగే ఆమె రాజకీయాల్లో చురుగ్గా ఉండడంతో పాటు ఆమె ఇటీవల చేసిన కొన్ని కామెంట్స్ తీవ్ర వివాదానికి దారితీశాయి. దీంతో ఆ నటిపై దాదాపు 22 కేసులు నమోదయ్యాయి. ఇంతకీ ఆ స్టార్ హీరోయిన్ ఎవరో తెలుసా?
ఆ స్టార్ హీరోయిన్ మరెవరో కాదు.. ఒకప్పుడు దక్షిణాదిని ఊపేసి.. ఇప్పుడు రాజకీయాల్లోనూ, సినిమాల్లోనూ ఎంతో బిజీగా ఉన్న సీనియర్ నటి ఖుష్బూ సుందర్. ఒకప్పుడు స్టార్ హీరోయిన్‌గా వెలిగిన ఖుష్బూ జీవితంలో ఎన్నో సంచలనాలు, మరెన్నో చీకటి కోణాలు ఉన్నాయి. 8 ఏళ్ల వయస్సులోనే కన్న తండ్రి చేతిలోనే లైంగిక వేధింపులకు గురయ్యానని ఖుష్బూ సుందర్ గతంలో చేసిన కామెంట్స్ ఇండస్ట్రీని ఆశ్చర్యానికి గురిచేశాయి. అయితే గతంలో ఓ ఇంటర్వ్యూలో ఖుష్బూ సుందర్ మాట్లాడుతూ.. తనకు కేవలం 8 ఏళ్ల వయస్సులోనే తన తండ్రి తనను లైంగికంగా వేధించాడని వెల్లడించింది. ఈ విషయం చాలా కాలంగా వేధిస్తోందని.. కోరుకున్నా కూడా దానిని మర్చిపోలేనని ఖుష్బూ సుందర్ చేసిన కామెంట్స్ సినిమా ఇండస్ట్రీలో సంచలనంగా మారాయి.

అయితే ఆమె 2005లో ఓ ఇంటర్వ్యూలో మాట్లాడుతూ.. సురక్షితమైన పద్ధతులు పాటిస్తే పెళ్లికి ముందు శారీరక సంబంధాలు పెట్టుకోవడంలో తప్పులేదని చేసిన కామెంట్స్ తమిళనాడులో తీవ్ర సంచలనం సృష్టించాయి. అనేక చోట్ల ఖుష్బూకు వ్యతిరేకంగా నిరసనలు జరిగాయి. అంతే కాకుండా ఈ వ్యాఖ్యలపై ఆగ్రహం వ్యక్తం చేస్తూ ఖుష్బూపై దేశవ్యాప్తంగా 22 క్రిమినల్ కేసులు నమోదయ్యాయి. ఈ వివాదం సుప్రీంకోర్టు వరకు వెళ్లగా.. భావప్రకటనా స్వేచ్ఛను గౌరవిస్తూ ఖుష్బూ సుందర్ పై దాఖలైన మొత్తం 22 కేసులను పూర్తిగా కొట్టివేసింది. దీంతో ఆమెకు పెద్ద ఊరట లభించింది.
ఖుష్బూ సుందర్ కెరీర్
ఖుష్బూ అసలు పేరు నఖత్ ఖాన్. 1970 సెప్టెంబర్ 29న ముంబైలో జన్మించిన ఆమె చిన్నతనం నుంచే నటనపై ఆసక్తి పెంచుకున్నారు. బాలనటిగా బాలీవుడ్‌లో కెరీర్ ప్రారంభించిన ఖుష్బూ.. 1980లో విడుదలైన ది బర్నింగ్ ట్రైన్ చిత్రంతో వెండితెరపై అడుగుపెట్టారు. అనంతరం పలు హిందీ చిత్రాల్లో బాలనటిగా కనిపించి ప్రేక్షకుల ప్రశంసలు అందుకున్నారు. ఆ తర్వాత దక్షిణాది చిత్ర పరిశ్రమలోకి అడుగుపెట్టి తక్కువ కాలంలోనే స్టార్ హీరోయిన్‌గా ఎదిగారు.
తమిళ సినీ పరిశ్రమలో రజనీకాంత్, కమల్ హాసన్, శరత్‌కుమార్, సత్యరాజ్, ప్రభు, కార్తీక్, విజయకాంత్ వంటి స్టార్ హీరోల సరసన ఆమె నటించి భారీ విజయాలను అందుకున్నారు. ముఖ్యంగా 1990లలో తమిళ సినీ పరిశ్రమలో అత్యధిక పారితోషికం తీసుకున్న హీరోయిన్లలో ఖుష్బూ ఒకరిగా నిలిచారు. అలానే తెలుగులో కూడా వెంకటేష్, నాగార్జున, బాలకృష్ణ, చిరంజీవి, మోహన్‌బాబు, వంటి అగ్రహీరోలతో కలిసి ఆమె అనేక విజయవంతమైన చిత్రాల్లో నటించారు. కుటుంబ కథా చిత్రాల్లోనూ, కమర్షియల్ సినిమాల్లోనూ సమానంగా మెప్పించి తనకంటూ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్నారు.












Click it and Unblock the Notifications