గ్రూప్ 2, గ్రూప్ 3 పరీక్ష తేదీలపై టీజీపీఎస్సీ క్లారిటీ
తెలంగాణ పబ్లిక్ సర్వీస్ కమిషన్ (TGPSC) గ్రూప్2, గ్రూప్3 పరీక్ష తేదీలపై స్పష్టతనిచ్చింది. 783 గ్రూప్ పోస్టులను, 1388 గ్రూప్ 3 పోస్టులను టీజీపీఎస్సీ భర్తీ చేయనున్న విషయం తెలిసిందే. అయితే, గ్రూప్ 2 ప్రిలిమ్స్ పరీక్షలను నవంబర్ 17, 18 తేదీల్లో నిర్వహించనున్నట్లు.. గ్రూప్ 3 పరీక్షలు నవంబర్ 24, 25వ తేదీల్లో నిర్వహించనున్నట్లు సోషల్ మీడియాలో ప్రచారం జరుగుతోంది.
ఈ నేపథ్యంలో టీజీపీఎస్సీ స్పందించింది. పరీక్షల తేదీలపై వస్తున్న వార్తల్లో వాస్తం లేదని తెలిపింది. తాము గ్రూప్ 2, గ్రూప్ 3 పరీక్షల తేదీలపై ఎలాంటి ప్రకటన చేయలేదని టీజీపీఎస్సీ స్పష్టం చేసింది. గ్రూప్ 2, గ్రూప్ 3 పరీక్షలు షెడ్యూల్ ప్రకారమే జరుగుతాయని పేర్కొంది.

ఇది ఇలావుండగా, గ్రూప్ 2, గ్రూప్ 3 పోస్టుల సంఖ్యపెంచాలని అభ్యర్థులు డిమాండ్ చేస్తున్నారు. అలాగే ఈ పరీక్షలను వాయిదా వేయాలని కోరుతున్నారు. గ్రూప్ 3లో 1388 పోస్టుల నుంచి 3000 పోస్టుల వరకు పెంచాలని, గ్రూప్ 2 పోస్టులను 783 నుంచి 2000 వరకు పెంచాలని అభ్యర్థులు డిమాండ్ చేస్తున్నారు. మరోవైపు, గ్రూప్ 2 పోస్టులను 2వేలకు పెంచాలని మాజీ మంత్రి హరీశ్ రావు కూడా డిమాండ్ చేశారు.
గ్రూప్ 2, 3 పరీక్షలను ఈ ఏడాది డిసెంబర్ వరకు వాయిదా వేయాలని, జీవో నెంబర్ 46ను రద్దు చేయాలని అభ్యర్థులు కోరారు. కాగా, పోస్టుల సంఖ్యను పెంచాలని ఇప్పటికే సీఎం రేవంత్ రెడ్డికి పలువురు నేతలు, ఉద్యోగాల సంఘాల నాయకులు విజ్ఢప్తి చేశారు.
కాగా, టీజీపీఎస్సీ గ్రూప్ 2 ఉద్యోగాల భర్తీకి రాతపరీక్షను ఆగస్టు 7, 8 తేదీల్లో నిర్వహిస్తామని తెలిపింది. గ్రూప్ 3 ఉద్యోగాలకు రాత పరీక్షను నవంబర్ 17, 18 తేదీల్లో పరీక్షలను నిర్వహిస్తామని టీజీపీఎస్సీ వెల్లడించింది.
-
అంచనాలను తలకిందులు చేస్తోన్న బంగారం ధరలు -
ఉగాది నుంచి వృషభరాశి, మేషరాశి వారి జాతక ఫలం -
Work From Home ఇచ్చేశారు. ప్రభుత్వం, ఐటీ దిగ్గజాల కీలక ప్రకటన! -
ICC T20I ర్యాంకింగ్స్: దూసుకొచ్చిన సంజూ, ఇషాన్ - అభిషేక్ ఏ స్థానంలో..!! -
రైతులకు శుభవార్త.. రైతు భరోసాపై కీలక ప్రకటన చేసిన మంత్రి! -
తమిళ నాట అధికారం వారిదే, విజయ్ కు దక్కే సీట్లెన్ని- తేల్చేసిన కేకే సర్వే..!! -
2024 నాటి భీభత్సం మళ్లీ వస్తుంది: ఈ వేసవి చాలా కాలం ఉంటుంది! -
ఉగాది నుంచి మిథున రాశి, కర్కాటక రాశి వారి జాతక ఫలం -
ఇన్నాళ్లూ ఆచితూచి- ఇప్పుడు ప్రధాని మోదీపై సీఎం డైరెక్ట్ అటాక్? -
భారత్‌పై అమెరికా దర్యాప్తు. సెక్షన్ 301 ప్రయోగించిన ట్రంప్ -
దేశంలో తొలి `కారుణ్య మరణం`- తీర్పు చెబుతూ కన్నీళ్లు పెట్టిన సుప్రీంకోర్టు ధర్మాసనం -
తెలంగాణ నూతన డీజీపీ ఖరారు, అనూహ్య ఎంపిక..!!












Click it and Unblock the Notifications