తెలంగాణలో గెస్ట్ లెక్చరర్ల నియామకానికి నోటిఫికేషన్: వెంటనే అప్లై చేయండి

హైదరాబాద్: తెలంగాణ రాష్ట్రంలో 2023-24 విద్యా సంవత్సరానికి ప్రభుత్వ ఇంటర్ కాలేజీల్లో గెస్ట్ లెక్చరర్ల నియామకానికి ఇంటర్మీడియట్ బోర్డ్ నోటిఫికేషన్ జారీ చేసింది. 1654 గెస్ట్ లెక్చరర్ల పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ జారీ విడుదల చేసింది. జులై 19వ తేదీ నుంచి జులై 24 తేదీ వరకు దరఖాస్తు చేసుకునే అవకాశం కల్పించింది. అర్హత కలిగిన అభ్యర్థులు చివరి తేదీలోగా దరఖాస్తు చేసుకోవచ్చు.

కాగా, గెస్ట్ లెక్చరర్ల నోటిఫికేషన్‌పై గతంలో పనిచేసిన 1654 మంది గెస్ట్ లెక్చరర్లు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. పదేళ్లుగా పనిచేస్తున్న తమను తొలగించి కొత్తగా ఇంటర్ బోర్డ్ నోటిఫికేషన్ జారీ చేయడం సరికాదంటూ వాపోతున్నారు. తెలంగాణ ప్రభుత్వం, ఇంటర్ బోర్డ్ కావాలనే తమను తొలగించారన్నారు. తమకు న్యాయం చేయాలని కోరుతున్నారు.

Telangana inter board releases notification to fill 1654 guest lecturers

తెలంగాణ ఆయూష్‌ విభాగంలో 156 కీలక పోస్టుల భర్తీ

తెలంగాణ రాష్ట్రంలో మరో వందకుపైగా ఉద్యోగాల భర్తీ కానున్నాయి. రాష్ట్ర వైద్యారోగ్య శాఖ ఆయూష్ విభాగంలో 156 మంది వైద్యాధికారుల నియామకానికి ప్రభుత్వం శ్రీకారం చుట్టింది. 54 మంది ఆయుర్వేద, 33 మంది హోమియో, 69 మంది యునానీ వైద్యాధికారులను నియమించనున్నారు.

ఆసక్తి, అర్హత ఉన్న వారు ఆగస్టు 7 నుంచి 22వ తేదీ లోపు ఆన్‌లైన్‌ ద్వారా దరఖాస్తు చేసుకోవాలి. ఈ మేరకు గురువారం విడుదల చేసిన నోటిఫికేషన్‌లో తెలంగాణ రాష్ట్ర వైద్యారోగ్యశాఖ సేవల రిక్రూట్‌మెంట్ బోర్డ్ సూచించింది. అర్హత పరీక్షలో సాధించిన మార్కులు, గతంలో ప్రభుత్వ సర్వీసులో అందించిన సేవలను నియామకానికి ప్రాతిపదికగా తీసుకోనున్నారు. గరిష్ట వయసు ఈ ఏడాది జులై ఒకటో తేదీనాటికి 44 ఏళ్లు ఉండాలి.

మరోవైపు, తెలంగాణ రాష్ట్రంలోని ప్రభుత్వ వైద్య కళాశాలల్లో విధులు నిర్వహిస్తున్న 190 మంది అసోసియేట్ ప్రొఫెసర్లకు అసోసియేట్ ప్రొఫెసర్లుగా పదోన్నతి కల్పిస్తూ రాష్ట్ర వైద్యవిద్య డైరెక్టర్ ఉత్తర్వులు జారీ చేశారు. క్లినికల్, నాన్ క్లినికల్, సూపర్ స్పెషాలిటీ, డెంటల్ విభాగాల్లో విధులు నిర్వహిస్తున్నవారికి పదోన్నతులు కల్పించారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+