SBI 'యూత్ ఫర్ ఇండియా' ఫెలోషిప్ .. గ్రామీణ యువతకు సువర్ణావకాశం!

భారతదేశపు అతిపెద్ద ప్రభుత్వ రంగ బ్యాంకు అయిన స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (SBI) యువతకు అద్భుతమైన అవకాశాన్ని అందిస్తోంది. 2025-26 సంవత్సరానికి గాను 'యూత్ ఫర్ ఇండియా' ఫెలోషిప్ ప్రోగ్రామ్ కింద ఇంటర్న్‌షిప్ అవకాశాలను ప్రకటిచింది. ఈ ఫెలోషిప్ గ్రామీణ భారతదేశంలో సామాజిక మార్పును తీసుకురావడానికి ఉద్దేశించబడింది. ఎంపికైన యువకులు దేశవ్యాప్తంగా అభివృద్ధి ప్రాజెక్టులలో పనిచేసే అవకాశం పొందడంతో పాటు, గ్రామీణ ప్రాంతాల సంక్షేమానికి తమవంతు సహకారం అందిస్తారు. ఈ ఇంటర్న్‌షిప్ ప్రముఖ NGOలతో కలిసి నిర్వహించబడుతుందని అధికారిక ప్రకటనలో SBI స్పష్టం చేసింది.

"ఈ ఫెలోషిప్ గ్రామీణ భారతదేశంలోని సవాళ్ల నుండి నేర్చుకోవడం ద్వారా యువ నాయకులను తీర్చిదిద్దుతుంది. ఈ ఫెలోషిప్2ను పూర్తి చేసిన వారు NGO భాగస్వాములు, స్థానిక ప్రభుత్వం, సమాజంతో కలిసి పనిచేసి, క్షేత్రస్థాయిలో స్థిరమైన కార్యక్రమాలను అభివృద్ధి చేస్తారు," అని అధికారిక ప్రకటన పేర్కొంది.

SBI Youth for India Fellowship 2025 Apply Now for a Life-Changing Opportunity

SBI ఇంటర్న్‌షిప్ 2025కు ఎలా దరఖాస్తు చేయాలి?
SBI యూత్ ఫర్ ఇండియా ఫెలోషిప్ 2025కు దరఖాస్తు చేసుకోవడానికి యూత్ ఫర్ ఇండియా అధికారిక వెబ్‌సైట్ youthforindia.org ను సందర్శించండి. అప్లికేషన్ ఫారమ్‌ను పూర్తిగా చేయాలి. పూర్తి చేసిన అప్లికేషన్ ఫారమ్‌ను సమర్పించండి. అవసరమైన రుసుము చెల్లించి, సంబంధిత పత్రాలను అప్‌లోడ్ చేయండి. భవిష్యత్ సూచన కోసం అప్లికేషన్ కాపీని డౌన్‌లోడ్ చేసుకోండి లేదా సేవ్ చేసుకోండి. దరఖాస్తు చేసుకోవడానికి ప్రత్యక్ష లింక్ కోసం అధికారిక వెబ్‌సైట్‌ను సందర్శించండి.

SBI ఇంటర్న్‌షిప్ 2025: అర్హత ప్రమాణాలు
ఈ ఫెలోషిప్‌కు దరఖాస్తు చేసుకోవడానికి అభ్యర్థులు తప్పనిసరిగా ఈ అర్హతలు కలిగి ఉండాలి. అక్టోబర్ 1, 2025 నాటికి ఏదైనా గుర్తింపు పొందిన విశ్వవిద్యాలయం నుండి గ్రాడ్యుయేట్ డిగ్రీ పూర్తి చేసి ఉండాలి. అభ్యర్థుల వయస్సు 21 నుండి 32 సంవత్సరాల మధ్య ఉండాలి. అభ్యర్థులు భారతీయ పౌరులు లేదా ఓవర్సీస్ సిటిజన్స్ ఆఫ్ ఇండియా (OCI) లేదా నేపాల్/భూటాన్ పౌరులై ఉండాలి. ఇంటర్న్‌షిప్ వ్యవధి 13 నెలలు ఉంటుంది. ఎంపికైన వారికి నెలకు రూ. 16,000 స్టైపెండ్‌తో పాటు ప్రాజెక్ట్ ఖర్చులు, ప్రయాణ భత్యం, రీఅడ్జస్ట్‌మెంట్ అలవెన్స్, భీమా, వసతి సహాయం మరియు ఇంటర్న్‌షిప్ విజయవంతంగా పూర్తి చేసిన తర్వాత సర్టిఫికేట్ కూడా ఇవ్వబడుతుంది.

SBI ఇంటర్న్‌షిప్ 2025: ఎంపిక ప్రక్రియ
రిజిస్ట్రేషన్ ఫారమ్ నింపిన తర్వాత, అభ్యర్థులు ఆన్‌లైన్ అసెస్‌మెంట్‌ను పూర్తి చేయాలి. ఇందులో అభ్యర్థుల దృక్పథం, ఫెలోషిప్‌లో చేరడానికి గల ఉద్దేశ్యం , ప్రపంచ దృక్పథం వంటి అంశాలపై ప్రశ్నలు అడుగుతారు. ఆన్‌లైన్ అసెస్‌మెంట్‌లో షార్ట్‌లిస్ట్ అయిన అభ్యర్థులను ఇంటర్వ్యూ రౌండ్‌కు పిలుస్తారు. ఈ రౌండ్‌లో ప్రోగ్రామ్‌కు అభ్యర్థి యొక్క అనుకూలతను అంచనా వేస్తారు. వ్యక్తిగత ఇంటర్వ్యూ, ఆన్‌లైన్ అసెస్‌మెంట్ , మొత్తం అనుకూలత ఆధారంగా తుది ఎంపిక ఉంటుంది. అన్ని రౌండ్లను విజయవంతంగా పూర్తి చేసిన తర్వాత, ఎంపికైన అభ్యర్థులకు SBI నిర్ణయించిన తేదీన ఫెలోషిప్‌లో చేరడానికి ఆఫర్ లెటర్ పంపబడుతుంది.

ఈ ఫెలోషిప్ గ్రామీణ భారతదేశంలో సానుకూల మార్పు తీసుకురావాలని తపించే యువతకు ఇది ఒక గొప్ప అవకాశం. SBI 'యూత్ ఫర్ ఇండియా' ఫెలోషిప్‌లో పాల్గొనడం ద్వారా మీరు కేవలం ఇంటర్న్‌షిప్ మాత్రమే కాకుండా, ఒక గొప్ప అనుభవాన్ని , నాయకత్వ లక్షణాలను కూడా పొందుతారు. ఆలస్యం చేయకుండా వెంటనే దరఖాస్తు చేసుకోండి!

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+