తెలంగాణ కేజీబీవీ, యూఆర్ఎస్ పరీక్ష ఫలితాలు విడుదల: ఇలా చెక్ చేసుకోండి
హైదరాబాద్: తెలంగాణ రాష్ట్రంలోని కస్తూర్బా గాంధీ బాలికా విద్యాలయాలు (KGBV), అర్బన్ రెసిడెన్షియల్ స్కూల్స్(URS)లో 1241 పోస్టులకు నిర్వహించిన రాత పరీక్ష ఫలితాలు విడుదలయ్యాయి. కాంట్రాక్ట్ ప్రాతిపదికన టీచింగ్ సిబ్బందిని ఎంపిక చేసేందుకు జులైలో ఆన్‌లైన్ పరీక్షలు జరిగిన విషయం తెలిసిందే.
రాష్ట్ర వ్యాప్తంగా 475 కేజీబీవీలు ఉండగా.. ప్రస్తుతం ఉన్న ఖాళీల్లో 42 స్పెషల్ ఆఫీసర్, 849 పీజీ సీఆర్టీ, 273 సీఆర్టీ, 77 పీఈటీ పోస్టులను కాంట్రాక్ట్ పద్దతిన భర్తీ చేసేందుకు జూన్ 26 నుంచి జులై 5 వరకు ఆన్‌లైన్‌లో దరఖాస్తులు ఆహ్వానించారు.
రాత పరీక్షలో, టెట్‌లో అభ్యర్థులు సాధించిన మార్కుల ఆధారంగా ఈ ర్యాంకులను విడుదల చేశారు. రూల్ ఆఫ్ రిజర్వేషన్‌ను బట్టి అభ్యర్థులను ఎంపిక చేసి తుది జాబితాను విడుదల చేయనున్నారు. మెరిట్ జాబితా నుంచి ఖాళీలకు అనుగుణంగా 1:3 నిష్పత్తిలో అభ్యర్థులను ఎంపిక చేస్తారు.

వెరిఫికేషన్ అనంతరం ఆన్‌లైన్ దరఖాస్తు సమయంలో ఇచ్చిన మొబైల్ నెబర్లకు ఫోన్ చేసి ఎంపికైన అభ్యర్థులకు తెలియజేయనున్నారు. కాగా, ప్రస్తుతం అభ్యర్థులు తమ రిజిస్ట్రేషన్ నెంబర్, హాల్ టికెట్ నెంబర్, పుట్టిన తేదీ వివరాలను ఎంటర్ చేసి ర్యాంకు కార్డులను పొందవచ్చు.
ర్యాంక్ కార్డుల కోసం అభ్యర్థులు ఇక్కడ క్లిక్ చేయవచ్చు.
ఏపీపీఎస్సీ పలు పరీక్షల హాల్ టికెట్లు విడుదల
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో పలు ఉద్యోగాల పరీక్షలకు హాల్ టికెట్లు విడుదలయ్యాయి. ఏపీ ఇనిస్టిట్యూట్ ఆఫ్ ప్రివెంటివ్ మెడిసిన్, పబ్లిక్ హెల్త్ ల్యాబ్స్ అండ్ ఫుడ్ అడ్మినిస్ట్రేషన్ విభాగంలో శాంపిల్ టేకర్ పోస్టులకు రాత పరీక్ష ఆగస్టు 19 నుంచి 21 వరకు నిర్వహించనున్నారు. హాల్‌టికెట్లు కమిషన్ వెబ్‌సైట్‌లో ఉంచామని, పరీక్షకు హాజరయ్యే అభ్యర్ధులు వెబ్‌సైట్ నుంచి హాల్‌టికెట్లు డౌన్‌లోడ్ చేసుకోవాలని ఏపీపీఎస్సీ ప్రకటించింది.
హాల్ టికెట్లు ఆగస్టు 18వ తేదీలోగా డౌన్‌లోడ్ చేసుకోవాలని ఏపీపీఎస్సీ కార్యదర్శి ప్రదీప్ కుమార్ సూచించారు. ఆగస్టు 18 నుంచి 20వ తేదీ వరకు కొన్ని సాంకేతిక కారణాల రిత్య సర్వీస్ కమిషన్ వెబ్‌సైట్‌కు అంతరాయం ఏర్పడుతుందని.. ఈలోపు హాల్‌టికెట్లు డౌన్‌లోడ్ చేసుకోవాలని కార్యదర్శి ప్రదీప్ కుమార్ స్పష్టం చేశారు.
ఆగస్టు 21, 22 తేదీల్లో అసిస్టెంట్ ఎగ్జిక్యూటివ్ ఇంజినీర్స్ (ఏఈఈ) పరీక్ష
వివిధ ప్రభుత్వ విభాగాల్లో ఖాళీగా ఉన్న ఇంజినీరింగ్ సర్వీసుల పోస్టుల భర్తీకి సంబంధించి.. అసిస్టెంట్ ఎగ్జిక్యూటివ్ ఇంజినీర్స్ రాత పరీక్షను ఆగస్టు 21, 22 తేదీల్లో నిర్వహించనున్నట్టు ఏపీపీఎస్సీ తన ప్రకటనలో పేర్కొంది.
ఈ పరీక్ష హాల్ టికెట్లను కమిషన్ వెబ్‌సైట్‌లో ఉంచినట్టు కమిషన్ కార్యదర్శి ప్రదీప్ కుమార్ తెలిపారు. కంప్యూటర్ బేస్డ్ టెస్ట్ (సీబీటీ) విధానంలో ఆగస్టు 21వ తేదీన మధ్యాహ్నం, ఆగస్టు 22వ తేదీన ఉదయం, మధ్యాహ్నం ఈ పరీక్ష ఉంటుందని ఆయన తెలిపారు.
ఆంధ్రప్రదేశ్ టౌన్ అండ్ కంట్రీ ప్లానింగ్ విభాగంలో టౌన్‌ప్లానింగ్ అండ్ బిల్డింగ్ ఓవర్‌సీర్ పోస్టులకు ఆగస్టు 18వ తేదీన నిర్వహించనున్న రాత పరీక్షకు సంబంధించిన హాల్‌టికెట్లు విడుదల చేసినట్లు ఏపీపీఎస్సీ వెల్లడించింది. ఆగస్టు18న ఈ పరీక్ష ఉదయం, మధ్యాహ్నం జరుగుతుంది. అభ్యర్ధులు అధికారిక వెబ్‌సైట్ నుంచి హాల్ టికెట్లు డౌన్‌లోడ్ చేసుకోవచ్చని కమిషన్ కార్యదర్శి ప్రదీప్ కుమార్ వివరించారు.
వివిధ పరీక్షల హాల్ టికెట్ల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.












Click it and Unblock the Notifications