టీజీ ఈసెట్ ఫలితాలు విడుదల.. ఎలా చెక్ చేసుకోవాలంటే ?
తెలంగాణలో ఈసెట్ ఫలితాలు ఫలితాలు విడుదల అయ్యాయి. ఉన్నత విద్యామండలి చైర్మన్ ప్రొఫెసర్ బాలకిష్టారెడ్డి, ఓయూ వీసీ ప్రొఫెసర్ ఎం కుమార్, ఈసెట్ కన్వీనర్ పి.చంద్రశేఖర్.. ఈ ఫలితాలను విడుదల చేశారు. ఓయూ ఇంజినీరింగ్ కళాశాలలో ఈ కార్యక్రమం నిర్వహించారు. విద్యార్థులు అధికారిక వెబ్‌సైట్‌లో తమ వివరాలు నమోదు చేసుకుని ర్యాంకు కార్డులు డౌన్‌లోడ్ చేసుకోవచ్చు.
ఈ నెల 12న నిర్వహించిన ఈ పరీక్షను మొత్తం 18,998 మంది రాశారు. రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న కాలేజీల్లో 2025-2026 విద్యా సంవత్సరానికి బీఈ, బీటెక్, బీఫార్మసీ కోర్సుల్లో లేటరల్ ఎంట్రీ విధానంలో నేరుగా ప్రవేశాలు కల్పించనున్నారు. ఇందులో వచ్చిన ర్యాంకు ఆధారంగా పాలిటెక్నిక్, బీఎస్సీ గణితం కోర్సులు పూర్తిచేసిన వారికి బీటెక్ సెకండియర్‌లో ప్రవేశాలు కల్పించనున్నారు.













Click it and Unblock the Notifications