టీఎస్‌పీఎస్సీ ఎఫెక్ట్: తెలంగాణ ఎస్సై, కానిస్టేబుల్ రాత పరీక్షల తేదీల్లో మార్పులు

హైదరాబాద్: తెలంగాణలో పోలీసు ఉద్యోగార్థులకు కీలక గమనిక. రాష్ట్రస్థాయి పోలీస్ నియామక మండలి(టీఎస్ఎల్ఆర్బీ) నిర్వహించనున్న ఎస్సై, కానిస్టేబుళ్ల స్థాయి తుది రాత పరీక్షల(మెయిన్స్) తేదీల్లో మార్పులు చోటు చేసుకున్నాయి. ఎస్సై(ఐటీ), ఏఎస్సై(ఫింగర్ ప్రింట్స్), కానిస్టేబుల్, కానిస్టేబుల్(ఐటీ) పరీక్షల తేదీల్లో మార్పులు జరిగినట్లు పేర్కొంది.

ఈ పరీక్షల సమయంలో ఇతర పరీక్షలు ఉన్నాయని టీఎస్ పీఎస్సీ చేసిన విజ్ఞప్తి మేరకు తేదీల్లో మార్పులు చేసినట్లు వెల్లడించింది. ఏప్రిల్ 23వ తేదీన జరగాల్సిన కానిస్టేబుల్ రాత పరీక్షను 30వ తేదీకి, కానిస్టేబుల్(ఐటీ విభాగం) పరీక్ష ఏప్రిల్ 23వ తేదీ నుంచి 30వ తేదీకి, ఎస్సై(ఐటీ) పరీక్ష మార్చి 12వ తేదీ నుంచి 11వ తేదీకి, ఏఎస్సై(ఫింగర్ ప్రింట్స్) పరీక్ష మార్చి 12వ తేదీ నుంచి 11వ తేదీకి మార్పు చేసినట్లు టీఎస్ఎల్ఆర్బీ వెల్లడించింది.

police final written exam dates changed in telangana

ఎస్సై, కానిస్టేబుల్ పోస్టుల భర్తీకి గత ఆగస్టు 7న ప్రాథమిక పరీక్ష నిర్వహించగా.. మొత్తం 6,61,198 మంది దరఖాస్తుదారులకుగానూ 6,03,955(91.34శాతం) మంది హాజరయ్యారు. ప్రాథమిక ఫలితాలను కూడా విడుదల చేసింది. సివిల్ ఎస్సై, సివిల్ కానిస్టేబుల్ , ఎక్సైజ్ కానిస్టేబుల్ ప్రాథమిక పరీక్షలు జరగ్గా, వాటి ఫలితాలు కూడా వచ్చాయి. ఈ నేపథ్యంలో తుది పరీక్షలు జరగాల్సి ఉంది. అయితే, టీఎస్ పీఎస్సీ పరీక్షల కారణంగా తొలుత ప్రకటించిన తుది పరీక్షల తేదీల మార్పు చేశారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+