ఎగ్జామ్ లేకుండానే SBIలో ఉద్యోగాలు- జీతం రూ.65,000.. ఇప్పుడే అప్లై చేసుకోండి
నిరుద్యోగులకు గుడ్ న్యూస్. దేశంలోనే అతిపెద్ద ప్రభుత్వ రంగ సంస్థ అయిన SBI నుంచి నోటిఫికేషన్ విడుదలైంది. ఎస్ బీఐ నుంచి 30 ఈఆర్ఎస్ రివ్యూవర్ ఉద్యోగాల భర్తీ కోసం నోటిఫికేషన్ రిలీజ్ చేసింది. దరఖాస్తు ప్రక్రియ ఇప్పటికే ప్రారంభం అయింది. ఏప్రిల్ 22లోపు ఎస్ బీఐ ఈఆర్ఎస్ రివ్యూవర్ ఉద్యోగాల కోసం దరఖాస్తు చేసుకోవచ్చని నోటిఫికేషన్ లో పేర్కొంది. దరఖాస్తు ప్రక్రియకు సంబంధించిన పూర్తి వివరాలు ఇక్కడ తెలుసుకోండి.
ఎస్ బీఐ నుంచి తాజాగా నోటిఫికేషన్ విడుదలైంది. 30 ఈఆర్ఎస్ రివ్యూవర్ ఉద్యోగాల భర్తీ కోసం నోటిఫికేషన్ రిలీజ్ చేసింది. మొత్తం ఖాళీలు 30 కాగా.. ఎస్సీ 4 పోస్టులు, ఎస్టీ 2 పోస్టులు,ఓబీసీ 7 పోస్టులు,ఈడబ్యూఎస్ 3 పోస్టులు, యూఆర్ 14 పోస్టులు ఉన్నాయి.
ఎంపిక విధానం: అర్హత, అనుభవం ఆధారంగా అభ్యర్థులను ఎస్ బీఐ సెలక్షన్ కమిటీ ఎంపిక చేస్తుంది.
అర్హత: ఈఆర్ఎస్ రివ్యూవర్ పోస్టులకు అప్లై చేయాలనుకుంటున్న అభ్యర్థులు అధికారిక నోటిఫికేషన్ లో ఇచ్చిన సంబంధిత విద్యార్హత, వయోపరిమితి కలిగి ఉండాలి. జీతం రూ.65,000గా ఉంది.
ఇంటర్వ్యూ నిర్వహించి అభ్యర్థులకు ఎంపిక చేస్తారు. 100 మార్కులకు ఇంటర్వ్యూ ఉంటుంది. ఇంటర్వ్యూలో వచ్చిన మార్కుల ఆధారంగా తుది మెరిట్ జాబితాను రూపొందిస్తారు. ఇద్దరు అభ్యర్థులకు ఒకే మార్కులు వస్తే ఎవరికి ఎక్కువ వయసు ఉంటే వారికి ఉద్యోగం లభిస్తుంది.

అప్లై విధానం ఇలా..
ఎస్ బీఐ అధికారిక వెబ్ సైట్ sbi.co.in కు వెళ్లాలి. CRPD/RS/2025-26/01 అనే నంబర్ ఉన్న ప్రకటనపై క్లిక్ చేయండి. చెల్లుబాటు అయ్యే ఈ-మెయిల్ ఐడీ, మొబైల్ నంబర్ ను ఎంటర్ చేయాలి. ఆ తర్వాత అవసరమైన పత్రాలను అప్ లోడ్ చేయాలి. లేటెస్ట్ పాస్ పోర్ట్ సైజు ఫొటో, సంతకాన్ని అప్లోడ్ చేయాలి. బయోడేటా, గుర్తింపు కార్డు, పెన్షనర్ ఐడీని అప్లోడ్ చేయాలి. వివరాలను నిర్థారించిన తర్వాత ఫారమ్ ను సమర్పించాలి.












Click it and Unblock the Notifications